రమ్యశ్రీ ప్రధానపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఓమల్లి. ఆర్.ఎ.ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మార్చి 18న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో....
బి.రమ్యశ్రీ మాట్లాడుతూ ‘’సినిమాను చాలా కష్టపడి చేశాను. అందరికీ ఈ విషయం తెలిసిందే. సినిమా కోసం ఒంటరి పోరాటం చేశాను. ఇది కమర్షియల్ సినిమా టైప్ కాదు, డిఫరెంట్ మూవీ. నాకు థియేటర్స్ దొరక్క చాలా సమస్యలు ఫేస్ చేశాను. అన్నీ సమస్యలను దాటి సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నాం. అప్పటికీ క్రికెట్, ఎగ్జామ్స్ కూడా పూర్తయిపోయి ఉంటాయి. ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలు రెడీ చేస్తున్నాను. ఓ గ్రామంలోని మహిళ యదార్థ కథతో తీసిన సినిమా. సందేశాత్మకంగా కూడా ఉంటుంది’’ అన్నారు.