pizza
Suriya's 24 success meet
‘24’ సక్సెస్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

11 May 2016
Hyderabad

13బిఇష్క్మనం వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్  ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. మే 6న తెలుగు, తమిళంలో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా....

కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ మాట్లాడుతూ ‘’సినిమా కథ విన్నప్పుడే అందరం ఎగ్జయిట్ అయ్యాం. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

ప్రవీణ్ పూడి మాట్లాడుతూ ‘’నేను సూర్యగారికి, ఎ.ఆర్.రెహమాన్ గారికి వీరాభిమానిని. తమిళంలో ఎడిటర్ గా నా తొలి సినిమా. మంచి సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

అజయ్ మాట్లాడుతూ ‘’నా కెరీర్ లో ఇష్క్ సినిమా చాలా కీలకమైంది. ఆ సినిమాతో నాకు పాజిటివ్ రోల్స్, డిఫరెంట్ రోల్స్ రావడం మొదలయ్యాయి. ఇష్క్, 24 సినిమాలు నా మనసుకు దగ్గరైన సినిమాలుగా భావిస్తున్నాను. సూర్యగారితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకున్నందుకు హ్యపీగా ఉందని నాతో చాలాసార్లు చెప్పారు. టెక్నికల్ గానే కాదు, లవ్, ఎమోషన్స్ సహా అన్నీ ఉన్న సినిమా. మన ఉహకు అతీతంగా ఉండటంతో అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు.

దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ‘’ఇష్క్, మనం, 24 సినిమాలతో తెలుగు హ్యాట్రిక్ హిట్ కొట్టడం హ్యపీగా ఉంది. 24 సినిమాలో సూర్యగారికి నటనకు హ్యట్సాఫ్. ఈ చిత్రంతో హీరోగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. అజయ్ బెస్ట్ యాక్టర్. ఏ క్యారెక్టర్ ను అయినా చేయగల నటుడు. ప్రవీణ్ పూడి బెస్ట్ ఎడిటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం అందరూ ఇష్టపడి కష్టపడ్డారు. రెహమాన్ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. అలాగే వి.ఎఫ్.ఎక్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. సమంత, నిత్యామీనన్ చాలా మంచి నటీమణులు. ఫ్యూచర్ లో వీరందరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved