pizza
ఏప్రిల్ 3న విడుదలవుతున్న ‘మిస్ లీలావతి’
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 March 2015
Hyderabad

కీ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజాజీ ఎంటర్ టైన్మెంట్స్ లో శ్రావ్య ఫిలింస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ’స్ లీలావతి. కార్తీక్, లీలావతి, మహేష్ ప్రధానపాత్రధారులు. యెక్కలి రవీంద్రబాబు నిర్మాత. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘’మేం ఇప్పటి వరకు తీసిన చిత్రాలన్నింటికి విమర్శలు వచ్చాయి. ప్రశంసలు కూడా వచ్చాయి. వాటన్నింటిని స్వీకరిస్తూ ముందుకుసాగుతున్నాం. వైజాగ్ లో నా మిత్రడు ఒకాయన పోలీస్ గా పనిచేస్తున్నాడు. ఈ సోసైటీలో అక్రమసంబంధాలు కారణంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని రిలేషన్ షిప్ డైల్యూట్ అవుతుంది. ఈ పాయింట్ మీద వర్కవుట్ చేస్తావా అని అడిగారు. అలాంటి సందర్భంలోనే హుదూద్ సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత ఈ మిస్ లీలావతి కథను తయారుచేశాను. ఈ ప్రపంచంలో జరిగే ఉపద్రవాలన్నింటికీ మనిషే కారణం. ప్రకృతికి, పురుషుడికి, స్త్రీకి, పురుషుడికి మధ్య రిలేషన్ బ్యాలెన్స్ డ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఏ ఉపద్రవం రాదు. దాన్ని దాటినప్పుడే ప్రమాదం. సూటిగా సుత్తి లేకుండా సాగే సినిమా ఇది. మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రవీణ్ మంచి సంగీతం ఇచ్చాడు. సాంగ్స్ పై మొంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమాని ఈ ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నాం. ఆడియో విడుదల ఏప్రిల్ 6న ఉంటుంది. తప్పుకుండా ఒక మెసేజ్ ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత యెక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ ‘’మంచి స్టోరి. అన్నీ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమాని ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నాం. ఆడియో విడుదల ఏప్రిల్ 6న ఉంటుంది’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ ‘’నాకు ఇండస్ట్రీతో 35ఏళ్ల అనుబంధం ఉంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుండి ఇక్కడే పనిచేస్తున్నాను. సునీల్ కుమార్ రెడ్డిగారితో పదేళ్ల నుండి పనిచేస్తున్నాను. ఈ కాలంలో ఏ సినిమాలు తీసినా ఒక మెసేజ్ ఇస్తూ వచ్చాం. అలాగే ఈ సినిమాలో ఓ మెసేజ్ ఉంటుంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ ఎస్.వి.శివరాం, కార్తీక్, మహేష్ తదితరలు పాల్గొన్నారు. .

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved