pizza
Special Screening Of “Malupu” for Tollywood Movie Makers
వైవిధ్యాన్ని కోరుకునే ప్రేక్షకులకు విందు భోజనం ‘మలుపు’!
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 February 2016
Hyderabad

The team of “Malupu” is on cloud nine after bagging success in the Tollywood. Recently, the team celebrated the success at a gathering and now a special screening was arranged for the movie makers of Telugu film industry.

T-Town filmmakers VV Vinayak, Sekhar Kammula, A. Kodandarami Reddy, S Gopal Reddy, JK Bharavi, Dasaradh and others attended the screening. Film’s lead actor Aadhi, director Sathya Prabhas and producer Ravi Raja Pinisetty were also seen at the event.

Aadhi starrer “Malupu” is a dubbed version of Tamil action thriller “Yagavarayinum Naa Kaakka”. Directed by Aadhi’s brother Sathya Prabhas, the film stars Nikki Galrani in a romantic lead role in the movie. Ever since, the film opened in theatres, the film bagged good reviews and is riding high at the box office.

ప్రముఖ దర్శకులు రవిరాజా పినిశెట్టి నిర్మించిన ‘మలుపు’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే! ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకున్న రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. రవిరాజా గారి చిన్న కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నటించారు. ఇప్పటికే పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన నిక్కీ గల్రాని ‘మలుపు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గత యేడాది విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జాతీయ ఉత్తమ నటుడు, మిథున్ చక్రవర్తి ‘మలుపు’లో ముంబై అండర్ వరల్డ్ డాన్ మొదలియార్ పాత్రను అద్భుతంగా పోషించారు. పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరీశ్ ఉత్తమన్… మొదలియార్ తనయుడిగా నటించి ఆకట్టుకున్నారు. మరో విశేషం ఏమంటే…. తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రిచా పల్లోడ్ చాలా సంవత్సరాల తర్వాత ‘మలుపు’తో రీ ఎంట్రీ ఇచ్చింది. నాజర్, ప్రగతి, పశుపతి, నరేన్ తదితరులు తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు.

సత్యప్రభాస్ దర్శక ప్రతిభకు తార్కాణం ‘మలుపు’
డిసెంబర్ 31న జరిగిన ఓ ఊహించని సంఘటన ఆది, అతని స్నేహితుల జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసిందన్నదే ‘మలుపు’ కథ! రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా… సహత్వానికి దగ్గరగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం వైవిధ్యాన్ని కోరుకునే వారికి ఓ విందు భోజనం లాంటిది! రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను సత్యప్రభాస్ తయారు చేసుకున్నారు. అంతే సహజతతో ఈ కథను హండ్రెడ్ పర్సంట్ కన్విక్షన్ తో ఆయన తెరకెక్కించారు. అందువల్లే ఇందులో నటీనటులు కాకుండా కేవలం పాత్రలే కనిపించాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. చివరి క్షణం వరకూ అసలేం జరిగిందో ప్రేక్షకుల ఊహకు కూడా అందకుండా సత్య ప్రభాస్ కథను నడిపి తీరు ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో అన్ని వర్గాల వారూ దీనిని ఓన్ చేసుకుంటున్నారు. తొలి చిత్రంతోనే చక్కని ప్రతిభ కనబరిచిన సత్య ప్రభాస్ కు మంచి భవిష్యత్తు ఉందని, అతని నుండి మరిన్ని విజయవంతమైన చిత్రాలను ఆశిస్తున్నామని ఆడియెన్స్ చెబుతున్నారు. ప్రేక్షకదారణను దృష్టిలో పెట్టుకుని రెండోవారం నుండి మరిన్ని థియేటర్లలో ‘మలుపు’ను ప్రదర్శించబోతున్నారు.

‘మలుపు’ యూనిట్ పై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు!
సాధారణ ప్రేక్షకుడే కాదు… ‘మలుపు’ చిత్రాన్ని చూసి తెలుగు సినీ ప్రముఖులు సైతం హర్షాన్ని వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ దర్శకులు కోదండరామిరెడ్డి, వి.వి. వినాయక్, దశరథ్, శేఖర్ కమ్ముల, జె.కె. భారవి; నిర్మాతలు రాశి మూవీస్ నరసింహరావు, అడ్డాల చంటి; ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి తదితరులు ఈ చిత్రాన్ని చూసి యూనిట్ సభ్యుల్ని అభినందించారు. తొలి చిత్రంతోనే సత్య ప్రభాస్ దర్శకుడిగా చక్కని ప్రతిభ కనబరిచాడని, ఆది స్నేహం కోసం ప్రాణమిచ్చే కుర్రాడిగా ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని మెచ్చుకున్నారు. రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించిన రవిరాజా పినిశెట్టినీ వారు ప్రశంసించారు.

శాటిలైట్ హక్కులకై పోటీ!
‘మలుపు’ సినిమాలోని కొత్తదనం ప్రేక్షకులు, సినీ ప్రముఖులనే కాదు… ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లోనూ ఆసక్తిని రేకెత్తించింది. విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కుల కోసం ఆయా సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మలుపు’ మరోసారి నిరూపించిందని, ఓ నిర్మాతగానే కాకుండా సత్య ప్రభాస్, ఆది… తండ్రిగానూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నానని ఆయన చెప్పారు. తొలి చిత్రంతోనే సత్య ప్రభాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు, ప్రముఖుల ప్రశంసలూ దక్కడం పట్ల రవిరాజా హర్షం వ్యక్తం చేశారు. ‘మలుపు’ చిత్రం విడుదలైన తొలి రోజునుండే… విశేషంగా ఆదరిస్తున్న రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ఈ సందర్భంగా రవిరాజా పినిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved