సాయిబాబాగా షిర్దిసాయిమహత్య్వం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విజయచందర్ దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబాగా నటిస్తున్నారు. శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సమర్పణల రూపొందుతున్న సాయేదైవం చిత్రంలో విజయచందర్ బాబాగా నటిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ బాబా గుడిలో ప్రారంభమైంది. సాయిబాబా భక్తుల అనుభవాల నేపథ్యంల తీస్తున్న ఈ చిత్రంలో భక్తులకు దర్శనమిస్తూ, ఉపదేశం అందించే సన్నివేశాలను చిత్ర దర్శకుడు, నిర్మాత జి.యల్.బి. శ్రీనివాస్ చిత్రీకరించారు. విజయచందర్ బాబాగా నటించడానికి అంగీకరించడం తమ అదృష్టమని, బాబా భక్తులకు కూడా ఇది ఆనందం కలిగిస్తుందని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం పతాకసన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాం. దీంత సినిమా మోత్తం పూర్తవుతుంది. ఈనెలాఖరన ఆంధ్రప్రదేశ్ లో, వచ్చే నెలల పాటలను విడుదల చేసి, మేల సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు.
చాలా విరామం తర్వాత బాబాగా నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా విజయచందర్ చెప్పారు. మళ్లీ బాబాగా ఎలా నటిస్తానో అనే సంశయం ఉండేది. కానీ గెటప్ వేసుకున్నాక సంతృప్తి కలిగింది. చిత్ర కథ నచ్చడంతో బాబాగా నటించడానికి అంగీకరించినట్టు తెలిపారు.
మాటల రచయిత, సంగీత దర్శకుడు ఘటికాచలం మాట్లాడుతూ ఇలాంటి కథాంశంతో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. బాబా భక్తులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. పాటలు చాలా బాగా వచ్చాయి. అని చెప్పారు. గీతరచయిత బిక్కి కృష్ణ తనకు ఈ సినిమాలో మెుత్తం పాటలు పాటలు రాసే అవకాశం వచ్చిందని, ఇది తన అదృష్టమని చెప్పారు.
అవధూత పాత్రధారి చదలవాడ హరిబాబు మాట్లాడుతూ అవదూతకు, బాబాకు మధ్య జరిగే సంభాషణ కంటతడిపెట్టిస్తుందన్నారు.
నిర్మాతలు భవాని అర్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జి.ఎస్. రామకృష్ణ సినిమా ప్రోగ్రెస్ ను వివరించారు.
ఈ చిత్రంలో విజయచందర్, చంద్రమోహన్, సుమన్, సూర్య, ఎల్.బి.శ్రీరామ్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, అశోక్ కుమార్, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుదీప నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేందర్ రెడ్డి, సంగీతం ఘటికాచలం, కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం జి.ఎల్. బి. శ్రీనివాస్.