హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్’ అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. స్టార్ కమెడియన్ డా.బ్రహ్మానందం ఇందులో ప్రధాన భూమిక పోషించగా వెన్నెల కిశోర్, పావని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈచిత్రం ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘’మంచి నిర్మాతల సహకారంతో రేలంగి నరసింహారావు మంచి చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్స్ లేని సినిమాను కొనడానికి ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముందుకు రావడం లేదు. ఈ వారం 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందు నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చే ఎగ్జిబిటర్స్, ఈ చిత్రం కోసం ఎదురు డబ్బులు అడుగుతున్నారు. అందుకే ఈ చిత్ర నిర్మాతలు స్వంతంగా చాలా కష్టపడి థియేటర్స్ ను సంపాదించి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. చిన్న నిర్మాతల పరిస్థితి ఇండస్ట్రీలో అలా తయారైంది. చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం రీసెంట్ గా జరిగిన మీటింగ్ నేను, తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు సహా కొంత మంది పాల్గొన్నాం. చర్చల్లో భాగంగా నాలుగు ఆటలను ఐదు ఆటలు చేయమని, ముఖ్యంగా ఒంటి గంట ఆటను చిన్న సినిమాలకు కేటాయించమని చెప్పడమే కాకుండా చిన్న సినిమాలకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని సూచించాను. కమిటీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఈ సినిమా విషయానికి వస్తే వినాయకుడిని కేర్ చేయని హీరోను వినాయకుడి వాహనమైన ఎలుక ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందనేదే సినిమా. ఎలుక పాత్రలో బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, పావని, రఘుబాబు ఇలా అందరూ చక్కగా నటించారు. సినిమాలో గ్రాపిక్స్ చేయడం అంత సులువుకాదు. ఈ సినిమాలో నలబై నిమిషాలు గ్రాఫిక్స్ ఉన్నాయి. నమ్మినబంటులో ఎడ్లు, నాగినిలో పాము, ఈగ చిత్రంలో ఈగ ఎలాగో ఈ చిత్రంలో ఎలుక అలాంటి కీలకపాత్రలో కనిపిస్తుంది. వెన్నెలకిషోర్ లో డిఫరెంట్ కామెడి యాంగిల్ ఉంది. పావనికి హీరోయిన్ గా మంచి ఫ్యూచర్ ఉంది. అన్నీ టెక్నికల్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. ఫిభ్రవరి 26న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ముందు మార్నింగ్ షోకు వచ్చే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఫ్రీగా చూపించమని నేను నిర్మాతలకు సలహా కూడా ఇచ్చాను. ఈ చిత్రాన్ని అందరూ మంచి సక్సెస్ చేయాలి’’ అన్నారు.
PavaninGlam gallery from the event
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘’ఎలుకామజాకా నా కెరీర్లో చిత్రం గ్రాఫిక్స్ చేసిన చిత్రం. గ్రాఫిక్స్ చేయడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. ఈ సినిమాలో 40 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటుంది. వెన్నెలకిషోర్, బ్రహ్మానందంలు పోటీపడి నటించారు. రఘుబాబు డిఫరెంట్ మేనరిజమ ఉన్న క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు. హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి పావని చక్కగా నటించింద. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. విశ్వనాథ్ డైలాగ్స్, దివాకర్ గారి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సహా అన్నీ టెక్నికల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ అవుతాయి. సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. సినిమా అందరూ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు.
వెన్నెలకిషోర్ మాట్లాడుతూ‘’75 చిత్రాలను డైరెక్ట్ చేసిన రేలంగి నరసింహారావుగారి దర్శకత్వంలో ఈ సినిమా చేయడం అదృష్టం. సినిమా ఫిభ్రవరి 26న విడుదల అవుతుంది’’ అన్నారు.
కోడి రామకృష్ణ మాట్లాడుతూ ‘’రేలంగి నరసింహారావు తన కామెడి సినిమాలతో అందరికీ హాయినిచ్చే దర్శకుడు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగడంతో మంచి అవుట్ పుట్ ఉన్న సినిమా వచ్చింది. సినిమాగ్రాఫిక్స్ చూసి థ్రిల్లయ్యాను. దర్శకుడుగా రేలంగి నరసింహారావుగారికి హ్యట్సాఫ్ చెబుతున్నాను’’ అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘’ దర్శకుడు రేలంగి నరసింహారావుగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. గురువుగారు, కోడిరామకృష్ణగారు, ధవళసత్యంగారు ఇలా అందరూ ఇచ్చిన సలహాలు సినిమాకు పిల్లర్స్ లాగా నిలబడ్డాయి. సినిమాలో 1220 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి. మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు మెసేజ్ ఉన్న మూవీ ఇది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరియిన్ పావని, బల్లేపల్లి మోహన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.