pizza

Shashtipoorthi glimpse launch
Shashtipoorthi movie shows us the solution for long-lasting happiness, says Nata Kireeti Rajendra Prasad
మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ‘షష్టిపూర్తి’ సినిమా చెబుతుంది: నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్

You are at idlebrain.com > News > Functions
Follow Us


08 January 2025
Hyderabad

Shashtipoorthi, starring Nata Kireeti Rajendra Prasad in a heart-moving role, is a family drama entertainer laced with emotions, traditions, love and a lot more. Produced by Maa Aaie Productions with Rupeysh in the lead role, the film also features National Award winner Archana and Akanksha Singh. This is the first time in 38 years after the classic film 'Ladies Tailor' that Nata Kireeti and Archana are acting together. Directed by Pavan Prabha and produced by Hero Rupeysh Choudhary himself, its Glimpse was out today.

Speaking on the occasion, actor Dr. Rajendra Prasad wondered about the fortune he has had in getting to do meaningful roles. He added that he always refers to the media fraternity as his siblings. He attributed the love they shower on him to the Almighty's blessings. "Shashtipoorthi is not just a film, it's life itself. I have become a part of your homes. PV Narasimha Rao, who became the Prime Minister of the country, used to say, 'There will be a lamp in the house, a cot to sleep, and Prasad'. Truly, the films I have made since 'Aa Naluguru' have been because of God's blessings on me. Each of us who has acted in Shashtipoorthi in the age of OTT are proud of it. In the age of films like Mr. Pellam, families used to flock to cinemas. There would be no parking space even. Shashtipoorthi is one such family-friendly movie. Shashtipoorthi ceremonies are crucial in our culture. Rupeysh has played a dual role, as an actor and a producer. He knows his task as a producer. He is committed. He is a very good student as an actor. He would ask for my feedback on his acting on set. Padma Shri Thota Tharani has worked on our movie as an Art director. Lyricist Chaitanya Prasad's song from 'Aa Naluguru' has been played during mourning periods of VIPs. He is a fine lyricist who has written songs in Shashtipoorthi. Archana was a highly seasoned performer even when we acted together in Ladies Tailor. Our characters in Shashtipoorthi are solid. I have always felt as a responsible actor ever since my training institute days. Chiranjeevi garu once said that it would be shocking if I don't give my best. Amazing technicians have worked on this movie Shashtipoorthi. Those who respect Telugu culture will love our movie. I feel truly blessed to have done this film. Please watch it with your parents, grandparents and children. The purpose of this film is to speak for our culture and traditions. Please watch it only in theaters," Rajendra Prasad said.

Actress Archana said, "After a very long gap, I am coming before the Telugu audience. When producer Rupeysh and director Pavan Prabha approached me for this film, the first thing I asked was, 'What is the name of the movie?' I also asked, 'Who will I be acting with?' They said, 'One of the very, very important actors in Indian cinema,' referring to Dr. Rajendra Prasad. You may not have seen the Tamil films that Rajendra Prasad has acted in as the hero, but I have always been watching them. He is the actor everyone wants. Such recognition is very important for an actor. With this recognition, he continues to be a legend. I cannot say more than that. Maestro Ilaiyaraaja is also a part of this movie. If an artist like him is part of this film, who can say no? Then there’s art director Thota Tharani, with whom I am working for the first time. He is a great art director. This is an extraordinary team. Great people have come together to make this film. Producer and Hero Rupeysh has worked hard for this movie. Their passion and love for cinema are evident. Teaching such wonderful values is our duty, and that’s what we did in this film. Regarding Akanksha, when I see her, I am reminded of veteran filmmaker Bapu garu. Because she looks like a Bapu bomma. These people are like my children. I wholeheartedly send my blessings to all of them. I would like to thank everyone who gave me such a warm welcome."

Actor-producer Rupeysh said, "Shashtipoorthi is my first film. I hope that Shashtipoorthi will be appreciated by everyone, and I wish for everyone’s blessings."

Lyricist Chaitanya Prasad said, "Some films become special in certain people's lives. For me, Aa Naluguru was one such film, and now Shashtipoorthi is another. The title song has been written by me. The hero, director, and producer are all new to the industry, and here they were talking about roping in Ilaiyaraaja sir. I was doubtful if this was doable. Later, they provided more details about the song. I decided to wait and watch. Then they invited me to Chennai to meet Ilaiyaraaja sir. That’s when I believed that it was happening, finally. Writing even one song for an Ilaiyaraaja sir song was my dream, and this team made that dream come true. I have written songs for many films, but the song I wrote for Rajendra Prasad garu in Aa Naluguru will always be special to me. There is another song for him in this film as well. Then Archana ma'am and other legends joined the team. Legends didn’t just work on this film; they fell in love with it. I didn’t just write songs for Aa Naluguru; it was a journey. So also in the case of Shashtipoorthi. Even though my work is completed, the journey continues, and I feel deeply connected to this film. I must express my gratitude to Keeravani sir, who has written one of the songs. In Shashtipoorthi, Rupeysh and Akanksha Singh make one pair, while elder brother Rajendra Prasad and Archana ma'am make another pair. Both pairs have outcompeted each other."

Director Pavan Prabha thanked the core team, saying that Rupeysh, Rajendra Prasad and Archana took the film to another level with their power-packed performances. "When you watch them on screen, you won’t be able to blink even for a second. I promise this. Showing a two-and-a-half-hour film in just one minute is a challenge, but I hope you enjoyed the glimpse. Rupeysh sir always said one thing: Whatever film we make, it should have good values, morals, and ethics. A movie that satisfies this criteria will always stand the test of time. I am a huge fan of Ilaiyaraaja sir. I had jitters while giving him a narration. He would belt out tunes on the spot by intuitively understanding what I was intending to convey. Chaitanya Prasad's lyrics are a godsend. Rehman has written two songs. The technical team has done a great job. When I wrote the female lead character, I wrote it as Janaki. It's how I have saved her number in my phone," the director said.

Heroine Akanksha Singh said, "I am very excited to have acted in this film. I am extremely happy to be part of a film made with a great story. I thank Pavan sir and Rupeysh sir for giving me the opportunity to play the role of Janaki. I hope everyone watches this film with their family in theaters. Ilaiyaraaja sir, Thota Tarani sir, and Chaitanya Prasad sir gave their heart and soul to this film. This movie wouldn’t have been possible without our beloved Rajendra Prasad sir and Archana ma'am. I hope everyone watches this film with their family."

Jabardasth Ram said, "I am really proud to be a part of the movie. It brings me a lot of joy. Director Pavan Prabha gave me a great role. Shashtipoorthi is a milestone ceremony. By that time, children would have grown up, and I think the values of parental nurturing start at that point. This movie tells us what we might be missing in our real lives. I am very happy to have had the opportunity to act with such great actors. I hope that more films like this - films that enhance societal values - will continue to come."

Actor Anil said, "I would like to thank the director for giving me the opportunity in this film. Our entire family has a deep admiration for Rajendra Prasad sir. It’s an honor for me to act alongside him. We enjoyed working on this movie, and I hope you will also enjoy watching it."

Comedian Chalaki Chanti said, "There are some great scenes between me and Jabardasth Ram. I won’t reveal my character at this stage. A big thank you to producer-hero Rupeysh. Rajendra Prasad sir is our guru. The atmosphere on set was different when he was around. I was nervous in his presence. Truly, this movie brings you closer to a festival, bringing everyone closer."

Lead Cast:

Dr. Rajendra Prasad, 'National Award Winner' Archana, Rupeysh Choudhary, Akanksha Singh.

Artists: Prabhas Sreenu, Chalaki Chanti, Chakrapani Ananda, Achyut Kumar, Muralidhar Goud, Anil , Jabardasth Ram, Latha, Swetha, Ruhi, Sanjay Swarup, Ambaresh Appaji, Anupama, Mahi Reddy.

Technicians:

Story, Screenplay, Conversations - Pavan Prabha
Producer - Rupeysh Choudhary
Banner - Maa Aaie Productions
Music - Maestro Ilaiyaraaja
Art Director - 'Padma Sri' Thota Tharani
Editor – Karthika Srinivas
DoP – Ram
Lyricist - 'Padma Sri' M.M. Keeravani, Chaitanya Prasad, Rehman
Choreographer: Swarna, Eswar Penti, Nixon
Costume Designer – Ayesha Mariam
Publicity Designer – Anil & Bhanu
Digital Marketing - Talk Scoop

మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ‘షష్టిపూర్తి’ సినిమా చెబుతుంది: నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్

రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ చిత్ర గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీమ్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నట కిరీటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘షష్టిపూర్తి.. ఈ అదృష్టం నా ఒక్కడికేనా.. లేదంటే ఇంకెవరికైనా ఉందా? మీడియా వాళ్లని మీడియా మిత్రులు అని అనను. దాదాపు వారు కూడా నాతో పాటు 40, 30 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. అందుకే మీడియా సోదరులు అని అంటాను. వారంతా నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం అని అనుకుంటాను. అదృష్టం ఏమిటని అనుకుంటున్నారా? వయసుకు తగినట్లుగా పాత్రలు. రాజేంద్ర ప్రసాద్‌కు షష్టిపూర్తి. నిజ జీవితంలో నాకు అరవై దాటిన తర్వాత షష్టిపూర్తి పెట్టకుండా తప్పించుకున్నాను. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇలా షష్టిపూర్తి చేశాడు. ఇది సినిమా కాదు.. జీవితం. మీ అందరి ఇళ్లలోని వస్తువును అయిపోయాను నేను. పీవీ నరసింహారావుగారు.. ప్రధానిగా చేశారు దేశానికి. ఆయన ఏమనేవారో తెలుసా.. ‘ఇంట్లో కంచం ఉంటాది.. మంచం ఉంటాది.. ప్రసాదు ఉంటాడు’ అని అనేవారు. నిజంగా నేను ‘ఆ నలుగురు’ తర్వాత చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమాలో పనిచేసిన నేను కాదు.. అందరూ కూడా గర్వపడే సినిమా. ఎందుకంటే, సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది. ఓటీటీలో రూపంలో ఇంట్లోకి వచ్చేసింది. థియేటర్ల నుండి ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు నా సినిమాల గురించి ఏం మాట్లాడుకునే వారంటే.. ఇది రాజేంద్రపసాద్ సినిమానా? అయితే కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి. ఫ్యామిలీల ఫ్యామిలీలు సినిమాలకు వస్తారనేవారు. ఒక టికెట్ తెగే దగ్గర 10, 12 టికెట్లు తెగేవని అనేవారు. నిజంగా అది నిజమైతే.. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలి. తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందీ అంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం. ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ఫస్ట్ టైమ్ నిర్మాత అయినా కూడా.. ఎక్కడా చిన్న తేడా కూడా జరగకుండా చూసుకున్నాడు. ఇళయరాజాగారు, కీరవాణిగారు, చైతన్యప్రసాద్ ఇలాంటి వారంతా ఈ సినిమాకు పనిచేశారంటే.. నిర్మాతగా అతను ఎంత బాగా చూసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నటించిన వారందరికీ నా మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. అప్పటి బ్రహ్మానందం నుండి ఇప్పుడు చంటి వరకు అందరికీ నేనంటే గౌరవం. సెట్స్‌లో కూడా చాలా చక్కటి వాతావరణం ఉండేది. హీరోగా రూపేష్ చాలా చక్కగా నటించాడు. చాలా నేర్చుకున్నాడు. ఆకాంక్ష నాతో ఇంతకు ముందు నా కుమార్తెగా నటించింది. అర్చన.. ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పటికే ఆమె మెచ్యూర్డ్ నటి. నన్ను వంశీ ఎంతో భయపెట్టేవాడు. అన్ని సంవత్సరాల క్రితం నటించిన మేము.. మళ్లీ ఇలా కలుసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నాకు వర్క్ చేయడం రెస్పాన్సిబిలిటీ. నాకు పాత్ర దొరకడం అదృష్టం. ఇళయరాజా దగ్గరకి వెళ్లి.. ఈ సినిమా పేరు చెప్పి నా పేరు చెప్పగానే ఆయన కూడా షాక్ అయ్యారట. షష్టిపూర్తి ఒక మంచికథ. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు.. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో సహ కలిసి వెళ్లి థియేటర్లలో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మన ఇళ్లలో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ సినిమా చెబుతుంది.. అందరూ చూడాలని కోరుతూ.. తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ పాద నమస్కారాలు..’’ అని అన్నారు.

నటి అర్చన మాట్లాతుతూ.. ‘‘చాలా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మా ఆయి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి మరియు డైరెక్టర్ పవన్ ప్రభ వీళ్లిద్దరూ కలిసి నాకు ఈ సినిమా ప్రపోజ్ చేసినప్పుడు.. సినిమా పేరు ఏంటి? అని అడిగాను. ‘షష్టిపూర్తి’ అని అన్నారు. నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి.. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ సినిమాలు హీరోగా మీరెవరు చూసి ఉండరు బహుశా. కానీ నేనెప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ. ఆయన అందరికీ కావాల్సిన నటుడు. ఒక యాక్టర్‌కి ఈ గుర్తింపు చాలా అవసరం. ఆ గుర్తింపుతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్‌గా కొనసాగుతున్నారు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. తర్వాత ఇళయరాజా గారు ఉన్నారు ఈ సినిమాలో అంటే.. ఆ సినిమాని ఒప్పుకొని ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరి జీవితానికి ఆయన ఎంతో ముఖ్యం. తోట తరణి గారు. ఆయనతో నాకు ఇదే మొదటి సినిమా. ఆయన ఎంత గొప్ప ఆర్ట్ డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ గురించి ఆలోచించడమే చాలా అపూర్వంగా అనిపించింది నాకు. ఇంత మంచి కాంబినేషన్‌ని అలోచించి ఒకళ్ళు సినిమాను మా దగ్గరికి తీసుకువస్తున్నారు అని అంటే.. వారికి ఎంత గొప్ప హృదయం ఉందో తెలుస్తుంది. నాకు వాళ్లు సినిమా ఇవ్వడం లేదు. వారి సోల్, హార్ట్‌ని నాకు ఇస్తున్నారనిపించింది. అది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే నేను ఈ సినిమాలో ఒక భాగమయ్యాను. నిర్మాత, హీరో రూపేష్, దర్శకుడు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్లకి సినిమా అంటే ఎంత ప్యాషనో, ప్రేమో తెలుస్తుంది. ఇలాంటి మంచి విలువలు నేర్పడం మన కర్తవ్యం. అదే మేము చేశాము. ఆకాంక్ష గురించి చెప్పాలంటే. తనని చూస్తుంటే నాకు బాపు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే బాపు బొమ్మలా ఉంది. వీళ్లంతా నా బిడ్డల లాంటి వారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు ఇంత గొప్ప వెల్‌కమ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’’ అని అన్నారు.

హీరో రూపేష్ మాట్లాడుతూ... ‘‘షష్టిపూర్తి’ నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇక్కడున్న అందరూ చెప్పారు. ‘షష్టిపూర్తి’ సినిమాను అందరూ ఆదరిస్తారని, అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ’’ అని తెలిపారు.

చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా మందికి థ్యాంక్స్ కార్డు చెప్పాలి. నాకు ఇంతమంచి సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్ గారికి థ్యాంక్యూ. ఐ లవ్ యు ఫరెవర్. నా సెకండ్ థ్యాంక్స్.. రాజేంద్రప్రసాద్‌గారికి, అర్చనమ్మగారికి. ఎందుకంటే, ఈ సినిమాలో వారు పవర్ ప్యాక్‌డ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. స్క్రీన్ మీద వాళ్లని చూస్తున్నంతసేపు.. రెప్ప కూడా వేయలేరు. నేను ప్రామిస్ చేసి చెబుతున్నాను. గ్లింప్స్ అంతా చూశారు. రెండున్నర గంటల సినిమాను ఒక్క నిమిషంలో చూపించడం కష్టమే కానీ.. మీ అందరికీ గ్లింప్స్ నచ్చిందనే అనుకుంటున్నాను. రూపేష్ సార్ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మనం ఏం సినిమా చేసినా అందులో మంచి విలువలు ఉండాలని. మోరల్స్, ఎథిక్స్ ఉండాలి అని చెప్పేవారు. ఈ మూడు ఉన్న సినిమా ఏదైనా సరే.. అలా నిలిచిపోతుంది. నేను అలాంటి సినిమా చేయాలని అన్నారు. అలా ఈ ‘షష్టిపూర్తి’ వచ్చింది. ఇళయరాజాగారికి పెద్ద అభిమానిని నేను. ఆయనకు నేను సీన్ చెప్పడానికి షివరింగ్ వచ్చింది. కానీ వండర్‌ఫుల్ థింక్స్ అంటాం కదా.. అది నేను రాజా సార్‌తో నా లైఫ్‌లో చూశాను. నేను ఏం చెబుతున్నానో కూడా ఆయనకు తెలియదు.. హార్మోనియం ముందు కూర్చుని అప్పటికప్పుడు ట్యూన్స్ ఇచ్చేశారు. నిజంగా నా జన్మ ధన్యమైంది. చైతన్య ప్రసాద్‌గారు నాకు బంగారం లాంటి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఎవరో కాదు కీరవాణి సార్. రెహమాన్ గారు ఇక్కడకు రాలేదు కానీ.. ఆయన కూడా రెండు మంచి పాటలు రాశారు. డిఓపీ రామ్ ఫెంటాస్టిక్ వర్క్ సార్. ఎడిటర్ కార్తీక్.. అద్భుతంగా సినిమాను డిజైన్ చేశారు. నేను స్క్రిప్ట్ రాసుకునే సమయంలో కూడా జానకి అనే రాసుకున్నా. నా ఫోన్‌లో కూడా హీరోయిన్ పేరు జానకి అనే ఉంటుంది. ఈ రోజుకి కూడా ఆమె పేరు నాకు సరిగా తెలియదు. నేను జానకి అనే ఫిక్సయ్యాను. ఆమె ఇందులో అద్భుతమైన పాత్ర చేశారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే చెబుతాను.. థ్యాంక్యూ ఆల్’’ అని అన్నారు.

గీత రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాలు కొందరి జీవితానికి ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలా నాకు ‘ఆ నలుగురు’.. ఇప్పుడు ‘షష్టిపూర్తి’ సినిమా. ఉదయ్ నందనవనం అనే దర్శకుడు ఈ యూనిట్‌ స్నేహితుడు. నాకు కూడా అతను స్నేహితుడు. ఈ సినిమా ప్రారంభం అవకముందే ఆయన కాల్ చేసి.. పాటల గురించి మాట్లాడడానికి రమ్మంటే వాళ్ల ఆఫీస్‌కి వెళ్లాను. నాకు అప్పటికే పవన్‌తో పరిచయం ఉంది. రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యాడు. సినిమా పేరు ‘షష్టిపూర్తి’. ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారు. మీరు టైటిల్ సాంగ్ రాయాలని చెప్పారు. హీరోకి, దర్శకుడికి, నిర్మాతకి ఇదే మొదటి సినిమా. వీళ్లేమో ఇళయరాజాగారి పేరు చెబుతున్నారు. ఇది అయ్యే పని కాదులే అని అనుమానించా. తర్వాత పాట గురించి వివరాలు చెప్పారు. కానీ జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్నా. తర్వాత ఇళయరాజాని కలవడానికి చెన్నై రమ్మన్నారు. టికెట్స్ పంపించారు. అప్పుడు నమ్మాను. ఇళయరాజాగారితో ఒక్క పాట అయినా రాయాలనేది నా డ్రీమ్. నా డ్రీమ్‌ని నెరవేర్చిన టీమ్‌కి ధన్యవాదాలు. ఎన్నో సినిమాలకు పాటలు రాశాను. కానీ అన్నయ్య రాజేంద్రప్రసాద్‌కు రాసిన ‘ఆ నలుగురు’లోని పాట ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ సినిమాలో కూడా అన్నయ్యపైనే నేను రాసిన పాట ఉంటుంది. ఆ తర్వాత అర్చన గారు.. ఇలా ఒక్కొక్కరుగా దిగ్గజాలు ఈ సినిమాకు యాడ్ అయ్యారు. దిగ్గజాలు అందరూ ఈ సినిమాకు పనిచేశారు. పనిచేయడమే కాదు.. వీళ్లను ప్రేమించారు. ‘ఆ నలుగురు’ సినిమాకు పాటలు మాత్రమే రాయలేదు. ఆ సినిమాతో కంప్లీట్ జర్నీ చేశాను. ఈ సినిమాకు కూడా అంతే. నా పని ఎప్పుడో పూర్తయినా.. ఇంకా జర్నీ కొనసాగుతూనే ఉంది. అంతగా ఈ సినిమాతో మమేకమయ్యాను. అన్నీ నాతో మాట్లాడిన తర్వాతే ఈ సినిమాకు చేశారు. ఇందులో ఇంకో విశేషం.. కీరవాణిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనతో పాట రాయించాలని రచయితనైన నన్నే వచ్చి అడిగాడు దర్శకుడు. ఇళయరాజా, కీరవాణిగారి కాంబినేషన్ అనగానే నాకు చాలా గొప్పగా అనిపించింది. వారితో జరిగిన సంభాషణ, పాట క్రియేట్ అయిన దాని గురించి మరో సందర్భంలో చెబుతా. ఈ ‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్ష ఒక జంట అయితే.. అన్నయ్య రాజేంద్ర ప్రసాద్, అర్చనగారు మరో జంట. రెండు జంటలు పోటీ పడి నటించారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ.. థ్యాంక్యూ..’’ అని అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నటించినందుకు చాలా ఎగ్జయిట్‌గా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కథతో తెరకెక్కిన సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. జానకి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన పవన్, రూపేష్‌గార్లకు థ్యాంక్యూ. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను థియేటర్లలో చూడండి. ఇళయరాజాగారు, తోటతరణిగారు, చైతన్యప్రసాద్‌గారు ఈ సినిమాకు ప్రాణం పోశారు. మనకి ఎంతో ఇష్టమైన రాజేంద్రప్రసాద్‌గారు, అర్చనగారు లేకపోతే ఈ సినిమానే లేదు. ఈ సినిమాను అంతా ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ’’ అని అన్నారు.

జబర్దస్త్ ఫేమ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘నిజంగా ‘షష్టిపూర్తి’ అనే మూవీలో నటించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు పవన్ ప్రభ మంచి పాత్ర ఇచ్చారు. షష్టిపూర్తి గురించి నేను చెప్పాలంటే.. తల్లిదండ్రుల పెంపకం షష్టిపూర్తి తర్వాతే మొదలవుతుందని నేను అనుకుంటాను. అప్పటికి పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆ పెంపకపు విలువలు అప్పటి నుండి మొదలవుతాయని నేను భావిస్తున్నాను. మన రియల్ లైఫ్‌లో ఏం మిస్ అవుతున్నామో ఈ సినిమా చెబుతుంది. గొప్ప నటీనటులతో కలిసి నటించే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు, సమాజం విలువలు పెంచే సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

నటుడు అనిల్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేంద్రప్రసాద్‌గారంటే మా ఇంటిల్లిపాదికి ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి నటించినందుకు నాకు ఎంతో గౌరవం దక్కింది. ఈ సినిమా మేము చేస్తూ ఎంజాయ్ చేశాం.. మీరు చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

చలాకీ చంటి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నాకు, రామ్‌కు మధ్య మంచి సన్నివేశాలు ఉన్నాయి. నా పాత్ర ఏంటనేది ఇప్పుడు చెప్పను. నిర్మాత రూపేష్‌గారికి, హీరో రూపేష్‌గారికి థ్యాంక్యూ సో మచ్. రాజేంద్రప్రసాద్‌గారు మాకు గురువుగారు. ఆయన సెట్లో ఉంటో సందడే వేరు. ఆయనని చూస్తూ డైలాగ్స్ కూడా సరిగా చెప్పలేకపోయాను. నిజంగా ఈ సినిమా మిమ్మల్ని ఓ ఫంక్షన్‌కి తీసుకెళుతుంది. మిమ్మిల్ని అందరినీ దగ్గరకు చేర్చుకుంది. మా అందరికీ అదే ఫీల్‌ని ఈ సినిమా ఇచ్చింది.. అందరికీ థ్యాంక్యూ సో మచ్’’ అని అన్నారు.

రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్, 'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, 'చలాకి' చంటి, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి , రుహీనా, రామ్మోహన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

'షష్టిపూర్తి' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ కంట్రోలర్ : బిఎస్ నాగిరెడ్డి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్టంట్స్ : రామకిషన్, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, నిక్సన్ మాస్టర్, ఈశ్వర్ పెంటి, లిరిక్స్: ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి - రెహమాన్ - చైతన్య ప్రసాద్, కో డైరెక్టర్ : సూర్య ఇంజమూరి, డీఓపీ: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్ : మా ఆయి ప్రొడక్షన్స్ LLP, నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి, కథ - సంభాషణలు - దర్శకత్వం: పవన్ ప్రభ

 

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved