pizza
Nuvvu Nenu Osey Orey press meet
ఏప్రిల్ 7న `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్` విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 April 2017
Hyderaba
d

అర్జున్ మ‌హి, అశ్విని హీరో హీరోయిన్లుగా శ్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ర‌విచంద్ర క‌న్నికంటి ద‌ర్శ‌క‌త్వంలో వీర‌గంగాధ‌ర్ రిమ్మ‌ల‌పూడి నిర్మాత‌గా రూపొందిన చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్`. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఏప్రిల్ 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా....

అశ్విని మాట్లాడుతూ - ``మూవీ టైటిల్ చాలా కొత్త‌గా ఉంది. మంచి ఎంట‌ర్ టైనింగ్ సినిమా. డైరెక్ట‌ర్ ర‌విచంద్ర‌గారు సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. గోదావ‌రి తీర‌ప్రాంతాల్లో సినిమా అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో రూపొందింది. క‌థ‌లో మంచి ట్విస్ట్ ఉంది. పృథ్వి చేసిన లుంగి డ్యాన్స్ క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. ఏప్రిల్ 7న విడుద‌ల‌వుతున్న మా చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అర్జున్ మ‌హి మాట్లాడుతూ - ``మా చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్` ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంజాయ్ చేస్తారు. హీరోగా నేను చేస్తున్న మూవీ ఇది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్క‌డా ఉండ‌వు. సుమ‌న్ జూపూడి అందించిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అశ్విని మంచి కోస్టార్‌. మంచి టీం అంతా క‌లిసి చేసిన మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam gallery from the event

డైరెక్ట‌ర్ ర‌విచంద్ర కన్నికంటి మాట్లాడుతూ - ``సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. నిర్మాత వీర గంగాధ‌ర్ రిమ్మ‌ల‌పూడి నా మిత్రుడు. నేను చెప్పిన క‌థ విన‌గానే ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. సినిమా అవుట్‌పుట్ చ‌క్క‌గా వ‌చ్చింది. సెన్సార్ కార్య‌క్ర‌మం పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాలో ఐదు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పృథ్వీగారు మంచి క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తారు. ఆయ‌న స్పెష‌ల్ సాంగ్‌లో కూడా న‌టించారు. ఏప్రిల్ 7న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకంటున్నాను`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved