
18 November 2015
Hyderabad
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ (సివిఎం) సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి జరిగిన కాంటెస్ట్‌లో విజేతను ఇటీవల డ్రా ద్వారా మహేష్ ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్‌రెడ్డి 'శ్రీమంతుడు' సైకిల్ విజేతగా నిలిచారు. విజేత జి.నాగేందర్‌రెడ్డికి సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా 'శ్రీమంతుడు' సైకిల్‌ను ప్రదానం చేశారు.


