అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ....
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’మనం వంటి క్లాసికల్ హిట్ తర్వాత నేను చేసిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. ఈ కమర్షియల్ సినిమాను పెద్ద హిట్ చేయడంతో కొత్త దర్శకులతో, కొత్త సబ్జెక్ట్స్ చేయవచ్చుననే కాన్ఫిడెంట్స్ పెరిగింది. మాకు మారల్ సపోర్ట్ దొరికనట్టయింది. పండగ సందర్భంలో చాలా సినిమాలు విడుదల కావడంతో నాలుగు వందల థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేశాం. పండగకే కాదు, పండుగ తర్వాత కూడా సినిమా మంచి కలెక్షన్స్ సాదిస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటికి ముప్ఫై ఐదు రోజులవుతున్నా అన్నీ చోట్ల షేర్స్ కలెక్షన్స్ తో సినిమా సాగుతుంది. మనం, మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా. ఇప్పుడే ఊపిరి సినిమా చూసి వస్తున్నాను. ఊపిరి కూడా చాలా సూపర్ గా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తో హ్యపీగా ఉన్నా, కలెక్షన్స్ తో నా గత చిత్రాలను పోల్చకూడదు. ఎందుకంటే శివ ఇప్పుడు విడుదలైతే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పుడు యాభై అంటున్నారు. రేపు అరవై అంటారు. ఆపై డెబ్బై అంటారు. మరో రోజు వందంటారు. ఇవన్నీ నెంబర్స్ మాత్రమే. నంబర్స్ వస్తుంటాయి. పోతుంటాయి. ఎన్టీఆర్ గారి మాయాబజార్, నాన్నగారి ప్రేమాభిషేకం ఇప్పుడు విడుదలైతే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు వచ్చినవన్నీ జస్ట్ నంబర్స్ మాత్రమే. ఇక టీం విషయానికి వస్తే టీమంతా చాలా ప్రేమించి చేసిన సినిమా. ఒక సంవత్సరం పాటు అందరూ ఓ ఫ్యామిలీ ట్రావెల్ చేశాం. రామ్మోహన్ గారు ఇచ్చిన కథకు నేను క్యారెక్టర్ ఎలా ఉండాలో చెప్పగానే డైరెక్టర్ కళ్యాణ్ బంగార్రాజు అనే క్యారెక్టర్ ను క్రియేట్ చేసి, ప్రతి సీన్ పండేలా మంచి డైలాగ్స్ రాసి ఎంతకష్టపడ్డాడో మాకు తెలుసు. అందరం డిస్కస్ చేసుకుని ఎలా చేస్తే బాగా వస్తుందో అలా షూట్ చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమా సక్సెస్ లో ఎక్కువ భాగం క్రెడిల్ కళ్యాణ్ కే దక్కుతుంది. నన్ను, సంతప్, నాజర్ అందరినీ కలుపుకుని మాకు ఎలా కావాలో అలా చేసుకుంటూ వెళ్ళాడు. ఈ సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ చేయాలని ముందుగానే అనుకున్నాం. నేను సోగ్గాడు మళ్ళీ వచ్చాడనే టైటిల్ కూడా అనుకున్నాం. అయితే ఆడియెన్స్ లోకి బంగార్రాజు క్యారెక్టర్ బాగా వెళ్ళింది. అందువల్ల ఇదే పేరుతో సీక్వెల్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడో తెలియదు కానీ ఏదో పండగకి సీక్వెల్ ను రిలీజ్ చేస్తాం. అలాగే దిల్ రాజుగారు కథ వినమన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు పూర్తి చేశాను. అలాగే ఊపిరి సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. తెలుగులో కాకుండా తమిళంలో కూడా నేనే డబ్బింగ్ చెబుతున్నాను. గ్యాప్ దొరికితే తప్పకుండా కథ వింటాను.
నా నెక్ట్స్ సినిమా రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఏప్రిల్ లో మొదలు పెట్టేయమని ఆయనకు చెప్పాను. వెంకటేశ్వరుడి భక్తుడు హథీరాంబాబాకు చెందిన కథ. హథీ రాంబాబా 18వ శతాబ్దానికి చెందిన వెంకటేశ్వరుని భక్తుడు. నాగచైతన్యతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాం. ప్రేమమ్ తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేస్తాం. వంద సెంటర్స్ లో 50 డేస్ జరుపుకుంటుంది. నేను కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారి సక్సెస్ సాధించాను. కళ్యాణ్ చాలా క్లారిటీతో సినిమా డైరెక్ట్ చేశాడు. మనం తర్వాత అనూప్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా థియేటర్ కు వెళ్ళే ఆడియెన్స్ కంటే ఇంట్లో ఉండేవారికి దగ్గరయ్యాను. అఖిల్ విషయంలో తొందరపడవద్దని చెప్పాను. ఒకట్రెండు నెలల్లో చెప్పేస్తాం. ఈ సినిమాతో మాకు మేమే కొత్త లెసన్స్ నేర్చుకున్నాం. మాకే ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయ్యింది. ఈ సినిమా విషయంలో హీరోగా శాటిస్పాక్ట్ అయ్యాను. ఈ సినిమా సక్సెస్ ను ఎలా కొలవాలి. మొన్న మీలో ఎవరు కోటీశ్వరుడులో ఓ 55 ఏళ్ళ ఆవిడ బంగార్రాజు క్యారెక్టర్ ఎంత బావున్నారండి అని నా చెవిలో చెప్పింది. ఆ అభిమానాన్ని ఎలా కొలవాలి. ఊపిరి విషయానికి వస్తే ఓ ట్రూ స్టోరీతో ఇన్ స్ఫైర్ అయ్యి చేసిన సినిమా ఇది. కచ్చితంగా ట్రెండ్ సెట్టింగ్ మూవీ, పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది’’ అన్నారు.
కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘’నెక్ట్స్ సినిమాను ఇంకా కాన్ సన్ ట్రేషన్ తో, పెద్ద హిట్ చేసేలా జాగ్రత్తలు తీసుకుని చేస్తాను’’ అన్నారు.
అనూప్ మాట్లాడుతూ ’’మనం తర్వాత నాపై నమ్మకంతో నాగ్ సార్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ఫస్టాఫ్ తర్వాత మా అమ్మగారు దూరమయ్యారు. నేను బాధలో ఉన్నప్పుడు నాగ్ సార్ ఫోన్ చేసి మన పనితోనే వారికి హ్యపీ అవుతుందని చెప్పారు. ఆయన ఇచ్చన ఇన్సిపిరేషన్ తో మంచి మ్యూజిక్ అందించాను. మా అమ్మగారు ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో సినిమా పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.