pizza
7 to 4 trailer launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 December 2015
Hyderabad

'7 టు 4' ట్రైల‌ర్ విడుద‌ల‌

మిల్క్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఆనంద్‌, రాధిక‌, లౌక్య‌, శ్రీనివాస్‌, బాలకృష్ణ‌, మ‌ల్లిఖార్జున్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `7టు4`. విజ‌య్‌శేఖ‌ర్ సంక్రాంతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగింది. వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా...

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌సత్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``రెగ్యుల‌ర్ ల‌వ్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు భిన్నంగా ఠాగూర్ వంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అంద‌రినీ ఆలోచింప‌చేసే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్ మాట్లాడుతూ ``ఈ సినిమా ద్వారా స్నేహ‌ల‌తా ముర‌ళి అనే మ‌హిళా సంగీత ద‌ర్శ‌కురాలు ప‌రిచ‌యం అవుతుంది. చ‌క్క‌టి మ్యూజిక్‌, సాహిత్యం కుదిరింది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్‌శేఖ‌ర్ సంక్రాంతి మాట్లాడుతూ ``స‌మాజంలో కొంద‌రు వైట్ టైగ‌ర్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి స‌మాజంలో నేరాలు చేసేవారిని శిక్షిస్తుంటారు. అందులో భాగంగా `7టు4` అనే సంస్థ‌ను ఆడ‌వాళ్ళ‌పై అఘాయిత్యాలు చేస‌వారిని ప‌ట్టుకోవ‌డానికి నియ‌మిస్తారు. దాంతో నేర‌గాళ్ళు అదృశ్య‌మ‌వుతుంటారు. పోలీస్‌వారికి ఇదొక స‌వాలుగా మారుతుంది. అప్పుడు పోలీసులు ఏం చేశార‌నేదే సినిమా`` అన్నారు.

స్నేహ‌ల‌తా ముర‌ళి మాట్లాడుతూ ``ఈ సినిమా ద్వారా సంగీత ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుః శ్రీకాంత్‌, రాజేష్‌; చ‌ంద్ర‌శేఖ‌ర్‌, సాహిత్యంః శ్రీమ‌తి వంద‌న ద్విభాష్యం, సంగీతంః స్నేహ‌ల‌తా ముర‌ళి, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః ఇ.కె.ప్ర‌బాత్‌, కెమెరామెన్ః చిరంజీవి, ఎడిట‌ర్ః స‌త్య గిడుదూరు, డైరెక్ట‌ర్ః విజ‌య్ శేఖ‌ర్ సంక్రాంతి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved