pizza
Vinodam 100% release on 27 May
27న `వినోదం `100%`
ou are at idlebrain.com > News > Functions
Follow Us

25 May 2016
Hyderabad

విజ‌య్ భ‌ర‌త్, అశ్విని జంట‌గా న‌టించిన చిత్రం `వినోదం `100%`. పొట్నూరు స‌రోజ‌మ్మ ఆశీస్సుల‌తో విడుద‌ల‌వుతోంది. స‌త్యం రాజేష్‌, పృథ్వి, సంపూర్ణేష్ బాబు, జీవా, ష‌క‌ల‌క శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జై శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. పొట్నూరు చ‌క్ర‌ధ‌రుడు స‌మ‌ర్పిస్తున్నారు. ఎస్ ఎస్ సెల్యులాయిడ్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస‌రావు నిర్మాత‌. ఈ నెల 27న విడుద‌ల కానున్న ఈ సినిమాను ముత్యాల రాందాస్ విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశానికి దాస‌రి నారాయ‌ణ‌రావు హ‌జ‌ర‌య్యారు.

దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ ``నేను మ‌ధ్యాహ్నం త‌ప్ప‌కుండా నిద్రపోతాను. ఆ స‌మ‌యంలో కోటి రూపాయ‌లు ఇస్తామ‌న్నా బ‌య‌ట‌కు రాను. కానీ ముత్యాల రాందాస్ ఓ చిన్న సినిమా విడుద‌ల బాధ్య‌త‌ను నెత్తికి ఎత్తుకున్నార‌ని తెలిసి ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చాను. ఇవాళ చిన్న సినిమాలు విడుద‌ల‌వుతున్నాయ‌ని చెప్ప‌కునే ప‌రిస్థితి కూడా ఉండ‌టం లేదు. ఇలాంటి చిన్న చిత్రాల‌ను చేసిన ఔత్సాహికుల‌ను భ‌గ‌వంతుడు ఆశీర్వ‌దించాలి. వీరంద‌రికీ మంచి జ‌ర‌గాలి. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కు త‌ల్లో నాలుక‌లాంటి ముత్యాల రాందాస్ విడుద‌ల చేస్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యాన్ని సాధించాలి`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఈ నెల 27న విడుద‌ల చేస్తున్నాం. దాస‌రిగారి స్ఫూర్తితో నేను ద‌ర్శ‌కుడిని అయ్యాను. ఆయ‌న ద‌గ్గ‌ర ధ్వ‌ని-ప్ర‌తిధ్వ‌ని సినిమాకు అసిస్టెంట్ డైరక్ట‌ర్‌గా చేశాను. రాందాస్‌గారు మా సినిమా చూసి విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని తెలిపారు.

అశ్విని మాట్లాడుతూ ``మా సినిమా పూర్తి స్థాయి కామెడీతో ఉంటుంది. అమెరికా, డ‌ల్లాస్‌, చికాగోలో ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని తెలిసి ఆనందంగా ఉంది`` అని తెలిపారు.

ముత్యాల రాందాస్ మాట్లాడుతూ ``చిన్న సినిమా అయినా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. పృథ్వి, సంపూర్ణేష్‌బాబు, స‌త్యంరాజేష్ వంటి వారంద‌రూ ఉన్నారు. అంద‌రూ హీరోలుగా న‌టించిన సినిమా`` అని అన్నారు.

విజ‌య్ భ‌ర‌త్ మాట్లాడుతూ ``హీరోగా నాకిది తొలి చిత్రం`` అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ``ఈ సినిమాను ఫారిన్‌లోనూ తీశాం`` అని అన్నారు.

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ `` పేరులోనే 100శాతం వినోదం ఉంది. నిర్మాత‌కు కాసులు కూడా అంతే శాతం కుర‌వాలి`` అని చెప్పారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved