త్రిష టైటిల్ పాత్రధారిగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలుగా రూపొందిన చిత్రం `నాయకి`. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు....
మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ``నిర్మాతగా నా రెండవ చిత్రం. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం హర్రర్ కామెడి నేపథ్యంలో తెరకెక్కింది. సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను జూలై 15న విడుదల చేస్తున్నాం. దర్శకుడు గోవి సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ``గిరిధర్, గోవి ఇద్దరూ నాకు మంచి మిత్రులు. ఇద్దరికీ ఈ నాయకి చిత్రం రెండవ చిత్రం. ఇది పెద్ద సక్సెస్ కావాలని ఇద్దరికీ శుభాకాంక్షలు. సినిమా మంచి బిజినెస్‌ను పూర్తి చేసుకుని ఈ నెల 15న విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ``నేను, గిరిధర్ రూమ్మేట్స్. నిర్మాతగా మారిన గిరిధర్ చేసిన రెండో చిత్రం నాయకి. ఈ జూలై 15న విడుదలవుతుంది. అన్నీ ఎలిమెంట్స్ కలగలిపి దర్శకుడు గోవి సినిమాను చక్కగా తెరకెక్కించాడు. రఘుకుంచె మంచి చిత్రమవుతుంది. తనకు మంచి బ్రేక్ వస్తుంది. సినిమా రీరికార్డింగ్ బాగా కుదిరింది. సినిమా పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రఘు కుంచె మాట్లాడుతూ``సినిమా చాలా ఆసక్తిగా సాగుతుంది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. నిర్మాత గిరిధర్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. త్రిషతో ఓ పాట కూడా పాడించాను. రెగ్యులర్ హర్రర్ చిత్రంలా డిఫరెంట్‌గా నిలబడుతుంది`` అన్నారు.
దర్శకుడు గోవి మాట్లాడుతూ``గిరిధర్‌గారు లేకుంటే ఈ సినిమా లేదు. ప్లాప్ దర్శకుడికి తెలుగు, తమిళంలో సినిమా ఇవ్వడం ఆయనకే సాధ్యం. చిన్న సినిమాగా స్టార్ట్ చేశాం కానీ పెద్ద సినిమా అయ్యింది. అనుకున్న రీతిలో సినిమాను పూర్తి చేశాం. తమ సినిమాగా భావించి సినిమాను పూర్తి చేయడంలో సపోర్ట్ చేశారు. రెగ్యులర్ హర్రర్ చిత్రం కాదు. రెట్రో హర్రర్ కామెడి చిత్రం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా జూలై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.