pizza
Cine Mahal success meet
`సినీమ‌హల్‌` స‌క్సెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 April 2017
Hyderaba
d

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెర‌కెక్కిన‌ చిత్రం `సినీ మహల్`. `రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వ‌హించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. అలీరాజా, సోహెల్, తేజస్విని నాయ‌కానాయిక‌లు. ఈ సినిమా మార్చి 31న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళవారం ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో..

ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌వ‌ర్మ మాట్లాడుతూ - ``మ‌యూరి డిస్ట్రిబ్యూట‌ర్స్‌వారు మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌డం మాకు చాలా ప్ల‌స్ అయ్యింది. డిఫ‌రెంట్ సినిమాల‌ను ఆద‌రిస్తార‌ని ప్రేక్ష‌కులు మ‌రోసారి ప్రూవ్ చేశారు. ఇంత‌టి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కులకు థాంక్స్‌`` అన్నారు.

అలీరాజా మాట్లాడుతూ - ``కొత్త జోన‌ర్‌లో రూపొందిన చిత్రం. నా రోల్‌కు చాలా మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. ఇలాంటి ఓ విజ‌య‌వంత‌మైన చిత్రంలో నాకు న‌టించే అవ‌కాశాన్ని ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

సోహెల్ మాట్లాడుతూ - ``విలేజ్‌, అర్బ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినీ మ‌హ‌ల్ చిత్రాన్ని ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కులకు థాంక్స్‌. చాలా మంది ఫోన్ చేసి సినిమా బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన అందరికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత పార్థు మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. సినిమా విడుద‌లైన రోజు నుండే మంచి ఆద‌ర‌ణ‌తో ముందుకు సాగుతుంది. శేఖ‌ర్‌చంద్ర మ్యూజిక్‌, స‌లోని స్పెష‌ల్ సాంగ్‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. మ‌యూరి సంస్థ ద్వారా సినిమా రిలీజ్ కావ‌డం మాకు ప్ల‌స్ అయ్యింది. సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలో అడుగుపెట్టింది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved