pizza
Pichekkista success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 October 2014
Hyderabad

 

క్లీన్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అంద‌రి ప్ర‌శంశ‌లు అందుకుంటున్న పిచ్చేక్కిస్తా -- చిత్ర నిర్మాత‌లు


మిర్ర‌ర్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో 7 ఆర్స్ట్ అండ్ మాన‌స్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై కొత్త న‌టిన‌టుల‌ని ప‌రిచ‌యం చేస్తూ శ్రీకాంత్ రెడ్డి ని ద‌ర్శ‌కునిగా పరిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం పిచ్చేక్కిస్తా.. ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌య్యి మంచి ఫ్యామ‌లి ఎంట‌ర్‌టైన‌ర్ గా అందరి ప్ర‌శంశ‌లు అందుకుంటూ విజ‌యం దిశగా దూసుకుపోతుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత న‌ట‌రాజ్ కొట్టూరి మాట్లాడుతూ .." మిర్ర‌ర్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లొ అతిత‌క్కువ బ‌డ్జెట్ లో నిర్మించిన చిత్రం పిచ్చేక్కిస్తా.. ఈ చిత్రం అందరూ ఫ్యామిలి తో క‌లిసి రెండు గంట‌లు ఎంజాయ్ చెయ్యాల‌నేది మా వుద్దేశం. న‌వ్వుల‌తో పిచ్చెక్కించాల‌నేది మా టైటిల్ పరమార్ధం. దాన్ని అంద‌రూ అర్దం చేసుకోవాల‌ని కోరుతున్నాం. ఈ సినిమా ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. ఇంకా పెద్ద విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాం" అని అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా విడుద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌నుండి మంచి ఓపెనింగ్స్ అందించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి మా ధ‌న్య‌వాదాలు. కొత్త‌వారైనా అంద‌రూ బాగా న‌టించారు. వినోదంతో పాటు చ‌క్క‌ని సందేశాన్ని అందించామ‌ని అందరూ అంటున్నారు. ఫ్యామిలి అంతా క‌లిసి చూడ‌వ‌ల‌సిన చిత్రం ఈ పిచ్చక్కిస్తా.."అని అన్నారు

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved