నిర్మాత మాట్లాడుతూ ``నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌ని. నేను డిపార్ట్ మెంట్‌లో ఉన్నప్పటి నుంచి పోలీస్ పవర్ అంటే ఏంటో చూపించే చిత్రం చేయాలనుకునేవాడిని. అలాంటి దమ్మున్న కథ నాకు దొరకేదు. కానీ ఇప్పుడు శివగారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను తీస్తున్నా. ఇందులో ఐదు పాటలున్నాయి. పాటలు అన్నీ బావున్నా పోలీస్ ఆశయానికి, జీవితానికి సంబంధించిన టైటిల్ సాంగ్ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రాన్ని పోలీస్ అమరవీరులకు అంకితమిస్తున్నాం. పోలీస్ డే సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నాం`` అని చెప్పారు.
శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ ``ఇటీవల జరిగిన కాల్‌మని యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను రూపొందిస్తున్నాం. సారథి స్టూడియోలో 300 మంది జూ.ఆర్టిస్టుల మధ్య ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఫైట్ మాస్టర్ అవినాష్‌గారి సారథ్యంలో 30 మంది ఫైటర్స్ తో షూటింగ్ చేస్తున్నాం. 50 శాతం షూటింగ్ పూర్తయింది`` అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్.కుమార్, ఫైట్స్: అవినాష్, నిర్మాత: గుద్దేటి బసవప్ప మేరు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, డ్యాన్స్, సంగీతం, దర్శకత్వం: శివ జొన్నలగడ్డ.