భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్ ప్రధానపాత్రలో భరత్, అర్జున్, వెంకటేష్, అక్షయ్, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
ఎస్.వి.ఆర్. అధినేత్రి సి.జె.శోభారాణి మాట్లాడుతూ ‘’’సినిమా చూడగానే చాలా థ్రిల్ ఫీలయ్యాను. నటీనటులందరూ కొత్తవారయినా చక్కగా నటించారు. నలుగురు దొంగలకు సంబంధించిన కథ. ఈ సినిమాను మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు హ్యపీగా ఉంది. సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. తప్పకుండా అందరూ మెచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.
దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ ''భరత్ ఈ సినిమాకు డబ్బే కాదుహార్డ్ వర్క్ తో చేశాడు. 'హర్రర్, కామెడి, థ్రిల్లర్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.కనిష్క్ నాలుగు అద్భుతమైన సాంగ్స్‌ను, రీరికార్డింగ్‌ను అందించారు. ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. సస్పెన్స్, హర్రర్, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. టైట్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఫిభ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతుంది’’ అన్నారు.
హీరో,నిర్మాత భరత్ మాట్లాడుతూ ''కామెడి బేస్‌డ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఫిరోజ్ రాజ సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. కనిష్క్ సంగీతం చాలా బావుంది. యూనిట్ అందరం కష్టపడి చేశాం. సినిమా బాగా వచ్చింది. శోభారాణిగారి చేస్తున సహాయం మరచిపోలేనిది. ఆమెకు మాటలతో చెప్పి రుణం తీర్చుకోలేం. కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, ప్లంబర్ పని చేసే నలుగురు యువకులు ఏ పరిస్థితుల్లో జైలుకెళ్ళారు. ఈ కథకు వారికేం సంబంధం అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దెయ్యాలుంటాయా? లేవా? అనే విషయాన్ని కూడా ఇందులో చెప్పాను. సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్‌లకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. ఫిభ్రవరి 26న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ క్రాంతి, అర్జున్, సుష్మిత, త్రివేణి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, నిర్మాత: భరత్‌కుమార్ పీలం, రచన, దర్శకత్వం: ఫిరోజ్ రాజ.