pizza
Shourya audio success meet
శౌర్య ఆడియో స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 February 2016
Hyderabad

మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన సినిమా శౌర్య. రెజీనా కాసెండ్రా నాయిక‌. ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వేద సంగీతం చేశారు. మ‌ల్కాపురం శివ‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది.

మంచు మ‌నోజ్ మాట్లాడుతూ ``ఆడియో పెద్ద స‌క్సెస్ అయింది. ట్రైల‌ర్ బావుంది. మార్చి 4న సినిమాను విడుద‌ల చేస్తాం. వేదా మంచి ట్యూన్ల‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని కూడా అందించారు. త్వ‌ర‌లో ప్లాటిన‌మ్ ఫంక్ష‌న్‌ని చేస్తాం. యంగ్ టాలెంట్ సింగ‌ర్స్ ని ఈ సినిమా ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నాం. ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌కుండా మా నిర్మాత తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ శీను కూడా మంచి పాత్ర చేశారు`` అని చెప్పారు.

వ‌రికుప్ప‌ల మాట్లాడుతూ ``ద‌శ‌ర‌థ్ కాంపౌండ్ నుంచి పాట రాయ‌మ‌ని ఫోన్ రాగానే హ్యాపీగా ఫీల‌య్యాను. నాకు న‌చ్చిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. వేద‌గారు మంచి ట్యూన్లిచ్చారు. ఆయ‌న ట్యూన్లు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి`` అని తెలిపారు.

కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ ``గ్రీకువీరుడు త‌ర్వాత ద‌శ‌ర‌థ్‌గారితో క‌లిసి ప‌నిచేస్తున్నాను. ఇందులో మంచి పాట రాశాను`` అని అన్నారు.

ప్ర‌భాస్ శ్రీను మాట్లాడుతూ ``ద‌శ‌ర‌థ్‌గారు చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఎక్క‌డా రిలాక్స్ కాలేదు. వేదా మంచి సంగీతాన్నిచ్చారు`` అని తెలిపారు.

ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ ``ఆడియోకి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నిర్మాత ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తెర‌కెక్కించారు. వేద మంచి సంగీతాన్నిచ్చారు. త‌ప్ప‌కుండా సినిమా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మార్చి 4న విడుద‌ల చేస్తున్నాం`` అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ``వేద ద‌గ్గ‌ర నుంచి మంచి ట్యూన్లు రాబ‌ట్టుకోవ‌డం కోసం బాగా వేదించాం. మా బ్యాన‌ర్‌నుంచి ఇక‌పై కూడా కొత్త‌వారిని ఎంక‌రేజ్ చేస్తాం. ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1000 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

వేద మాట్లాడుతూ ``పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నిర్మాత ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తెర‌కెక్కించారు. మా బ్ర‌ద‌ర్‌కి ధ‌న్య‌వాదాలు.ఈ సినిమా ద్వారా కొత్త సింగ‌ర్ల‌ను ప‌రిచ‌యం చేశాం`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈ సినిమా సింగ‌ర్స్ కూడా పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved