శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం తిక్క. సునీల్ రెడ్డి దర్శకత్వంలో డా.సి.రోహిణ్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాత సి.రోహిణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ``ప్రస్తుతం భారీ సెట్ వేసి అందులో సాయిధరమ్ తేజ్, పరహ్ మధ్య స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం. ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. తేజ డ్యాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదరగొడుతున్నాడు. ఈ సాంగ్‌లోతాగుబోతు రమేష్, సత్య కూడా పాల్గొంటున్నారు. ఈ సాంగ్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అవుతుంది`` అన్నారు.
దర్శకుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ``ప్రస్తుతం సాంగ్ కాకుండా మరో రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఒక సాంగ్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తే మరో సాంగ్‌ను లడఖ్‌లో ప్లాన్ చేస్తున్నాం. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్టులో విడుదలకు సిద్ధం చేస్తున్నాం`` అన్నారు.
సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ ``ఇప్పుడు చేస్తున్న స్పెషల్ సాంగ్ కాకుండా మరో రెండు సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నిర్మాత రోహిణ్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తుంటే దర్శకుడు సునీల్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరెకెక్కిస్తున్నారు`` అన్నారు.
పరహ్ మాట్లాడుతూ ``ముందు దర్శకుడు వచ్చి స్పెషల్ సాంగ్ చేయాలనగానే బాగా ఆలోచించాను. అయితే పాట ట్యూన్ క్యాచీ అనిపించడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రేమరక్షిత్, గుహన్, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.