pizza
Srirastu Subhamastu song launch
`శ్రీరస్తు శుభమస్తు` టైటిల్ సాంగ్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 July 2016
Hyderabad

అల్లు శిరీష్‌,  లావ‌ణ్య త్రిపాఠి జంట‌గాపరుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కత్వంలో అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా,  ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం  'శ్రీరస్తు శుభ‌మ‌స్తు'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడ‌క్ష‌న్ కార్క‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను అల్లు అరవింద్ బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

అల్లు అరవింద్ మాట్లాడుతూ ``సినిమా మ్యూజిక్ ను విన్నూతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మా గీతాఆర్ట్స్ఆలోచ‌న చేసింది. అందులో భాగంగా స‌రైనోడు సినిమా మ్యూజిక్‌ను అలాగే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాం. ఇప్పుడు అలాగే శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు విష‌యంలో కూడా పాట‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల‌నే ఆలోచ‌న‌తో ఇప్పుడు టైటిల్‌సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం. త‌ర్వాత ఒక్కో పాట‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్టు 5న విడుద‌ల చేస్తున్నాం. 31న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తాం. సినిమా గురించి నేను ఇప్పుడే మాట్లాడాల‌నుకోవ‌డం లేదు. అయితే సినిమా క‌చ్చితంగా అంద‌రినీ అల‌రిస్తుందని చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు.

ప‌రుశురాం మాట్లాడుతూ ``టైటిల్‌లో ఉన్నంత బ్లెసింగ్‌గా సినిమా ఉంటుంది. ఫ్యామిలి ఎమోష‌న్స్ కి విల‌వ‌లు త‌గ్గుతున్న ఈరోజుల్లోఫ్యామిలి అంటే ప‌క్కింటి వాడి మేట‌ర్ కాదు మ‌న‌ది మ‌న ఫ్యామిలిమ‌న అనుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా సుల‌భంగా సాల్వ్ చేయ‌చ్చు అని తెలియ‌చెప్పే చిత్ర‌మిది`` అన్నారు.

లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ ``భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం త‌ర్వాత గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నేను చేసిన చిత్ర‌మిది. అందుకు అర‌వింద్‌గారికి థాంక్స్‌. ప‌రుశురాంగారు సినిమాను చాలా నేచుర‌ల్‌గాడిఫ‌రెంట్‌గా చిత్రీక‌రించారు. శిరీష్ చాలా మంచి హార్డ్ వ‌ర్క‌ర్‌. సినిమా అంద‌రికీ న‌చ్చే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌`` అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ ``ప‌రుశురాంగారితో సినిమా గురించి చ‌ర్చించిన‌ప్పుడు మంచి క‌థ‌ఎంట‌ర్‌టైన్మెంట్ ఉన్న సినిమా చేయాల‌ని అన్నాను. అందుక‌నే ఆయ‌న క‌ష్ట‌ప‌డి క‌థ‌ఎంట‌ర్ టైన్మెంట్ ఉన్న సినిమా చేశారు. మంచి ఫ్యామిలీ డ్రామా ల‌వ్‌స్టోరీ. థ‌మ‌న్ క‌థ విని ఎప్పుడు మాస్ బీట్స్ చేశాను. ఇందులో కొత్త‌గా చేయ‌వ‌చ్చున‌ని అనడ‌మే కాకుండా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. లావ‌ణ్య చాలా నేచుర‌ల్ న‌టిఈ సినిమాలో అందంగా క‌న‌ప‌డుతుంది. కొత్త జంట త‌ర్వాత అవ‌కాశం ఇచ్చిన నాన్న‌గారికి థాంక్స్‌. ఆగ‌స్టు 5న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

            అల్లు శిరీష్లావణ్య త్రిపాఠిప్రకాష్ రాజ్సుమలత,  సుబ్బరాజుప్రగతిఆలీతనికెళ్ల భరణిరావ్ రమేష్రవి ప్రకాష్రణధీర్సుబ్బరాజుహంసానందినిసుమిత్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.య‌స్‌.య‌స్‌, యాక్షన్ - రామ్లక్ష్మణ్,

ఆర్ట్ – రామాంజనేయులు, డిఓపి - మని కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- నాగ‌రాజు, ఎడిటర్ - మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత - అల్లు అరవింద్, దర్శకుడు – పరశురామ్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved