pizza
Babu Bangaram success meet
`బాబు బంగారం` సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 August 2016
Hyderaba
d

విక్టరీ వెంకటేష్‌, నయనతార జంటగా ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్‌.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. ఈ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో....

పోసాని కృష్ణ‌ముర‌ళి మాట్లాడుతూ ``వెంక‌టేశ్‌గారి సినిమాల్లో ఇంత‌కు ముందు రెండు సార్లు న‌టించాను. ఇది నేను న‌టించిన మూడో సినిమా. ఆయ‌న‌తో హ్యాట్రిక్ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది`` అని అన్నారు.

ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌మ‌ణ మాట్లాడుతూ ``నాగ‌వంశీకి, పీడీవీ ప్ర‌సాద్‌కీ ధ‌న్య‌వాదాలు. యానిమేష‌న్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఉంటుందా? అని అనుకుంటున్న రోజుల్లో మేం వెంక‌టేశ్‌గారి సినిమా బొబ్బిలిరాజాను చూశాం. అప్పుడు కాస్త కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో నేను వెంక‌టేశ్‌గారి సినిమాకు ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

ఎడిట‌ర్ ఉద్ధ‌వ్ మాట్లాడుతూ ``ఇంత మంది బంగారాలు క‌లిసి చేసిన సినిమా పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. నేను చేస్తున్న పెద్ద సినిమా ఇది`` అని అన్నారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ ``వెంక‌టేశ్‌గారికి నేను చేసిన దృశ్యం పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. మాస్‌, ఫ్యాన్స్, లేడీస్ అంద‌రూ క‌లిసి చూసి ఎంజాయ్ చేస్తున్న సినిమా ఇది`` అని చెప్పారు.

రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ ``మా నిర్మాత‌లు బంగారంలాంటివారు. వాళ్ల‌కు ప్రేక్ష‌కులు బంగారంలాంటివారు. వెంక‌టేశ్ బాబు న‌వ్వితే అమ్మాయిల‌కి, కొడితే అబ్బాయిల‌కి న‌చ్చుతాడు. ఆయ‌న‌లాగా అమాయ‌కంగా ఫేస్‌పెట్టి మెప్పించ‌గ‌లిగే హీరో ఇంకెవ‌రూ లేరు`` అని అన్నారు.

పృథ్వి మాట్లాడుతూ ``నేను ఏ సినిమా చేసినా చూసిన సురేశ్‌బాబుగారు బావుంద‌మ్మా అని వెళ్లేవారు. కానీ ఈ సినిమా చూసి బాగా చేశావ్‌రా. జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకో అని అన‌డం మ‌ర్చిపోలేను` అని చెప్పారు.

గిరిధ‌ర్ మాట్లాడుతూ ``క్రిటిక్స్ త‌ప్పు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది`` అని చెప్పారు.

చ‌మ్మ‌క్ చంద్ర మాట్లాడుతూ ``నేను చీర‌క‌ట్టుకుని వెంక‌టేశ్‌గారి సినిమాలో ఆయ‌న ముందు డ్యాన్సులు చేస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేదు`` అని తెలిపారు.

ర‌జిత మాట్లాడుతూ ``మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని ఉంద‌ని ఫోన్ చేసి అడిగితే ఈ పాత్ర ఇచ్చారు. థియేట‌ర్లో డార్లింగ్ స్వామిగారు రాసిన ప్ర‌తి డైలాగుకు చ‌ప్ప‌ట్లు ప‌డుతున్నాయి`` అని అన్నారు.

అర‌వింద్ మాట్లాడుతూ ``వెంక‌టేశ్‌గారి సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. గౌర‌వంగా భావిస్తున్నా`` అని చెప్పారు.

ఫిష్ వెంక‌ట్ మాట్లాడుతూ ``క‌లియుగ పాండ‌వులు నుంచి నేను వెంక‌టేశ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న‌తో ఇలాంటి సినిమాలు చాలా చేయాల‌ని ఉంది`` అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ ``తొలి రోజు ఎక్స్ పెక్టేష‌న్స్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల కాస్త అటూ ఇటూ అనిపించిందేమో. నానుంచి వ‌చ్చిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని అల‌వాటు చేసుకోవ‌డానికి ఒక‌టీ, రెండు రోజులు ప‌ట్టాయి. ఫ్యాన్స్, లేడీస్‌, మాస్‌కీ సినిమా రీచ్ అయింది. డిస్ట్రిబ్యూష‌న్ చేసిన వాళ్లంద‌రూ ఆనందంగా ఉన్నారు. డ‌బ్బులొస్తేనే స‌క్సెస్‌ఫుల్ సినిమా అయిన‌ట్టు. ఈ సినిమాకు డ‌బ్బులు వ‌చ్చాయి. రామ్‌ల‌క్ష్మ‌ణ్ చేసిన లాస్ట్ ఫైట్ కు చాలా మంచి పేరు వ‌స్తోంది. మా టీమ్‌లోని ప్ర‌తి ఒక్క‌రి క‌ష్ట‌మూ థియేట‌ర్లో స్క్రీన్ మీద క‌నిపిస్తోంది. ఫ్యామిలీ లేడీస్ అంద‌రూ ఫోన్లు చేసి బావుంద‌ని అంటున్నారు. మ‌ళ్లీ నాకు ఎన‌ర్జీ వ‌చ్చింది`` అని తెలిపారు.

వెంక‌టేశ్ మాట్లాడుతూ ``సినిమాను బాగా రిజీవ్ చేసుకున్నారు. బాబు బంగారం సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌, డ్ర‌స్సులు ఎలా ఉండాలో ముందు నుంచీ మారుతి చెబుతున్నాడు. అలాగే తీశాడు. నాతో చేసిన మిగిలిన న‌టీన‌టుల‌కు థాంక్స్. నేను ఏం చేసినా పాజిటివ్ ఎన‌ర్జీతో అభినందించారు``అని చెప్పారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved