12 January 2025
Hyderabad
Sankrantiki Vasthunnam starring Victory Venkatesh, Aishwarya Rajesh, Meenakshi Chaudhary and directed by blockbuster director Anil Ravipudi has released on 14th January all over. The movie opened to 100% housefulls everywhere and extra shows have been added at many places. The movie emerged as highest opening day grosser for Venkatesh and entire movie team.
So, the team came forward to thank audiences for such a wonderful response. Anil Ravipudi talking at the press meet attributed entire success to the massive pull of Venkatesh among families and called it as a Blockbuster Pongal and Venky's Pongal. He stated that from early shows families have been coming to theatres and thanked them for such a huge response.
Dil Raju complimented the team for coming up with great promotional work and taking film to everyone. He requested people to watch the film only in theatres and not to encourage piracy at all. Leading ladies Aishwarya and Meenakshi also thanked audiences for the response.
Venkatesh stated that he is thankful to everyone are coming to theatres and celebrating Sankranti with them. He remarked that he is hearing positive feedback from everywhere and stated that the movie is another blockbuster for him, Anil and Dil Raju. Shirish produced the film with a high budget and Dil Raju presented it.
'సంక్రాంతికి వస్తున్నాం' నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ కావడం ఆనందంగా వుంది. ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్ యూ: సక్సెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ రోజు (జనవరి 14) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అలరించి పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అఫ్ యూ. ఈ సంక్రాంతి మా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్, ఫ్యాన్స్ కి మనస్పూర్తిగా థాంక్ యూ. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం డిఫరెంట్ కైండ్ అఫ్ ఎమోషన్. సినిమాకి ప్రతి థియేటర్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్ గా వున్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా వుంది. అనిల్ నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనందంగా వుంది. ఇది తన కెరీర్ లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా వున్నాను. అందరికీ చాలా థాంక్స్.' అన్నారు
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బెసికలీ టెక్నికలీ కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్.(నవ్వుతూ) తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ థాంక్స్. బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైం ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లో ప్యాక్డ్ గా ఫ్యామిలీ ఆడియన్స్ వున్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. పండగ రోజులు ఇంకా అద్భుతంగా వుంటుంది. వెంకటేష్ గారికి ఫ్యామిలీస్ లో ఉన్న ఫుల్ ఏమిటో మనందరికీ తెలుసు. ఈసారి కరెక్ట్ గా పొంగల్ కి కుదిరింది, ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ'అన్నారు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి ఈ సినిమాకి వస్తున్న వైబ్ మాకు అర్ధమైయింది. ముందుగానే షోస్ యాడ్ అవుతూవెళ్ళాయి. ఆడియన్స్ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది. అమెరికా నుంచి అమలాపురం, ఆస్ట్రేలియా నుంచి అనకాపల్లి.. ఇలా షోలు పూర్తయిన వెంటనే బ్లాక్ బస్టర్ పొంగల్ అనే రిపోర్ట్స్ వచ్చేశాయి. సినిమాలో నాన్ స్టాప్ గా నవ్వులు ఎంజాయ్ చేస్తున్నారు. మా కాంబినేషన్ లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్ గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్ కి, వెంకటేష్ గారికి, హీరోయిన్స్ కి, ప్రేక్షులందరికీ థాంక్ యూ. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ వున్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్ లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా వుంటుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు.
నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. హ్యాపీ సంక్రాంతి. మాకు ఇంతటి విజయానికి కారకులైన వెంకటేష్ గారికి అనిల్ గారికి, హీరోయిన్స్ కి థాంక్ యూ. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్ యూ వెరీ మచ్.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి. సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. మీ అందరి ప్రేమకు థాంక్ యూ' అన్నారు
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మా టీం అంతా థియేటర్ లో చూశాం. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరి ప్రేమ, సపోర్ట్ కి థాంక్ యూ. ఇది మాకు స్పెషల్ సంక్రాంతి' అన్నారు.