pizza
Uttama Villain release on 1 May
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 April 2015
Hyderabad

మే 1న విడుదలవుతున్న ‘ఉత్తమవిలన్’

దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి మెస్మరైజింగ్‌ చిత్రాల తర్వాత కమల్‌ హాసన్‌ చేస్తున్న మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్‌’. తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్స్‌పై ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్‌ అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుదలవుతుంది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.

కమల్ హాసన్ మాట్లాడుతూ ‘’సినిమా ఫైనల్ కాపీ చూశాం. సినిమా బాగా వచ్చింది. సినిమా తీయడం నేర్చుకుంటున్నాం. ఈ సినిమా గురించి ఎవరో కేసు కూడా వేశారు. పరిశీలించిన కోర్టు అలాంటిదేమీ సినిమాలో లేదని వారిని మందలించింది. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. మంచి సినిమా తీయడమే మా ధ్యేయం. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే. ఒక హిందూ మతాన్నో, ముస్లింలనో, క్రిస్టియన్స్ లో, జైన్స్, సిక్స్ ఇలా ఏ మతం వారైనా కానీ అందరినీ నా కుటుంబ సభ్యులుగానే చూస్తాను. కాబట్టి ఎవరినో కించపరచాలని నేను సినిమా తీయను. అలాగే నాకు పాలిటిక్స్ తెలియవు. ఏ పార్టీ కోసమో నేను సినిమా తీయను. అవసరం కూడా లేదు. నా సినిమాలను చాలా తక్కువ మంది మాత్రమే అడ్డుకోవాలని చూస్తున్నారు. నా అభిమానులకు ఇలాంటి సందర్భంలో నేను కోపం తెచ్చుకోవద్దని, సహనంతో ఉండాలని చెబుతుంటాను. ఇదొక కళాకారుడి జీవితానికి సంబంధించిన సినిమా. సినిమా రంగం బేస్ చేసుకుని తీసిన సినిమా కాబట్టి అందులో అంశాలను అక్కడక్కడా టచ్ చేసి ఉంటే ఉండవచ్చు. ఈ సినిమాలో ఎనిమిదవ శతాబ్దానికి, ఈ శతాబ్దానికి మధ్య రిలేషన్ ఉంటుంది. అదెంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. నా గురవు బాలచందర్ గారు, కె.విశ్వనాథ్ గారితో ఈ సినిమాలో చేయడం చాలా హ్యపీగా అనిపించింది. ఈ సినిమాకి కథతో పాటు, స్క్రిప్ట్ అందించాను, నిర్మాతగా కూడా వ్యవహరించాను. దర్శకత్వం అనేది ఎక్కవ భారం అవుతుందని భావించాను. రమేష్ అరవింద్ తో నాకున్న రిలేషన్, మా మెంటాలిటీస్ దృష్ట్యా తను డైరెక్ట్ చేస్తే బాగుంటుందని భావించాను. ఇది ప్రాక్టికల్ గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇక విశ్వరూపం, విశ్వరూపం2, ఉత్తమవిలన్ చిత్రాల్లో ఆండ్రియా, పూజాకుమార్ లతో నటించడం వెనుక ప్రత్యేక కారణాలేమీ లేవు. వారి స్టయిల్ ఆఫ్ వర్కింగ్ నాకు బాగా నచ్చింది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా క్రెడిట్ అంతా కమల్ హాసన్ గారికే చెందుతుంది. ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే కోరికతో ప్రతి క్షణం ఆలోచించి ఒక అద్భుతమైన చిత్రం రూపకల్పను జీవంపోసింది కమల్ హాసన్ గారే.ఇప్పటి వరకు 54 సినిమాలను చేసిన నేను ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. మా గురువుగారు బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు నటించిన చిత్రం. నాజర్ గారు వంటి నటుడు మరోసారి అద్భుతమైన పాత్రలో నటించారు. ఇలా హీరో, హీరోయిన్, డైరెక్టర్ సహా అందరూ ప్రమోషన్ లో పాల్గొనాలి. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. ఆడియో నెంబర్ వన్ గా నిలిచింది. నాకు సపోర్ట్ చేస్తున్న వెంకటేశ్వరరావు, కుమార్ బాబు, బి.ఎ.రాజులకు థాంక్స్. సినిమా డెఫనెట్ గా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

రమేష్ అరవింద్ మాట్లాడుతూ ‘’సక్సెస్ అనేది అదృష్టం కొద్ది, కష్టం, బలం ఇలా ఏదో ఒకదాని ఆధారంగా మన తలుపుతట్టవచ్చు. అయితే సినిమా రంగంలో మాత్రం సక్సెస్ ఇచ్చేది కేవలం ప్రేక్షకులు మాత్రమే. తెలుగు ప్రేక్షకులు గురించి నాకు తెలుసు. ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నాం’’ అన్నారు.

నాజర్ మాట్లాడుతూ ‘’ఇప్పటి వరకు 500 చిత్రాల్లో నటించాను. ఏ సినిమాలో చేయని డిఫరెంట్ రోల్ ను ఈ సినిమాలో చేశాను. ఇదొక డిఫరెంట్ మూవీ. హార్ట్ టచింగ్ మూవీ. ఇదొక మ్యూజికల్ మూవీ. ప్రతి సన్నివేశానికి సంగీతం మంచి కనెక్షన్ ఉంది. సినిమా చూశాను. అద్భుతమైన కామెడిని చేశాను. కథ, కథనం ప్రేక్షకుడుకి సర్ ప్రైజ్ నిస్తాయి’’ అన్నారు.

పూజా కుమార్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన కమల్ హాసన్ గారికి, దర్శకుడు రమేష్ అరవింద్ గారికి థాంక్స్. ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంది’’ అన్నారు.

ఆండ్రియా మాట్లాడుతూ ‘’ఈ చిత్రంలో పనిచేయడం మంచి అనుభవానిచ్చింది. నాకు స్పెషల్ మూవీ. కమల్ హాసన్ గారితోనే కాకుండా బాలచందర్ గారితో, విశ్వనాథ్ గారితో పనిచేసే అవకాశం రావడం మరచిపోలేను. తప్పకుండా అందరినీ అలరించే చిత్రమవుతుంది’’ అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved