29 January 2015
Hyderabad
గణేష్ క్రియేషన్స్ , ప్రొడక్షన్ నెం. 2 "పడమటి సంధ్యా రాగం లండన్ లో " చిత్రం విజయవంతంగా లండన్ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది , 95% లండన్ లో నిర్మించిన ఈ చిత్రం, 2014 జూలై లో షూటింగ్ అట్టహాసంగా లండన్ లో మొదలై పాటలు కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది . బాలన్స్ 5% ఇండియా లో త్వరలోనే షూటింగ్ పూర్తి చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి సినిమా నిర్మాత లండన్ గణేష్ , దర్శకుడు వంశీ మునిగంటి ,హీరో చైతు శాంతారాం మరియు సహా నిర్మాతలు , నటినటా వర్గం ,సాంకేతిక విభాగం కి ప్రత్యేక అభినందనలు తెలిపారు ... ఈ చిత్రానికి అతిధి పాత్రలో నటించిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ," ఎప్పటి నుండో తన మనసులో వెండి తెర మీద నటించాలనే ఉండిపోయిన కోరిక ఈ విధంగా నేర వేరిందని , చక్కటి కధాంశం ఎంచుకొని మంచి చిత్రాన్ని దర్శక నిర్మాతలకు నిర్మిస్తున్నారని ,ఈ సినిమా కి తన వంతు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
80 దశకం లో జంధ్యాల గారి దర్శకత్వం లో వచ్చిన "పడమటి సంధ్యారాగం ", అదే జనార్ లో సమకాలిన పరిస్థితిలో భారత దేశం , బ్రిటన్ దేశం లో కల్చర్ కి సంబంధించి అక్కడ స్థిరపడిన తెలుగు వారి జీవితాలలో ఏ విదమైన మార్పులు వస్తున్నాయో అంతర్లీనంగా చూపిస్తూ , దానిని హృద్యమైన ప్రేమ కధ తో మేళవించి ,వినసోంపైన సంగీతం తో అందరిని అలరించేలా ఈ చిత్రం రుపొందిదని పేర్కొన్నారు దర్శక నిర్మాతలు. తప్పకుండ అందరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
గణేష్ క్రియేషన్స్ మొదటి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ "Q ప్రేమకు చావుకు " కూడా రిలీజ్ కి సిద్దం అయిందని , త్వరలో ప్రేక్షకులకు ముందుకు రాబోతుందని , అందరు సినిమాను చూసి ఆశిర్విదించాలని నిర్మాత లండన్ గణేష్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో తెలుగు NRI లో తో పాటు , ముఖ్య అతిధి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ,ఐన సతి మని మరియు లండన్ తెలుగు సంఘం మాజీ చైర్మన్ శ్రీధర్ వనం , ఫౌండర్ రాములు దసోజు ,డాక్టర్ రాజు పాల్గొని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు... ఇదే కార్యక్రమనకి తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపి కలవకుంట్ల కవిత తన లండన్ పర్యటన లో ఈ చిత్రా నిర్మాతకి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.