28 December 2015
Hyderabad
అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా `రాజుగారింట్లో 7వ రోజు`. భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతోంది. ఫిరోజ్ రాజ దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ కుమార్ పీలం నిర్మాత. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``ఈ మధ్య కాలంలో హారర్ సబ్జెక్ట్ తో వస్తోన్న సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. కంటెంట్ బావుంటే ఆదరణ దక్కుతోంది. ట్రైలర్స్, పాటలు చాలా బావున్నాయి. కచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది`` అని తెలిపారు.
మల్టీ డైమన్షన్ వాసు మాట్లాడుతూ ``సినిమా టైటిల్ బావుంది. ట్రైలర్స్, పాటలు చాలా కొత్తగా అనిపించాయి`` అని అన్నారు.
శోభారాణి మాట్లాడుతూ ``సినిమా చాలా ఇన్నొవేటివ్‌గా అనిపించింది. సస్పెన్స్ తో సాగే సినిమా. దెయ్యం ఉన్న ఇంట్లో నలుగురు ఖైదీలు ఉంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఫిరోజ్ చాలా బాగా దర్శకుడు చేశాడు. ఈ సినిమాను మా సంస్థ ద్వరా విడుదల చేయడం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ``క్రైమ్ ఆధారంగా రూపొందిన హారర్ సినిమా ఇది. స్క్రీన్ ప్లే బావుంటుంది. ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు`` అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ``మూవీ ఔట్‌పుట్ బాగా వచ్చింది. చక్కటి హారర్ సినిమా ఇది. మొత్తం నాలుగు పాటలుంటాయి. ఇటీవలే సెన్సార్‌ను పూర్తి చేశాం. యు/ఎ వచ్చింది`` అని తెలిపారు.
ఈ సినిమాకు నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన-దర్శకత్వం: ఫిరోజ్ రాజ, కెమెరా: క‌్రాంతి.కె.కుమార్, సంగీతం: కనిష్క్, ఎడిటర్: అనిల్.