pizza
Miss Shetty Mr Polishetty Q & A session
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఒక యూనిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు పి.మహేశ్ బాబు.
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 September 2023
Hyderabad

'Miss Shetty Mr. Polishetty' is a unique romantic family entertainer - hero Naveen Polishetty & director Mahesh Babu P

'Miss Shetty Mr. Polishetty' is a romantic family entertainer in the combination of Naveen Polishetty and star heroine Anushka Shetty. This movie is produced by Vamsi and Pramod under the banner of famous production company UV Creations under the direction of Mahesh Babu.P. On the 7th of this month, 'Miss Shetty Mr. Polishetty' is getting ready for worldwide release in Telugu, Tamil, Kannada and Malayalam languages.

In this background, the movie team held a Q&A press meet with the media. 'Miss Shetty Mr. Polishetty' ticket booking announcement was made with media friends. On this occasion,

Hero Naveen Polishetty said - After 'Miss Shetty Mr. Polishetty' trailer release, I was amazed to see the way the audience received the trailer, our confidence has increased. It felt like the point we were going to make the film that would connect with the audience. Our movie will release on Krishnashtami day, this movie will be as riotous as Krishna. Recently I got a good response to the standup tour I did as promotions. I interacted with the audience at all places like Vijayawada, Guntur, Ongole, Nellore, Rajahmundry, Karimnagar, Warangal. They are waiting about our film. We are going on a US tour from the 6th of this month.

- I have heard many stories after making Jathi Ratnalu movie. I waited to select a good story that would match the success of Jathi Ratnalu. I stayed in that trance for a while when Mahesh narrated me this story. This is such a good story. Characters have weight. There are good emotions in the movie. There is scope for performance. So we started 'Miss Shetty Mr. Polishetty'. He did not make another film even with lot of delays, he devoted full time to this film.

- Promotion is like a bridge that takes every movie to the audience. Apart from who is doing the promotion, how much we reach our film to the audience is important. I do not meet anyone during the shooting time of the film. I will stay in the world of that movie. We get stressed during the shooting time. But I enjoy the promotion tour. If the audience likes it, they will take the film no matter how far it is from the box office. Shah Rukh Khan's movie Jawan is also coming on our movie date. I am a huge Shah Rukh Khan fan. Shah Rukh showed how a middle class youth can become a big star. He is my inspiration. We believe that our audience will love all Bollywood and Tollywood movies. The movie is clean entertainer. There is a bold dialogue in the trailer. But there is a reason for that dialogue. You will enjoy that too. When I came to know that I am acting with Anushka, I didn't react much on the outside, but inside I felt very happy. Anushka's Arundhathi movie is my favorite movie. It was a pleasure to act with her. After watching the movie you will know why we made these two characters. We don't have much time for the release of our movie, so we are not able to go to some other places. Audience are asking from other countries to come from UK to visit there. But we are only able to go the US tour.

- I was impressed by the standup comedy character in this story. There is a lot of demand out there for standup comedy. No one is looking down on this art form. We have tried to introduce Telugu standup comedy to the Telugu audience. We shot in real standup comedy studios. We have done research to do standup comedy correctly and done it perfectly.

- Story is more important than director, banner and hero. That story should have emotion, good characters and entertainment. That story is in our movie. So we don't see whether our director is senior or junior. This romantic entertainer will have a new angle. It was impressive for me and Anushka. We showed our trailer to Nagarjuna. He liked it. I entered the Bigg Boss house as the 15th contestant. The episode was good. It's going to telecast today. I believe that if a film is made in UV company, the audience will have more reach and the distribution will be done well.

- If the story is good, so if I have an exciting role, I will definitely do it with another star hero. Many people go to Bollywood from Tollywood. But I did a film there and came here. If I get a good story, I will act in Hindi again. Today Telugu cinema statistics have changed. There is a lot of growth. The reason for that is the Telugu audience. The reason is the love they show for movies.

Director P. Mahesh Babu said - Media is supporting our film from the beginning. We are confident in the success of 'Miss Shetty Mr. Polishetty'. We have screened some shows recently. The response to those shows was very good. I read it in a paper with the heading "Polishetty with Shetty". We fixed the title Miss Shetty and Mr. Polishetty with that rhyming. If you think that what you saw in our trailer is 30 percent, the movie will have 70 percent emotion and entertainment. The whole movie feels like a beautiful journey.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఒక యూనిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు పి.మహేశ్ బాబు.

న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ నెల 7వ తేదీన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మీడియాతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ఫ్రెండ్స్ తో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టికెట్ బుకింగ్స్ అనౌన్స్ మెంట్ చేయించారు. ఈ సందర్భంగా

హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ - ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు చూస్తుంటే మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము సినిమాలో చెప్పబోతున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపించింది. కృష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది, కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది. రీసెంట్ గా నేను మా సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టాండప్ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ ఇలా అన్ని చోట్ల ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాను. వారు మా సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 6న తేదీ నుంచి యూఎస్ టూర్ కు వెళ్తున్నాం. అక్కడి వివిధ స్టేట్స్ లో ప్రేక్షకుల్ని కలవబోతున్నా.

- జాతి రత్నాలు మూవీ చేసిన తర్వాత చాలా కథలు విన్నాను. జాతి రత్నాలు సినిమా సక్సెస్ కు మ్యాచ్ అయ్యే మంచి మూవీ సెలెక్ట్ చేసుకోవాలని వేచి చూశాను. మహేశ్ ఈ కథ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్ లో కొద్ది సేపు ఉండిపోయా. అంత మంచి కథ ఇది. క్యారెక్టర్స్ కు వెయిట్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉంది. దాంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మొదలుపెట్టాం. ఈ సినిమాకు పూర్తి సమయం కేటాయించాలనే మరో సినిమా చేయలేదు. కోవిడ్ రావడం వల్ల నేను ఆలస్యంగా మూవీ చేసినట్లు అనిపిస్తుంటుంది.

- ప్రమోషన్ అనేది ప్రతి సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే బ్రిడ్జి లాంటిది. ఎవరు ప్రమోషన్ చేస్తున్నారనేది కాకుండా మా సినిమాను ఆడియెన్స్ దగ్గరకు ఎంత రీచ్ చేశామనేది ముఖ్యం. సినిమా షూటింగ్ టైమ్ లో నేను ఎవర్నీ కలవను. ఆ సినిమా ప్రపంచంలోనే ఉండిపోతాను. షూటింగ్ టైమ్ లో స్ట్రెస్ అవుతాం. కానీ ప్రమోషన్ టూర్ లో ఎంజాయ్ చేస్తుంటాను. ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ దగ్గర ఎంత దూరమైనా సినిమాను తీసుకెళ్తారు. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కూడా మా మూవీ డేట్ కే వస్తోంది. నేను షారుఖ్ అభిమానిని. ఒక మిడిలి క్లాస్ యువకుడు ఎంత పెద్ద స్టార్ అవగలడు అనేది షారుఖ్ చూపించారు. నాకు ఆయన ఇన్సిపిరేషన్. మన ప్రేక్షకులు బాలీవుడ్, టాలీవుడ్ అన్ని సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ట్రైలర్ లో ఒక బోల్డ్ డైలాగ్ ఉంది. కానీ ఆ డైలాగ్ కు ఒక రీజన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అనుష్కతో కలిసి నటిస్తున్నా అని తెలిసినప్పుడు పైకి నేను పెద్దగా రెస్పాండ్ అవలేదు గానీ లోపల చాలా హ్యాపీగా అనిపించింది. అనుష్క గారి అరుంధతి సినిమా నా ఫేవరేట్ మూవీ. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉండేది. మేమే ఈ రెండు క్యారెక్టర్స్ ఎందుకు చేశామనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. మా సినిమా రిలీజ్ కు ఎక్కువ టైమ్ లేదు అందుకే మరికొన్ని ప్లేసెస్ కు వెళ్లలేకపోతున్నా. యూకే నుంచి ఇతర దేశాల నుంచి అడుగుతున్నారు రమ్మని. కానీ యూఎస్ టూర్ మాత్రమే వెళ్లగలుగుతున్నా.

- ఈ కథలో హీరోకున్న స్టాండప్ కామెడీ క్యారెక్టర్ నన్ను ఆకట్టుకుంది. స్టాండప్ కామెడీకి బయట చాలా డిమాండ్ ఉంది. ఈ ఆర్ట్ ఫామ్ ను ఎవరూ చిన్నచూపు చూడటం లేదు. తెలుగు ఆడియెన్స్ కు తెలుగు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని ప్రయత్నం చేశాం. రియల్ గా స్టాండప్ కామెడీ స్టూడియోస్ లో షూట్ చేశాం. స్టాండప్ కామెడీని కరెక్ట్ గా చేయాలని రీసెర్చ్ జరిపి, పక్కాగా చేశాం.

- దర్శకుడు, బ్యానర్, హీరో అన్నింటికంటే కథ అనేది ముఖ్యం. ఆ కథలో ఎమోషన్, మంచి క్యారెక్టర్స్, ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి. ఆ కథ మా సినిమాలో ఉంది. కాబట్టి మా డైరెక్టర్ సీనియరా, జూనియరా అనేది చూడలేదు. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. అది నాకూ, అనుష్క గారికి ఇంప్రెసివ్ గా అనిపించింది. నాగార్జున గారికి మా ట్రైలర్ చూపించాం. ఆయనకు నచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి 15వ కంటెస్టెంట్ గా వెళ్లాను. ఎపిసోడ్ బాగా వచ్చింది. ఇవాళ అది టెలికాస్ట్ అవుతుంది. యూవీ సంస్థలో సినిమా చేస్తే ఆడియెన్స్ కు మరింత రీచ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తారని నమ్మాను.

- కథ బాగుండి, అందులే నాకు ఎగ్జైటింగ్ రోల్ ఉంటే తప్పకుండా మరో స్టార్ హీరోతో కలిసి చేస్తాను. చాలా మంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్తారు. కానీ నేను అక్కడ సినిమా చేసి ఇక్కడికి వచ్చాను. మంచి కథ దొరికితే మళ్లీ హిందీలో నటిస్తా. ఇవాళ తెలుగు సినిమా స్టాటిటిక్స్ మారాయి. చాలా గ్రోత్ ఉంది. దానికి కారణం తెలుగు ఆడియెన్స్. వారు సినిమాలపై చూపించే ప్రేమే కారణం.

దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ - మా సినిమాకు మీడియా మొదటినుంచీ సపోర్ట్ చేస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. రీసెంట్ గా కొన్ని షోస్ వేసుకుని చూశాం. ఆ షోస్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్ లో చదివా. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశాం. మా ట్రైలర్ లో చూసింది 30 పర్సెంట్ అనుకుంటే సినిమాలో 70 పర్సెంట్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది. అన్నారు.


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved