pizza
Bhaje Vaayu Vegam Success Meet
"Bhaje Vaayu Vegam" is Getting Super Hit Talk from All Over - Movie Team at Success Meet
"భజే వాయు వేగం" సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 May 2024
Hyderabad

Presented by the prestigious production company UV Creations, the movie "Bhaje Vaayu Vegam," starring Kartikeya Gummakonda, is produced under the banner of UV Concepts. Iswarya Menon stars as the heroine, while Rahul Tyson of "Happy Days" fame plays a pivotal role. Director Prashanth Reddy has crafted this film as an emotional action thriller. Ajay Kumar Raju Pnacted as the co-producer. The movie "Bhaje Vaayu Vegam," which had a grand worldwide theatrical release today, has received super hit talk from all over. In this context, the film team organized a success meet at the UV office in Hyderabad. On this occasion:

Hero Kartikeya said, "The movie 'Bhaje Vaayu Vegam' is getting positive responses from everyone. No one mentioned anything negative about the film. Usually, a particular element in a film is praised, but those who have seen 'Bhaje Vaayu Vegam' liked the entire movie. I am happy that such an emotional movie is receiving appreciation from the audience. The emotion in this movie is more impactful than in 'RX 100.' We believed in the story and made the kind of movie we wanted to make. We expected this kind of success. I will plan my next movies, keeping in mind the success of 'Bhaje Vaayu Vegam.' I will work on making my future films to maintain the love and support the audience has given me with this film and the trust they have placed in my work."

Director Prashanth Reddy said, "Yesterday, we arranged a show to our close circle and family members. Their positive response eased some of the pressure. That's why I came to watch the movie at Sandhya Theatre. After seeing the audience's response in the theater, we felt happy. It is said that the emotions are well worked out in the movie and the second half is gripping. We respect the audience and make films with emotions that appeal to them. The audience is giving us double the respect and love. Thanks to audience. The mouth talk is good, so don't wait for OTT; watch it in the theatre."

Actor Rahul Tyson said, "He saw the movie 'Bhaje Vaayu Vegam' for the first time in the theater today. We gor overwhelming response from the audience. I got a hit movie after 15 years. While making this film, I worked with Kartikeya's trust. We are confident that the emotions in this film will reach everyone. Thanks to the UV Banner. Director Prashanth made a comeback with a hit movie. When I was making this movie with Kartikeya, I didn't know it will ne this big, but if I look at the screen today, his performance as an actor is at the next level. I would like to see Kartikeya reach more heights as an actor. I want to thank each and every technician who worked on 'Bhaje Vaayu Vegam.'"

Kapil Kumar, who gave the background score, said, "We had already predicted that 'Bhaje Vaayu Vegam' would be a hit. The producers gave me a chance within 30 minutes of my approach for this film. Kartikeya, Rahul, Ravi Shankar, and Tanikella Bharani have all done a great job in this movie, and I got the chance to enhance it by BGM. Thanks to Prashanth and UV producers for believing in me and giving me this opportunity."

"భజే వాయు వేగం" సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "భజే వాయు వేగం" సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లోని యూవీ ఆఫీస్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరో కార్తికేయ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పడం లేదు. సాధారణంగా సినిమాలో ఫలానా ఎలిమెంట్ బాగుందని చెబుతారు. కానీ "భజే వాయు వేగం" సినిమా చూసినవాళ్లు కంప్లీట్ మూవీ నచ్చిందని అంటున్నారు. ఈ రేంజ్ సినిమా ఇంత ఎమోషనల్ గా తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందడం హ్యపీగా ఉంది. ఆర్ఎక్స్ 100 కంటే ఎక్కువ ఎమోషన్ ఈ సినిమాలో వర్కవుట్ అయ్యింది. మేము కథను నమ్మి ఎలాంటి మూవీ చేయాలనుకున్నామో, అలాంటి మూవీ చేశాం. సక్సెస్ కూడా మేము ఆశించినట్లే దక్కింది. "భజే వాయు వేగం" సినిమా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని నా నెక్ట్ మూవీస్ ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమాతో ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణను, నా సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నా తదుపరి సినిమాలు చేస్తూ పనిచేస్తాను. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ - నిన్న మా క్లోజ్ సర్కిల్, ఫ్యామిలీ మెంబర్స్ కు షో వేశాం. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాలో కొంత ఒత్తిడి తగ్గింది. ఇందాకే సంధ్య థియేటర్ లో మూవీ చూసి వచ్చాను. థియేటర్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక మాకెంతో హ్యాపీ ఫీలింగ్ కలిగింది. సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని, సెకండాఫ్ గ్రిప్పింగ్ గా ఉందని చెబుతున్నారు. మేము ప్రేక్షకుల్ని గౌరవించి, వాళ్లకు నచ్చే ఎమోషన్స్ తో సినిమా రూపొందించాం. ప్రేక్షకులు మాకు తిరిగి రెట్టింపు గౌరవాన్ని ప్రేమను అందిస్తున్నారు. థ్యాంక్యూ. టాక్ బాగుందని వచ్చింది కాబట్టి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి థియేటర్ లో చూడండి. అన్నారు.

యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాను ఈ రోజు మొదటిసారి థియేటర్ లో చూశా. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు 15 ఏళ్ల తర్వాత ఒక హిట్ సినిమా దక్కింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను కార్తికేయ నమ్మకంతో వర్క్ చేశాం. ఇందులోని ఎమోషన్స్ అందరికీ రీచ్ అవుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. యూవీ బ్యానర్ కు థ్యాంక్స్. డైరెక్టర్ ప్రశాంత్ నేనొక హిట్ మూవీతో తిరిగొచ్చేలా చేశాడు. కార్తికేయతో ఈ మూవీ చేస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఈ రోజు స్క్రీన్ మీద చూస్తుంటే నటుడిగా అతని పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా నుంచి కార్తికేయ నటుడిగా మరింత హైట్స్ చూడాలని కోరుకుంటున్నా. "భజే వాయు వేగం" సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన కపిల్ కుమార్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా హిట్ అవుతుందని మేము ముందే ఊహించాం. ఈ సినిమా కోసం అప్రోచ్ అయిన 30 నిమిషాలకే నాకు అవకాశం ఇస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ చెప్పారు. ఈ సినిమాలో కార్తికేయ, రాహుల్, రవిశంకర్, తనికెళ్ల భరణి గారు చేసిన మంచి పర్ ఫార్మెన్స్ వల్లే బీజీఎం బాగా కుదిరింది. నా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చిన ప్రశాంత్, యూవీ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved