pizza
Thikka press meet
`తిక్క‌` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 August 2016
Hyderaba
d

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సి.రోహిణ్‌కుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం `తిక్క‌`. సినిమా ఆగ‌స్ట్ 13న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

ద‌ర్శ‌కుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ``సినిమాపై పాజిటివ్ టాక్ వ‌స్తుంది. కాస్తా నిడివి ఎక్కువైంద‌నే అంటున్నారు. అందుక‌ని ఫ‌స్టాఫ్ ఐదు నిమిషాలు సెకండాఫ్ క్లైమాక్స్‌లో ఐదు నిమిషాలు ఎడిట్ చేశాం. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికే ఈ సినిమా చేశాం`` అన్నారు.

నిర్మాత సి.రోహిణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ``ప్రేక్ష‌కుల‌కు ముందుగా స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. తిక్క సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నిన్న‌, ఈవాళ మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్‌ను బట్టి ట్రిమ్ చేశాం`` అన్నారు.

ర‌ఘుబాబు మాట్లాడుతూ ``రెండు గంటల ప‌దిహేను నిమిషాలున్న సినిమాను రెండు గంట‌ల ఐదు నిమిషాలుగా చేశాం. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. సాయిధ‌ర‌మ్ తేజ్‌కున్న ఇమేజ్‌కు త‌గ్గ సినిమా. నిర్మాత‌గారు ఎంతో లావిష్‌గా నిర్మించారు. డైరెక్ట‌ర్ సినిమా బాగా చేశార‌ని అంద‌రూ అంటున్నారు. మంచి టీం వ‌ర్క్ చేసిన సినిమా. నా వ‌ర‌కు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేశాను`` అన్నారు.

తాగుబోతు ర‌మేష్ మాట్లాడుతూ ``నిర్మాత రోహిణ్‌రెడ్డిగారు ఎంతో ప్యాష‌నేట్‌తో చేసిన సినిమా. రెగ్యుల‌ర్‌కు భిన్నంగా చేసిన సినిమా. బి, సి ల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. మంచి రోల్ చేశాను. మంచి పేరు వ‌చ్చింది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌త్య త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved