pizza
Suriya's 24 release on 6 May
మే 6న విడుదలైన సూర్య ‘24’
ou are at idlebrain.com > News > Functions
Follow Us

18 April 2016
Hyderabad

సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

హీరో సూర్య మాట్లాడుతూ ‘’24 సినిమా మే 6న విడుదలవుతుంది. విక్రమ్ కుమార్ గారు నాలుగున్నర గంటల పాటు వండర్ ఫుల్ నేరేషన్ ఇచ్చారు. విన్న వెంటనే నాలుగున్నర గంటల నేరేషన్ మూవీని రెండున్నర గంటల పాటు ఎలా తీస్తావని అడిగాను. స్క్రిప్ట్ వినగానే బాగా ఇంప్రెస్ అయ్యి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారాను. తెలుగులో అన్నమయ్య, శంకరాభరణం, బాహుబలి వంటి ఎన్నో పాత్ బ్రేకింగ్ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి గొప్ప సినిమాలు రావడానికి కారణం ఇక్కడి తెలుగు ప్రేక్షకులే. విభిన్న సినిమాలను ఆదరిస్తుంటారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే బడ్జెట్, టెక్నిషియన్స్ అనీన విషయాలను పక్కన పెడితే కంటెంట్ పరంగా చాలా బలమున్న సినిమా. లవ్ లీ ఎక్స్ పీరియెన్స్. సినిమాటోగ్రాఫర్ తిరుణాకరసుగారు, చంద్రబోస్ గారి సాహిత్యం, ప్రవీణ్ ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్ ఇలా అన్నీ విభాగాల్లో బెస్ట్ టీం కుదిరింది. నేను చేసిన మూడు క్యారెక్టర్స్ లో నాకు ఆత్రేయ క్యారెక్టర్ అంటే ఇష్టం. కచ్చితంగా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే మూవీ అవుతుంది’’ అన్నారు.

కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘’24 అద్భుతమైన సినిమా. దీన్ని రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన సూర్యకు థాంక్స్. నేను మనం సినిమా చూసిన తర్వాత శివకుమార్, సూర్య, కార్తీలతో తమిళంలో మనం సినిమా చేయమని విక్రమ్ కు ఫోన్ చేశాను. తను మాత్రం నా దగ్గర సూర్యకు తగిన విధంగా మంచి లైన్ వుంది. నాకు అరగంట సమయం ఇప్పించండి చాలు అన్నాడు. నేను సరేనని సూర్యతో మీటింగ్ అరెంజ్ చేశాను. అరగంట కాస్తా నాలుగున్నర గంటలు పట్టింది. కథను అంత బాగా నేరేట్ చేశాడు. నేరేషన్ కంటే పదిరెట్లు అద్భుతంగా సినిమాను డైరెక్ట్ చేశాడు. సూర్య మూడు రోల్స్, ఐదు గెటప్స్ లో అద్భుతంగా నటించాడు. సూర్య కెరీర్లో బెస్ట్ ఫిలిం అవుతుంది”’ అన్నారు.

శశాంక్ వెన్నెల కంటి మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు గర్వంగా ఉంది. 13బిలో థ్రిల్, మనంలోని ఫ్రెష్ ఐడియా, ఇష్క్ లోని రొమాన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. రెహమాన్ గారి సంగీతం సినిమాలో మరో హైలైట్ అంశం. విజువల్ గా, సౌండింగ్ పరంగా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ‘’ఈ కథను ఓకే చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాను అవసరమైనవి అందించిన సూర్యగారికి థాంక్స్. అలాగే ఈ సినిమా కోసం వర్క్ చేసిన రెహమాన్ గారికి థాంక్స్. సూర్యగారి కెరీర్ లోని టాప్ 5 మూవీస్ లో ఇదొక చిత్రమవుతుంది. సినిమాలో విఎఫ్ ఎక్స్ బేస్ డ్ మూవీ. అందుకోసం జూలియన్ అనే ఫారినర్ వర్క్ చేసి అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. ఒక మంచి టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ టీంతో వర్క్ చేసే అవకాశం కలిగింది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved