pizza
Nithiin - Trivikram's A.. Aa Success Meet
‘అఆ’ సక్సెస్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

04 June 2016
Hyderabad

శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అఆ’. ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా....

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్టయ్యింది. 9 నెలలు క్రితం ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ గురించి యద్దనపూడి సులోచనారాణిగారితో మాట్లాడాను. ఆమె సలహాలను కొన్నింటిని తీసుకోవడం జరిగింది. ఆమె పేరును థాంక్స్ లిస్టులో వేసినా డిజిటల్ లో పోవడంతో మళ్లీ టెక్నిషియన్స్ లిస్టులో చేర్చాం అందుకు 48 గంటల సమయం పట్టింది. ఈ సినిమా చేయడానికి కారణం సమంత. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రీకరణ సమయంలో సమంత ఓసారి మీరు మెదడుతోనే ఆలోచిస్తున్నారు. హృదయంతో ఎందుకు ఆలోచించరు అని అనింది. ఆ ప్రభావం నాపై చూపిందనుకుంటాను. అలాగే నితిన్ తో సన్నాఫ్ సత్యమూర్తి కంటే ముందుగానే సినిమా చేయాల్సింది కానీ కథ చెప్పాలనుకున్నప్పుడు నితిన్ స్పెయిన్ లో ఉన్నాడు. ఈలోపు సన్నాఫ్ సత్యమూర్తి డైలాగ్స్ రెడీ అవడంతో ఆ సినిమాతో బిజీ అయిపోయాను. దాంతో నా మనసులో నితిన్ తో చేయాల్సిన సినిమా గురించి ఆలోచన ఉండిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి కాగానే ఓ రోజు పవన్ కల్యాణ్ గారు నెక్ట్స్ మూవీ ఏం చేస్తారని అడిగారు. అలాగే ఆయనే మీరు నితిన్ ఓ సినిమా చేస్తానని అనుకున్నారు అని కూడా ఆయన గుర్తు చేయడంతో నితిన్ తో ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయాను. అలా గుర్తు చేసినందుకు కల్యాణ్ గారికి థాంక్స్. నితిన్ కు కథ చెప్పడంతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. అలాగే సీనియర్ నటులైన నరేష్, రావురమేష్ లు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, హరితేజ, ప్రవీణ్ ల కామెడి సినిమాను మరో లెవల్ లో కూర్చొని పెట్టింది. సమంత థెరి, 24, బ్రహ్మోత్సవం వంటి పెద్ద సినిమాలు చేసినా ఈ సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేసింది. నేను 8 సినిమాలు చేశాను. అయితే తనవంటి హీరోయిన్ ను చూడలేదు. అలాగే నితిన్, సమంత ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్ చేశారు. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణియన్, మిక్కి ఇలా అందరూ బలమైన వ్యక్తితం ఉన్న వ్యక్తులు వల్లే ఈ సినిమా బాగా రూపొందింది. అలాగే కథ చెప్పిన వెంటనే సపోర్ట్ చేసిన నిర్మాత రాధాకృష్ణగారు, ఏం చెప్పినా చేయడానికి ముందుకు వచ్చిన వంశీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పి.డి.ప్రసాద్ గారికి థాంక్స్’’ అన్నారు.

Samantha Glam gallery from the event

నితిన్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా సక్సెస్ ప్రధానంగా నాలుగు కారణాలు అయితే అందులో మూడు కారణాలు త్రివిక్రమ్ గారైతే నాలుగో కారణం నిర్మాత చినబాబుగారే. ఎందుకంటే నా బడ్జెట్ కంటే ఎక్కువ అయినా ఎక్కడా వెనుకాడకుండా నమ్మకంతో సినిమా చేసినందుకు చినబాబుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బ్యానర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. త్రివిక్రమ్ గారిని అందరూ క్లాస్ డైరెక్టర్ అనుకుంటారు కానీ, ఆయన యూనివర్సల్ డైరెక్టర్. అందుకే అన్నీ యాంగిల్స్ లో సినిమా సక్సెస్ ఫుల్ గా రూపొందింది. ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ను ఇచ్చిన క్రెడిట్ త్రివిక్రమ్ గారిదే. ఏ విధంగా చూసుకున్నా అఆ సినిమా క్రెడిట్ అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికే చెందుతుంది’’ అన్నారు.

సమంత మాట్లాడుతూ ‘’చాలా రోజుల తర్వాత ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ సాధించిన చిత్రమిది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ గారు బాధపడి నెక్ట్స్ మూవీకి నేనెంటో చూపిస్తానని అన్నారు. అన్నట్లుగానే సక్సెస్ ను సాధించి చూపారు. త్రివిక్రమ్ గారు, రవికిరణ్, చినబాబుగారు సినిమా ఆలోచన పుట్టినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నారు. వీరి కష్టమే ఎక్స్ ట్రా మ్యాజిక్ జరిగి సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

నరేష్ మాట్లాడుతూ ‘’పది సంవత్సరాలకు ఒకటో, రెండో సినిమాలు ఇలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాయ. కథ విన్నప్పుడే పెద్ద సక్సెస్ సాధిస్తుందని చెప్పాను. అన్నీ ఎలిమెంట్స్ కలగలిపిన ఎంటర్ టైన్మెంట్ బఫెట్ ఈ చిత్రం. నితిన్, సమంత వాళ్ల కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే ఎంటైర్ టీంకు కంగ్రాట్స్, ఆడియెన్స్ కు థాంక్స్’’ అన్నారు.

కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో నాకు పాట రాసే అవకాశాన్ని కలిగించిన దర్శక నిర్మాతలకు థాంక్స్. టీంకు కంగ్రాట్స్’’ అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘’సినిమాలో నాలుగు పాటలు రాశాను. మిక్కిజె.మేయర్ గారు మంచి మ్యూజిక్ అందించారు. త్రివిక్రమ్ గారు సినిమాను పట్టుదలగా చేశారు. ఇలాంటి మంచి సినిమాను రూపొందించిన త్రివిక్రమ్ గారికి ,చినబాబుగారికి థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, హరితేజ, ఆర్ట్ డైరెక్టర్ ఎ.యస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved