pizza
Eedo Rakam Aado Rakam success meet
‘ఈడోరకం ఆడోరకం’ సక్సెస్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

23 April 2016
Hyderabad

మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్ హీరో హీరోయిన్స్ ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు, అనీల్ సుంకర, జి.నాగేశ్వరరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, మంచు మనోజ్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, రాజ్ తరుణ్, హేబా పటేల్, గీతా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘’ఈ సినిమాను చూడగానే చాలా హెల్దీ పిక్చర్స్, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. తప్పకుండా ఘనవిజయాన్ని సాధిస్తుందని దర్శక నిర్మాతలకు, మోహన్ బాబు, విష్ణు, రాజేంద్రప్రసాద్ లకు ఫోన్ చేసి అభినందించాను. బడ్జెట్ సినిమాలు సక్సెస్ అయితే నేను ఆనందిస్తాను. ఇలాంటి సినిమా కొనాళ్ల క్రితం చనిపోయింది. రెండేళ్ల నుండి బడ్జెట్ సినిమాల లైఫ్ పెరుగుతుంది. మళ్లీ ఈ విజయంతో దాని ఆయుష్షు ఇంకా పెరిగింది. సినిమాలు ఆడటం, డబ్బు రావడం వేరు. మంచి సినిమా అని డబ్బులు వస్తేనే రియల్ హిట్. అలాంటి విజయం ఈ సినిమాకు వచ్చింది. అందరూ సమిష్టిగా ఉండాలనే వ్యవస్థ ఇది. ఈ సినిమా ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం. పద్మ చనిపోయిన తర్వాత రెండు గంటలు పాటు నవ్వుతూ చూసిన చిత్రమిది. డైమండ్ రత్నం ప్రతి డైలాగ్ ను చక్కగా రాశారు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ ల కోసమే నాగేశ్వరరెడ్డి ఈ స్క్రిప్ట్ ను పక్కాగా తయారుచేశాడు. నాగేశ్వరరెడ్డికి స్క్రిప్ట్ పై, మ్యూజిక్ పై మంచి పట్టు ఉంది. పాటలన్నీ హిట్ సాధించాయి. సాయికార్తీక్ చాలా కష్టపడ్డాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది. ప్రతి సీన్ ను క్లైమాక్స్ ఉత్కంఠతో ఉంది. తను హీరోల కోసం కాకుండా, కథల కోసమే సినిమా తీయాలని చెబుతున్నాను. విష్ణు సక్సెస్ మోహన్ బాబుకు ఎంత ఆనందమో, నాకు అంతే ఆనందం. తను చక్కగా చేశాడు. అన్నీ పాళ్లు కుదిరిన సినిమా. విష్ణు, రాజ్ తరుణ్ టీం వర్క్ కలిసి వర్క్ చేశారు. రెండు, మూడు సినిమాలు హిట్ కాగానే రెట్లు పెంచేసి అందుబాటులో లేకుండా ఉండవద్దని రాజతరుణ్ కు చెబుతున్నాను. యంగ్ హీరోస్ కు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేసే స్టామినా ఉంది. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ లు ఒక సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేసేవారు. అవసరమైతే ఇప్పటి హీరోలకు సినిమాలకు సంబంధించిన చిన్న తరగతి కూడా చెబుతాను. సోనారిక, హేబా పటేల్ లు చక్కగా నటించారు. రాజేంద్రప్రసాద్ చాలా మంచి టర్న్ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాజేంద్రప్రసాద్ లేకుంటే సినిమాలు లేవేమో అనేలా సినిమాలు కథలు తయారవుతున్నాయి. అల్లుడు మామూలోడు కాదు, అవకాశం వస్తే దున్నేస్తాడు. ఇక పోసాని అద్భుతంగా నటించాడు. రవిబాబు ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్ చేశాడు. అద్భుతమైన కామెడి పండించాడు. అనీల్ సుంకర నాకు చాలా ఇష్టమైన నిర్మాత. ప్లాన్డ్ గా ఉంటాడు. ఇలాంటి నిర్మాతలు పది మంది ఉంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇలాంటి సినిమాలు చేయాలని అనీల్ సుంకరను కోరుతున్నాను’’ అన్నారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ‘’విష్ణు తన క్రమశిక్షణతో ఢీ, దేనికైనా రెఢీ సినిమాలను మించి ఈడోరకం ఆడోరకం సినిమా పెద్ద హిట్టయ్యింది. ఈ సక్సెస్ లో మొదటి క్రెడిట్ నాగేశ్వరెడ్డికే చెందుతుంది. మనోజ్ తో బిందాస్ తో నిర్మాతగా మారిన అనీల్ సుంకర ఇప్పుడు విష్ణుతో మరో సక్సెస్ సాధించాడు. పక్కా ప్లాన్ తో సినిమాలు చేసే నిర్మాత. ఇప్పుడు ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబం అవసరమని చెప్పే సినిమా ఇది. రాజ్ తరుణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. గుండమ్మకథ రైట్స్ ఎవరి దగ్గరుందో తెలియదు కానీ ఎవరి దగ్గర లేకుంటే, ఎవరైనా ఇస్తానంటే నేను కొని విష్ణు, రాజ్ తరుణ్ తో రీమేక్ చేస్తాను. హీరోయిన్స్ చక్కగా యాక్ట్ చేశారు. పోసాని, రవిబాబు అద్భుతమైన కామెడిని పండించాడు. యూనిట్ అందరికీ కంగ్రాట్స్’’ అన్నారు.

Hebah Patel Glam gallery from the event

నటకిరిటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’నాలాంటి నటుడికి పాతరోజులను గుర్తు చేస్తూ సూపర్ హిట్ అయిన సినిమా ఇది. మంచి టీంతో వర్క్ చేశానని, ఆనంద పడుతున్నాను. మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఎంతో అభిమానంతో పనిచేశారు. సీనియర్ నటుడైన నేను వారితో నటించడానికి కంఫర్ట్ జోన్ కల్పించారు. సాయికార్తీక్ బిగ్ ఎసెట్ అయ్యింది. నాగేశ్వరరెడ్డికి, అనీల్ సుంకర ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. రామానాయుడు తర్వాత అనీల్ సుంకర సినిమాలో ప్రతి డిపార్ట్ మెంట్ లో ఇన్ వాల్వ్ అవుతూ మంచి అవుట్ రావడానికి తన వంతు సపోర్ట్ ను అందించాడు. మల్టీస్టారర్ చిత్రాలు రావాలని ఆవపడే నటుల్లో నేను కూడా ఒకడిని. విష్ణు, రాజ్ తరుణ్ లు స్పోర్టివ్ గా నటించారు. వీరిని చూసైనా మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘’సినిమా చూసిన వారందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమాను మెయిన్ పాత్రతో సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపారు. అనీల్ సుంకరగారు ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.

అనీల్ సుంకర మాట్లాడుతూ ‘’నాగేశ్వరరెడ్డి సినిమా హిట్ అవుతుందని ముందు నుండి చెప్పేవారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. విష్ణు రైట్స్ కొని నన్ను సినిమా చేయమన్నాడు. విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబాపటేల్, రాజేంద్రప్రసాద్, పోసాని, రఘుబాబు అందరూ పోటీపడి నటించారు’’ అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ ‘’దేనికైనా రెఢీ వంటి హిట్ సినిమాను నాకు అందించిన నాగేశ్వరరెడ్డిగారు ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందించారు. అనీల్ సుంకరగారి బ్యానర్ లో చేస్తుంటే మా బ్యానర్ లో చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. రాజ్ తరుణ్ అద్భుతంగా నటించాడు. సక్సెస్ లో భాగమైన అందరికీ థాంక్స్’’ అన్నారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి వంటి సీనియర్ నటుడితో వర్క్ చేయడం ఎంతో గొప్ప విషయం. ఎంతో కష్టపడితే కానీ ఆయన ఒక పర్సెంట్ చేయగలిగాను. చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు. విష్ణు అన్నయ్యతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్ బావుందని అన్నారు. ఈ హిట్ విష్ణుగారిది. ఈ హిట్ సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు థాంక్స్. నాగేశ్వరరెడ్డిగారు ఎంతో కూల్ గా హ్యండిల్ చేయడంతో సినిమా సక్సెస్ మూవీ చేయగలిగారు. అనీల్ సుంకర గారు ఫ్యాషన్ ఉన్న నిర్మాత. మళ్లీ ఈ టీంతో పనిచేయాలనుకుంటున్నాను. సినిమాను హిట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ ‘’ఈడోరకం ఆడోరకం సినిమా చేసిన అనీల్ అన్నయ్య నాతోనే ఈ బ్యానర్ ను స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు, ఇప్పుడు అన్నయ్యతో హిట్ మూవీ చేశారు. అలాగే నాగేశ్వరరెడ్డిగారికి థాంక్స్. అన్నయ్య, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్ కు సహా యూనిట్ కు కంగ్రాట్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు యూనిట్ ను అభినందించారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved