pizza
Sri Sri Press meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

09 December 2015
Hyderabad

హైదరాబాద్ లో 'శ్రీ శ్రీ` షూటింగ్‌

కృష్ణ, విజయనిర్మల, నరేష్ కీల‌క పాత్రల్లో రూపొందుతున్న సినిమా శ్రీశ్రీ. ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెర‌కెక్కుతోంది. ముప్పలనేని శివ దర్శకత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ లోని నాన‌క్‌రామ్ గూడ‌ రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

కృష్ణ మాట్లాడుతూ ''శ్రీ శ్రీ అనే టైటిల్ వింటే మహాకవి శ్రీ శ్రీ గుర్తొస్తున్నాడు. ఆ మహాకవి తన ఆవేశాన్ని రాతల్లో చూపిస్తే, మా శ్రీ శ్రీ తన ఆవేశాన్ని చేతల్లో చూపిస్తాడు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముప్పలనేని శివ చెప్పినదానికంటే ఇంకా బాగా తీస్తున్నాడు. ఇప్పటికే 75% షూటింగ్ పూర్త‌యింది. గ్రాఫిక్స్ మిగిలిన షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు'' అని చెప్పారు.

విజయనిర్మల మాట్లాడుతూ ''సినిమా కథ నచ్చింది. మా పాత్రలు కూడా నచ్చడంతో కృష్ణ గారు, నేను కలిసి నటిస్తున్నాం. నా 70వ ఏడాదిలో రీఎంట్రీ ఇస్తున్నాను. ఇలాంటి పాత్రలు వస్తే మరిన్ని చిత్రాల్లో నటించాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

నరేష్ మాట్లాడుతూ ''తెలుగు సినిమాకు, భారతీయ సినిమాకు గొప్ప ఘనత తెచ్చిపెట్టిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రతి దశాబ్దంలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారాయ‌న‌. సామాజిక స్ఫూర్తి ఉన్న వ్యక్తి. మరాఠీలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మంచి ఎంటర్ టైన్‌మెంట్‌తో కూడిన యాక్షన్ ఫిలిం. ఈ సినిమాలో నేనొక కీ రోల్ పోషిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు ఈ సినిమా పెద్ద ట్రీట్ అవుతుంది'' అని చెప్పారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ ''1994లో ఘరానా అల్లుడు చిత్రం ద్వారా నేను దర్శకునిగా మారడానికి ఎంతగానో సహకరించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనంటే నాకు ప్రాణం. ఆయ‌న నిర్వ‌హించుకుంటున్న‌ 50 సంవత్సరాల వేడుకల్లో ఆయనకు గుర్తుండిపోయే విధంగా ఉండాలని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. అలనాటి శ్రీ శ్రీ గారి భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే ఎలా ఉంటుందో అనేదే ఈ సినిమా. కృష్ణ గారు ఈ చిత్రంలో ఇమిడిపోయి నటించారు. జనవరి 25నాటికి మొదటి కాపీ రెడీ చేసి ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''ఇది మా మొదటి సినిమా. కృష్ణ లాంటి లెజండరీ యాక్టర్ తో పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ: రమేష్, డైలాగ్స్: రామ్ కంకిపాటి, మ్యూజిక్: ఇ.ఎస్.మూర్తి, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ డైరెక్టర్: అశోక్, ఎడిటర్: రమేష్, కాన్సెప్ట్ రైటర్: కళ్యాణ్‌ జీ, ఫైట్స్: నందు, నిర్మాతలు: శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్, దర్శకత్వం: ముప్పలనేని శివ.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved