బ్రహ్మాజీ, సత్యం రాజేష్, కారుమంచి రఘు, పావని ప్రధాన పాత్రధారులుగా శ్రీమతి అరుణ సమర్పణలో అరుణ శ్రీ కంబైన్స్ బ్యానర్ పై బాల దర్శకత్వంలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘వసుధైక 1957’. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
సుభాష్ మాట్లాడుతూ ‘’దర్శక నిర్మాతలు ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ను ఇచ్చారు. అందుకు వారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు.
భాషా శ్రీ మాట్లాడుతూ ‘’ ఈ సినిమాలో అన్నీ హంగులు ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమా ఎక్సలెంట్ గా ఉంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అమోఘ్ దేశ్ పతి మాట్లాడుతూ ‘’ఇందులో ఐదు సాంగ్స్. ఐదు రకాలుగా ఉంటాయి. నాకు ఫ్రీడం ఇచ్చి మ్యూజిక్ చేయించుకున్నారు. మంచి సాహిత్యం కుదిరింది. సినిమాలో లాలిపాట హైలైట్ అవుతుంది’’ అన్నారు.
పావని మాట్లాడుతూ ‘’దర్శకుడు బాలగారు సినిమా చక్కగా డైరెక్ట్ చేశారు. నిర్మాతగారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. నాకిష్టమైన క్యారెక్టర్. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత నిడమలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ‘’ఏడేనిమిదేళ్లుగా సినిమాను నిర్మించాలనుకుంటున్నాను. కానీ బిజీగా ఉండటంతో కుదరలేదు. కానీ దర్శకుడు నన్ను ఒప్పించి మంచి కథతో ఈ సినిమాను రూపొందించాడు. చాలా కష్టపడ్డాడు. సినిమా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ నచ్చే చిత్రమవుతుంది. సినిమాను మే 27న విడుదల చస్తున్నాం. మా బ్యానర్ లో తదుపరి చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు బాల మాట్లాడుతూ ‘’సినిమా బాగా రావడానికి టీం అంతా బాగా కష్టపడ్డారు. నిర్మాతగారు సింగిల్ సిట్టింగ్ లోనే సినిమాను పూర్తి చేశారు. నాకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని భావిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మే 27న విడుదలవుతుంది’’ అన్నారు.
శ్రీలత, కారుణ్య, షాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బేబి యోధ, కారుణ్య, శ్రీలత, షాని, సుభాష్ నటించిన ఈ చిత్రానికి డ్యాన్స్: రేలంగి కిరణ్, ఎడిటర్: గోపి సిందం, కథా సహకారం, కోడైరెక్టర్: మహేష్ పెద్ద బోయిన, మాటలు, పాటలు: భాషా శ్రీ, మ్యూజిక్: అమోఘ్ దేశ్ పతి, సినిమాటోగ్రఫీ: తిరుమలరావు బొడ్డేపల్లి, నిర్మాత: నిడమలూరి శ్రీనివాసులు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాల.