Savitri song launch
`సోలో` తర్వాత మళ్లీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించాను:
- `సావిత్రి` సాంగ్ లాంచ్ కార్యక్రమంలో నారా రోహిత్ మార్చి 4న `సావిత్రి` ఆడియో, 25న సినిమా రిలీజ్
నారా రోహిత్ హీరోగా, నందిత హీరోయిన్‌గా నటించిన సినిమా ‘సావిత్రి`. పవన్ సాదినేని దర్శకుడిగా, విజన్ ఫిలిమ్ మేకర్ బ్యానర్‌పై డా.వి.బి. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే ప్రేమికుల రోజు కానుకగా రిలీజైంది. టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్టుగా చిత్ర కథానాయకుడు రోహిత్ స్వయంగా పాడిన స్పెషల్ సాంగ్‌ని ఆవిష్కరించారు. మార్ మార్ తీన్‌మార్ .. గుండె జారి తీన్ మార్ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఆవిష్కరించారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు విలేజ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి కొర్రపాటి, రోహిత్, నందిత, రాజేంద్ర ప్రసాద్, మధు, వసంత్, శ్రావణ్, అజయ్, కృష్ణ చైతన్య తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
అనంతరం నిర్మాత డా. వి.వి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ-``విజన్ ఫిలింస్‌లో తొలి ప్రయత్నంగా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయాలనుకున్నాం. ఎలాంటి ద్వంద్వార్థాలు లేని సంభాషణలతో ఆహ్లదకరంగా ఉండే చిత్రమిది. రోహిత్ ఈ చిత్రంలో ఓ చక్కని పాట పాడారు. తను ఇంత బాగా పాడగలడని అనుకోలేదు. దర్శకుడు పవన్ పనితనం అద్భుతం. చైతన్య డైలాగ్స్ హైలైట్‌గా ఉంటాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. మార్చి 4న ఆడియో, అదే నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆడియోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో చేస్తున్నాం`` అన్నారు.
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ-``రెండేళ్లుగా దర్శకుడు నేను ఈ స్ర్కిప్టు విషయంలో కలిసి ట్రావెల్ అయ్యాం. ఆ తర్వాత నిర్మాత వచ్చి చేరారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. పవన్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. తన వర్కింగ్ స్టయిల్ బావుంది. ఆర్టిస్టులంతా చక్కగా నటించారు. సోలో తర్వాత మళ్లీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రానికి డీఓపీ వెరీ స్పెషల్. రౌడీ ఫెలో మూవీ కి కృష్ణ చైతన్య మాటలు అందించారు. వాటికి చక్కని ప్రశంసలొచ్చాయి. కృష్ణ చైతన్య మరోసారి నా సినిమాకి మాటలు అందించారు. పాటలు కూడా రాశాడు. ఈ సినిమాలో ఓ పాట పాడాల్సిన సందర్భం వచ్చింది. పాడేశాను. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా. మా సినిమాకి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి`` అన్నారు.
Nanditha RajGlam gallery from the event
దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ -``నా మొదటి సినిమా ` ప్రేమ ఇష్క్ కాదల్` తీసినప్పుడు ఓ పంపిణీదారుడు విలువైన సలహా ఇచ్చారు. యూత్ కోసం సినిమా తీస్తే ఫ్యామిలీ నుంచి ఒక్క టిక్కెట్టే తెగుతుంది. అదే ఫ్యామిలీ కోసమే సినిమా తీస్తే నాలుగు టిక్కెట్లు తెగుతాయ్ అన్నారు. నిర్మాత బావుంటేనే సినిమాలు తీస్తారు. అలా ఆలోచించి ఓ చక్కని ఫ్యామిలీ కంటెంట్‌తో ఈ సినిమా తీశాను. ప్రతి ఆర్టిస్టులో తెలుగుతనం కనిపించాలని చేసిన సినిమా ఇది. కథ పూర్తిగా వినకుండానే లైన్ నచ్చి నిర్మాత షూటింగుకి ఓకే చెప్పారు. అతడు ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు. శ్రావణ్ అద్భుతమైన సంగీతం అస్సెట్. పోస్టర్ రిలీజ్ నుంచే మా సినిమాకి బిజినెస్ మొదలైంది. అనీల్ భాను క్రియేషన్ వల్లనే ఇది సాధ్యమైంది. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి`` అన్నారు.
నటుడు మధు మాట్లాడుతూ-``నిర్మాత బడ్జెట్ విషయంలో రాజీకి రాకుండా ఖర్చు చేశారు. రోహిత్ ఈ చిత్రంలో ఓ చక్కని పాట పాడారు. ఆ పాటతోనే అందరిలోనూ హుషారు పెరిగింది. పెద్ద విజయం సాధించాలి`` అన్నారు.
మాటల రచయిత కృష్ణ చైతన్య మాట్లాడుతూ -``సాయి కొర్రపాటి చేతుల మీదుగా ఈ పాట లాంచ్ కావడం అదృష్టం. ఆయన అండదండలతో మరింత ముందుకెళ్లాలని ఆశిస్తున్నా. ఈ టీమ్ తొలి నుంచీ సుపరిచితం. రోహిత్ చక్కగా పాడాడు`` అన్నారు.
నందిత మాట్లాడుతూ-``రోహిత్ పాడటం నేను అస్సలు నమ్మలేదు. చాలా చక్కగా పాడారు తను. సావిత్రి రోల్‌ని నాకోసమే రాసినందుకు పవన్‌కి థాంక్స్. నా కెరీర్‌లో ఓ మంచి రోల్‌లో నటిస్తున్నా. ఇతర టీమ్ వర్కింగ్ స్టయిల్ బావుంది. సాయి గారికి కృతజ్ఞతలు`` అన్నారు.