pizza
Rana launches Mirchi Tapaka Online Telugu Radio station
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 September 2015
Hyderabad

రేడియో మిర్చి ఆన్‌లైన్ స్టేషన్ ‘మిర్చి టపాకా’ ప్రారంభం!

బాహుబలి చిత్రం తెలుగు జాతి గర్వపడే విధంగా చేసిందని.. బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు హీరో దగ్గుబాటి రానా. రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిర్చి టపాకా ఆన్‌లైన్ తెలుగు రేడియోను రానా గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట రేడియో మిర్చి కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవ నటించడం తన జీవితంలో మధురానుభూతిని పంచిందని, ఈ చిత్రంలో అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ కావడం సంతోషంగా వుంది. రేడియో మిర్చి ప్రారంభించిన ఈ మిర్చి టపాకా ఆన్‌లైన్ తెలుగు రేడియో విజయవంతం కావాలి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేడియో మిర్చి డిజిటల్ రూపకర్త రాహుల్ బల్యాన్ తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved