pizza
Saaho Ye Chota Nuvvunna song launch
`సాహో` సెకండ్ సాంగ్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


2 August 2019
Hyderabad

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`. `బాహుబలి` తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 30న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సినిమా రెండో సాంగ్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో...

ద‌ర్శ‌కుడు సుజిత్ మాట్లాడుతూ ``ప్ర‌భాస్‌గారితో నాకు మూవీ ఎక్స్‌పీరియ‌న్స్ కంటే ప‌ర్స‌న‌ల్‌గా చాలా మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఉంది. ఆయ‌న‌తో నేను ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఫ్రెండ్లీగా ఉంటా. దాంతో నాకు సినిమా చేసేట‌ప్పుడు పెద్ద‌గా క‌ష్టం అనిపించ‌లేదు. `సాహో` సినిమాని `బాహుబ‌లి`తో కంపేర్ చెయ్య‌లేం. `బాహుబ‌లి ది బిగినింగ్` జ‌రుగుతున్న‌ప్పుడు `సాహో` క‌థ గురించి చెప్పాను. ఆయ‌న నేను క‌థ చెప్పే విధానం న‌చ్చింది. దాంతో సినిమాను నేను హ్యాండిల్ చెయ్య‌గ‌ల‌నన్నా న‌మ్మ‌కంతో ఇచ్చిన మాట ప్ర‌కారం నాతో సినిమా చేశారు. అంతా కేవ‌లం న‌మ్మ‌కం వ‌ల్లే ఈ సినిమా జ‌రిగింది. `సాహో` చాలా పెద్ద చిత్రం. `సాహో`కి `బాహుబ‌లి` విజ‌యంతో సంబంధం లేదు. ఆ విజ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌లో ఎలాంటి మార్పులు చెయ్య‌లేదు. ఈ క‌థ‌కి ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మో అంత‌వ‌ర‌కే చేశాం. ప్రోగ్రెస్ అంతా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమా షెడ్యూల్ అంతా ఎక్కువ‌గా ఫారెన్‌లో జ‌రిగింది. అక్క‌డ ప్ర‌తిదీ ప‌ర్మిష‌న్స్‌తో సంబంధం కాబ‌ట్టి కాస్త పేప‌ర్ వ‌ర్క్ ఎక్కువగా చెయ్యాల్సి వ‌చ్చింది. ఈ చిత్రంలో మొత్తం మీద 4 పాట‌లున్నాయి. అందులో ఇప్పుడు విడుద‌ల చేసిన పాట మాత్ర‌మే కాస్త రొమాంటిక్ మూడ్‌లో ఉంటుంది. మిగ‌తావ‌న్నీ నార్మ‌ల్‌లాగే ఉంటాయి. కథానుగుణంగా లవ్ ఎలిమెంట్ కూడా కీలకంగా ఉంటుంది. బాలీవుడ్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాలా దీన్ని తెర‌కెక్కించాల‌ని ట్రై చెయ్య‌లేదు. కాక‌పోతే ప్రేక్ష‌కుల‌కు కాస్త కొత్త‌గా చూపించాల‌నుకున్నా. ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ ఒక్కోటి ఒక్కో థీమ్‌లో ఉంటాయి. ఒక్క‌రే మ్యూజిక్ ఎందుకు? వేరే వేరే వాళ్ళు ఇస్తే బావుంటుంద‌న్న ఉద్దేశ్యంతో వేరు వేరు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ఎంచుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమా చాలా పెద్ద‌ది కాబ‌ట్టి నేను ఐదేళ్ళ‌యినా వెయిట్ చేశాను. ఈ మూవీ బడ్జెట్ కంట్రోల్ కూడా మేము ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద్వారా చేశాం. ఈ సినిమా ప్ర‌భాస్‌గారి ఇమేజ్‌, `బాహుబ‌లి` ఇమేజ్ అనేమిలేదు క‌థ‌కు త‌గ్గ‌ట్టుగానే తెర‌కెక్కించాం. ప్ర‌భాస్ చాలా సూప‌ర్బ్ ప‌ర్స‌న్‌. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయ‌న కోసం ఇంత కాలం వెయిట్ చేశాను`` అన్నారు.

పాటల ర‌చ‌యిత క్రిష్ణ‌కాంత్ మాట్లాడుతూ ``ఇంత పెద్ద సినిమాలో నాకు మంచి పాట రాసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన యు.వి. క్రిషేష‌న్స్‌కి, సుజిత్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నాకు పాట సిట్యువేష‌న్ చెప్పేవారు నేను దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌దాల‌ను రాసుకున్నాను`` అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved