pizza
Ugram Song Launch
‘ఉగ్రం’ నా కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ: దేవేరి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్
You are at idlebrain.com > News > Functions
Follow Us


19 March 2023
Hyderabad

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ ‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్ దేవేరి విడుదల

‘నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. అల్లరి నరేష్‌ ని ఫెరోషియస్ పోలీస్‌ గా చూపించిన ఉగ్రం టీజర్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. విన్న వెంటనే మనసుకు ఎంతగానో నచ్చేసే పాటిది. ట్యూన్, లిరిక్స్, కంపోజిషన్‌ మనసుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల మెలోడి, రొమాంటిక్ నెంబర్ ని అందించారు. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకోగా అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ మరింత మాధుర్యాని తెచ్చాయి. అల్లరి నరేష్, మిర్నాల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ పాట లీడ్ పెయిర్‌ ఒకరికొకరు ఉన్న అనురాగాన్ని ప్రజంట్ చేస్తోంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా ఆస్కార్ గెలుచుకొని దేశం పర్వపడేలా చేసిన ఆర్ఆర్ఆర్ టీం కు అభినందనలు. ప్రేక్షకులకు నచ్చితే అన్ని రకాల పాత్రలని చూస్తారు. ఉగ్రం సినిమాని చాలా ఇష్టపడి కష్టపడి చేశాం. దేవేరి పాట రాసిన శ్రీమణి గారికి పాడిన అనురాగ్ కులకర్ణి గారికి థాంక్స్. శ్రీ చరణ్ చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది గారి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. నా కెరీర్ లో ఉగ్రం హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. సమ్మర్ లో ఉగ్రం మీ ముందుకు రాబోతుంది. నాంది సినిమాని ఎంతలా ప్రోత్సహించారో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించి పెద్ద హిట్ చేయాలని, ఈ టీం జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మిర్నా మాట్లాడుతూ.. ఉగ్రంలో దేవేరి నా ఫేవరేట్ సాంగ్. ఇందులో ఇంకొన్ని అందమైన పాటలు వున్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం. దేవేరి పాటకు మీ రీల్స్ కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు

విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. శ్రీచరణ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేపధ్య సంగీతం ఇంకా అద్భుతంగా వుంటుంది. ‘ఉగ్రం’ నరేష్ గారికి మరో డిఫరెంట్ ఫిల్మ్ కాబోతుంది. మిర్నా ఈ పాట కోసం చాలా కష్టపడింది. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్’’ చెప్పారు.

శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. దేవేరి ఉగ్రం నుంచి మొదటి మెలోడి. చాలా డిఫరెంట్ మూవీ. సౌండింగ్ కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. థియేటర్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నిర్మాతలు, తూము వెంకట్, విజయ్ మాస్టర్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

సిద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

ఈ ఏడాది వేసవిలో ‘ఉగ్రం’ థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, మిర్నా

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

బ్యానర్: షైన్ స్క్రీన్స్

కథ: తూమ్ వెంకట్

డైలాగ్స్: అబ్బూరి రవి

డీవోపీ: సిద్

సంగీతం: శ్రీచరణ్ పాకాల

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved