pizza
Vaisakham first look launch
వైశాఖం ఫస్ట్ లుక్ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

30 May 2016
Hyderabad

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై సూపర్ హిట్ అధినేత బి.ఎ.రాజు నిర్మిస్తున్న వైశాఖం చిత్రం పాటల చిత్రీకరణ కజకిస్థాన్ లో 15 రోజుల పాటు జరిగింది. కజకిస్థాన్ దేశంలో షూటింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా కూడా వైశాఖం కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో...

సూపర్ హిట్ అధినేత బి.ఎ.రాజు మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో వచ్చిన గత చిత్రం లవ్ లీ చిత్రం  ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. వందరోజుల వేడుకను 12 సెంటర్స్ లో జరుపుకుంది. చాలా రోజుల తర్వాత మంచి హిట్ సబ్జెక్ట్ తో సినిమా చేయాలని, లవ్ లీ కంటే పెద్ద హిట్ మూవీ చేయాలని వెయిట్ చేసి చేస్తున్న సినిమాయే వైశాఖం. ఇప్పటికీ సినిమా 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చంటిగాడు సినిమా చిత్రీకరణ సమయంలో సినిమాటోగ్రాఫర్ సుబ్బారావుగారి సలహాతో డిజిటల్ లో ఓ పాటను చిత్రీకరించి యాడ్ చేశాం. అలా డిజిటల్ టెక్నాలజీతో ముందు చిత్రీకరణ చేసిన క్రెడిట్ కూడా మా బ్యానర్ కే దక్కింది. అప్పట్లో ఈ సాంగ్ ను చూసిన డి.సురేష్ బాబుగారు కూడా మా ప్రయత్నాన్ని అభినందించారు. అలాగే మా బ్యానర్ లో వచ్చిన చిత్రాల్లో సాంగ్స్ అన్నీ మంచి ఆదరణ పొందాయి. అలాగే వైశాఖంలో సాంగ్స్ కూడా అందరికీ నచ్చుతాయి. ఇందులో మూడు సాంగ్స్ ను రష్యా నుండి విడిపోయి ప్రత్యేకదేశంగా ఏర్పడిన కజకస్థాన్ లో మూడు పాటలను 15 రోజుల పాటు చిత్రీకరించాం. డైరెక్టర్ జయ.బి, సహా సినిమాటోగ్రాఫర్ సుబ్బారావుగారు మిగతా టీం అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా అవుట్ పుట్ బాగా వస్తుంది. సీనియర్ నటి ఆమనిగారు, సాయికుమార్ గారు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. పృథ్వీకి రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాశీవిశ్వనాథ్ గారికి నచ్చావులే కంటే మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. దాదాపు ఏడెనిమిది కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సినిమా వైశాఖం. కథ మీద నమ్మకంతో ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ‘’15-16ఏళ్లుగా డిజిటిల్  సినిమాపై చాలా ప్రయోగాలు చేసి డిజిటల్ చిత్రీకరణపై చాలా మందిని కలిసినా ప్రయోజనం లేకపోయింది. అలాంటి సందర్భంలో జయగారిని కలిశాను. ఆమె సపోర్ట్ తో  డిజిటల్ టెక్నాలజీని పరిచయం చేశాను. అలాగే ఈ సినిమాలో కూడా రోబోటిక్స్ అనే కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నాం. కజకిస్థాన్ లో మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో 15 రోజుల పాటు 3 పాటలను కష్టపడి చిత్రీకరించాం. వసంత్ గారు సూపర్బ్ మ్యూజిక్ అందించారు. హీరో హీరోయిన్స్ హరీష్, అవంతికలు చక్కగా నటించారు. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, జయగారికి థాంక్స్’’ అన్నారు.

హరీష్ మాట్లాడుతూ ‘’హీరోగా నాకిదే తొలి సినిమా. మంచి మూవీ, మంచి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నందుకు ఆంనందంగా ఉంది. మంచి మూవీతో పాటు, మంచి ఫ్యామిలీ కూడా దొరికినట్టయింది. చాలా మంచి లాంచ్ దొరికినట్టయింది. అవకాశం ఇచ్చిన జయగారికి, బి.ఎ.రాజుగారికి థాంక్స్’’ అన్నారు.

జయ.బి మాట్లాడుతూ ‘’కంట్రోల్ బడ్జెట్ లో మూవీ చేయాలని ఈ వైశాఖం సినిమాను స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇది బిగ్ కాన్వాస్ మూవీ అవుతుంది. యూనిట్ సహా ప్రతి ఒక్కరం , ప్రతి స్టెప్ కష్టపడి చేస్తున్నాం. అందుకే కజకిస్థాన్ లో షూటింగ్ కూడా చేశాం. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో చాలా దేశాలు సెర్చ్ చేసి కజకస్థాన్ లోకేషన్స్ ను ఎంపిక చేసుకుని మైనస్ డిగ్రీల్లో చిత్రీకరణ చేసుకున్నాం. అలాగే గింబల్ స్కెలిటిన్ డిజైన్ చేసి సినిమాలో ఉపయోగించాం. ఇలా చేసిన ఫస్ట్ ఇండియన్, సౌతిండియన్ మూవీ కూడా ఇదే. అలాగే యూనిట్ అంతా కొన్నిసార్లు నీళ్లు లేకుండా కష్టపడి షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఓ మంచి సినిమా ఇవ్వాలని అందరం ప్రయత్నించాం. 15రోజుల్లో 19 లోకేషన్స్ లో మూడు పాటలను మైనస్ 4 డిగ్రీల టెంపరేచర్ లో షూట్ చేశాం.  ఇక సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ రిలేషన్ ఫిప్స్ బేస్ చేసుకుని సాగే లవ్ స్టోరీ. ఓ అపార్ట్ మెంట్ లో అందరం  కలిసి ఉండటం ఎంత బావుంటుందో చూపిస్తున్నాం. అలాగే టైటిల్ కు తగిన కథే. అలాగే సినిమాకు అచ్చ తెలుగు టైటిల్ పెట్టాలని ముందే అనుకున్నాం. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తాం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

డి.జె.వసంత్ మాట్లాడుతూ ‘’ మంచి మ్యూజిక్ కుదిరింది. అవకాశం ఇచ్చిన జయగారికి, రాజుగారికి థాంక్స్’’ అన్నారు.

హరీష్, అవంతిక, ఆమని, సాయికుమార్, రమాప్రభ, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్ దస్త్ టీం వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, లతీష్, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డ్యాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళికొండేటి, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved