06 January 2025
Hyderabad
విక్టరీ వెంకటేష్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.
ఓ ఇన్ప్లూయన్స్ వున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది, దాని గురించి వార్తలు బయటికి వస్తే ప్రభుత్వమే కూలిపోతుంది. దినిని నుంచి గట్టెక్కించగల ఎక్స్ పర్ట్ ని ప్రభుత్వం ఆశ్రయిస్తుంది. వెంకటేష్ ఎక్స్ పోలీసు, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. అతని భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్ )తో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు. వెంకటేష్ మాజీ ప్రియురాలు, పోలీసుగా ఉన్న మీనాక్షి చౌదరి కిడ్నాప్ కేసును ఛేదించడంలో సహాయం కోసం అతనిని సంప్రదించడంతో వారి ప్రశాంత జీవితానికి ఇబ్బంది కలుగుతుంది. వెంకటేష్ మిషన్‌ను చేపట్టడానికి అంగీకరిస్తాడు, అయితే భాగ్యం సపోర్ట్ తో అతను ఆపరేషన్‌లో భాగం కావాలని పట్టుబటతాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రం భగవంత్ కేసరిలో విలక్షణమైన ఎంటర్‌టైనర్ తో ఆకట్టుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంతో మరో సరికొత్త అనుభూతిని అందించారు. ట్రైలర్‌లో సూచించినట్లుగా ఈ చిత్రం ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాను బ్లెండ్ చేస్తుంది. వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ అందించారు, కామెడీ, ఫ్యామిలీ డైనమిక్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆదరగొట్టారు. ఐశ్వర్య రాజేష్ ఆదర్శ భార్యగా ఆకట్టుకుంది, మీనాక్షి చౌదరి వెంకటేష్ మాజీ ప్రేయసిగా, టఫ్ పోలీసుగా కథాంశానికి డెప్త్ జోడించారు. ఈ ట్రై యాంగిల్ రిలేషన్ కథకు ఆసక్తికరమైన డైనమిక్‌ని తెస్తుంది.
ట్రైలర్ ఫన్, యాక్షన్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా పర్ఫెక్ట్ మిక్స్. సాంకేతికంగా, విజువల్స్ అద్భుతంగా వుంది, సమీర్ రెడ్డి అసాధారణమైన సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో పవర్ ఫుల్ స్కోర్ తో కట్టిపడేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నతంగా వున్నాయి. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు, స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందించారు. సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి పర్ఫెక్ట్ ఛాయిస్, పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది. ఈ చిత్రం జనవరి 14, 2025న సంక్రాంతికి విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిజామాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరగడం చాలా హ్యాపీగా వుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ కి థాంక్ యూ. నాకు ఎన్నో హిట్లు ఇచ్చారు. బొబ్బిలిరాజా, చంటి, గణేష్ , సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలా ఎన్నో విజయాలు ఇచ్చారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నాం. సంక్రాంతి సినిమా ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అఫ్ ఎంటర్ టైన్మెంట్, సాంగ్స్.. ఇలా అనిల్ హోల్సం ఎంటర్ టైనర్ ని ఇచ్చారు. మీ అందరికీ నచ్చుతుంది. మీ అభిమానం సంక్రాంతికి చూపిస్తారు. ఈ సినిమాలో పాటు గేమ్ చెంజర్ డాకు మహారాజ్ అన్నీ పెద్ద హిట్లు కావాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు బ్యానర్ లో చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దిల్ రాజు, శిరీష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. అనిల్ థాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య, మీనాక్షి చాలా అద్భుతంగా పెర్ఫారం చేశారు. పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు(నవ్వుతూ). సినిమా చూడండి. మామూలుగా వుండదు. అందరికీ థాంక్ యూ' అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం. అనిల్ నిజామాబాద్ లో వేడుక చేద్దామని అన్నారు. వెంకటేష్ గారు అనిల్ శిరీష్ వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్ 10న రిలీజ్ అవుతుంది. మా బ్యానర్ లో ఎఫ్ 2 ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే డాకు మహారాజ్ ని నైజంలో మేము రిలీజ్ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఐశ్వర్య రాజేష్ సహజంగా నటించింది. ఆ పాత్ర చాలా నచ్చుతుంది. మీనాక్షి పోలీస్ క్యారెక్టర్ అలరిస్తుంది. రామానాయుడు గారు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేష్ గారి కలియుగ పాండవులు ఫోటో చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యాను. వారిద్దరూ నా అభిమాన హీరోలు. వెంకటేష్ గారు వుంటే నిర్మాత సెట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసిన హీరో వెంకటేష్ గారు. నిర్మాతని ప్రేమగా చూసుకునే హీరో ఆయన. వెంకటేష్ గారికి థాంక్ యూ సో మచ్. అనిల్ అద్భుతంగా సినిమా తీశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అన్నీ పేర్చుకొని సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు అనిల్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ వెరీ మచ్' అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ అందరూ చూశారు. ట్రైలర్ లో చూసింది ఇంతే సినిమాలో చాలా చాలా వుంది. ఇది టిపికల్ జోనర్ సినిమా. వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాలో చాలా ట్విస్ట్ లు టర్న్స్ వుంటాయి. ఖచ్చితంగా పండక్కి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. దిల్ రాజు గారి బ్యానర్ లో ఇది నా ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరూ సపోర్ట్ గా నిలుచారు. ఐస్వర్య, మీనాక్షి చాలా చక్కగా నటించారు. వెంకటేష్ గారు మనందరికీ నచ్చే వెంకీ మామ. ఆయన కెరీర్ లో చాలా గొప్ప పాత్రలు చేశారు. ఆయన కెరీర్ లో ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రమోషన్స్ లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు థాంక్ యూ. మా టీం అందరికీ థాంక్ యూ. థాంక్ యూ నిజామాబాద్. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని థియేటర్స్ కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతాం. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం డోంట్ మిస్. థాంక్ ' అన్నారు
నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను వేదిక పై ఎప్పుడూ మాట్లడను. మన నిజాంబాద్ లో జరుతున్న వేడుక ఇది. అందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిన భాద్యత వుంది. వెంకటేష్ గారికి, అనిల్ గారికి, హీరోయిన్స్ కి, అందరికీ పేరుపేరు ధన్యవాదాలు' అన్నారు.
ఎమ్మల్యే సూర్యనారయణ మాట్లాడుతూ.. వెంకటేష్ గారి ఫ్యాన్ లేని ఫ్యామిలీ వుండదు. ఆయన సినిమాలు ఫ్యామిలీ అందరితో చూడదగ్గవి. దిల్ రాజు గారు మా నిజాంబాద్ హిందూర్ వాసి అని చెప్పడం గర్వంగా వుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని, అందరూ చూడాలని కోరుకుంటున్నాను.
యాక్టర్ డా. నరేష్ వికే మాట్లాడుతూ.. ట్రైలరరే ఇంత బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మీరే ఊహించండి. సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్ వస్తున్నాం. సినిమా రిలీజ్ కి ముందే వైరల్ హిట్ అయ్యింది. సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజు గారివే. వెంకటేష్ గారితో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో మరో హిట్ కొట్టబోతున్నాం. అనిల్ రావిపూడి గారు నా డ్రీం డైరెక్టర్. ఈ ట్రై యాంగిల్ జంట మ్యాజిక్ చేయబోతోంది. ఇందులో నా క్యారెక్టర్ విటీ గణేష్ గారి పాత్రలు కూడా అలరిస్తాయి. సినిమా ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది' అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో భాగ్యం క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా వుంది. మీ అందరికీ నచ్చుతుంది. చాలా స్పెషల్ క్యారెక్టర్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు గారు శిరీష్ గారు హీరో వెంకటేష్ గారికి అందరికీ థాంక్ యూ. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీ అందరికీ నచ్చుతుంది.' అన్నారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న రిలీజ్ అవతుంది. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చూడబోతున్నాం. ఈ మూడు సినిమాలు కూడా అలరిస్తాయని కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రేమకి థాంక్ యూ.
తారాగణం: వెంకటేష్ దగ్గుబాటి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, VT గణేష్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
క్లో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్
VFX: నరేంద్ర లోగిసా