pizza
Shourya release on 4 March
మార్చి 4న విడుదలవుతున్న ‘శౌర్య’
You are at idlebrain.com > News > Functions
Follow Us

02 March 2016
Hyderabad

బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్ పై మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం ‘శౌర్య’. కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు మనోజ్, రెజీనా, దశరథ్, మల్కాపురం శివకుమార్, శివారెడ్డి, వేదా.కె తదితరులు పాల్గొన్నారు. ...

మంచు మనోజ్ మాట్లాడుతూ ‘’’శౌర్య’ సినిమా మార్చి 4న విడుదలవుతుంది. రియల్ లైఫ్ లో శౌర్య అనే క్యారెక్టర్ ఉంటే అది దశరథ్ గారిలా ఉంటుంది. లవ్ థ్రిలర్. కమర్షియల్ ఫార్మేట్ లో ఉండే డిఫరెంట్ మూవీ. స్క్రీన్ ప్లే బేస్ డ్ మూవీ. రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాకు కులానికి ముడి పెట్టవద్దు. కులానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి. పైరసీని ఎంకరేజ్ చేయవద్దు’’ అన్నారు.

రెజీనా మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో నేత్ర అనే క్యారెక్టర్ ను నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ సినిమాను రూపొందించారు. మనోజ్ ఉంటే సెట్ వాతావరణమే మారిపోతుంది. మంచి కోస్టార్. అందరినీ కలుపుకునే వ్యక్తి. మంచి టీంతో వర్క్ చేశాను. మా సినిమా మార్చి4న విడుదలవుతుంది. ఆదరిస్తారని నమ్మతున్నాను’’ అన్నారు.

వేదా.కె మాట్లాడుతూ ‘’ఆడియో సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడియోలాగానే సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

దర్శకుడు దశరథ్.కె మాట్లాడుతూ ‘’కాన్సెప్ట్ బేస్ డ్ మూవీ. ఇంట్రెస్టింగ్ గా సాగే కమర్షియల్ మూవీ. టీం సపోర్ట్ తో సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నాం. నిర్మాత సహా టీం అందరికీ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘’డిఫరెంట్ సినిమాగా రూపొందిన శౌర్య మార్చి 4న విడుదలవుతుంది. పాత్రలకు తగిన విధంగా నటీనటులను ఎంపిక చేసుకుని సినిమా చేశాం. మంచి టెక్నికల్ టీం కూడా కుదరడంతో మంచి సినిమాను తీయగలిగాను. ఇలాంటి టీంతో మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తుంది. మోహన్ బాబుగారు సినిమా చూసి మనోజ్ కొత్తగా చేశాడని, బ్యానర్ వాల్యూని పెంచే చిత్రమవుతుందని మెచ్చుకున్నారు. 900పైచిలుకు థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved