Ram Charan - Mallreddy Engineering college annual fest
నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్ - రాంచరణ్..... కాలేజ్ స్టూడెంట్స్ తో చెర్రీ ఇనిస్పిరేషనల్ స్పీచ్
''ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే... మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది. ఆ వ్యక్తి నాతో గంటసేపు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నాకు లైఫ్ అంటే అర్థమైంది. కెరీర్ విలువ తెలిసింది. నా కెరీర్ కు ఆయనే ఇనిస్పిరేషన్. అయన మరెవరో కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్....''
తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాణే ఇనిస్పిరేషన్ అన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో రాంచరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచరణ్ కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడారు. తాను కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాడో వారితో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు... ప్రేమ, కెరీర్, ఫ్యామిలీ గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు. రాంచరణ్ స్పీచ్ విద్యార్థుల కేరింతలు విజిల్స్ మధ్య ఉల్లాసంగా సాగింది.
రాంచరణ్ మాట్లాడుతూ.... బాబాయ్ నాతో గంటసేపు మాట్లాడిన తర్వాత నా కెరీర్ కు అర్థం తెలిసింది. నాన్న ఎంత కష్టపడితే... ఈ స్థాయికి చేరుకున్నారో బాబాయ్ వివరంగా చెప్పాడు. ఆ స్థాయిని, ఆయన కష్టాన్ని, విలువను, ప్రతిష్టను నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలో చెప్పారు. ఆయన ఏర్పర్చిన ప్లాట్ ఫామ్ ని నిలబెట్టుకోలేకపోతే నేనైనా, నువ్వైనా వేస్ట్ అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నేనేం చేయాలో నాకు అర్థమైంది. నా గోల్ ఏంటనేది అర్థమైంది. అమ్మా నాన్న నా జీవితానికి ఎంత ఆదర్శమో... నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్. మీ కాలేజ్ లైఫ్ లో కూడా మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన వ్యక్తులు ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. మీ కెరీర్ ను ఉన్నతంగా మార్చుకోండి. కాలేజ్ వయసులో అమ్మాయిలను చూడగానే అబ్బాయిలకు.... అబ్బాయిలను చూడగనే అమ్మాయిలకు ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ప్రేమించి మాత్రమే పెళ్లి చేసుకోండి. కానీ 22 సంవత్సరాలకే పెళ్లి మాత్రం చేసుకోకండి. కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదు. స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదు. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, లవ్, కెరీర్ విషయంలో కేర్ తీసుకోండి. డెస్టినీని నమ్ముకోండి. నాకు ఉపాసనను ఇచ్చాడు. మా మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మా మధ్య అంత ప్రేమ ఉంది కాబట్టే మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడే బాబాయ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ పాసులు ఇచ్చారు. నేను మల్లారెడ్డి గారికి ఇస్తున్నాను. ఫ్యాన్స్ పాసులు కూడా ఉన్నాయందులో... అంటూ... చెర్రీ కాలేజ్ స్టూడెంట్స్ తో ఉద్వేగంగా మాట్డాడారు.