వసంత శ్రీనివాస్ సమర్పణలో రూపొందిన సినిమా గరం. శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై తెరకెక్కింది. పి.సురేఖ నిర్మాత. ఆది, ఆదా జంటగా నటించారు. ఈ సినిమాకు మదన్ దర్శకుడు. ఇటీవల సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
సాయికుమార్ మాట్లాడుతూ ``ఈ రోజు మార్నింగ్ షోకి కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సినిమా ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే చాలు. అగస్త్య, సురేందరెడ్డిగారి పనితీరు గురించి అందరూ ప్రత్యేకంగా చెబుతున్నారు. ఆది ఈసినిమాతోమాస్‌లోకి వెళ్ళాడు`` అని అన్నారు.
నరేష్ మాట్లాడుతూ ``గుండె మీద చెయ్యి వేసుకుని చెబుతున్నా ఈ సినిమా హిట్ అయిందని. విజయవాడ నుంచి కూడా నాకు ఈ సినిమా బాగా హిట్ అయిందని ఫోన్లు వస్తున్నాయి. మదన్ ఇంటలెక్చువల్. సినిమా సెకండాఫ్ చాలా బాగా ఉంది. ఆది ఈ సినిమాతో మాస్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు`` అని అన్నారు.
మదన్ మాట్లాడుతూ ``తొలి షో చూసే ప్రేక్షకుడు దేవుడు కిందే లెక్క. ఎందుకంటే ప్రేక్షకుల మౌత్ టాక్ వల్లే సినిమా భారీగా హిట్ అయిన సందర్భాలుంటాయి. ఆ నలుగురు సినిమాకు కూడా తొలి రెండు వారాలు ఫ్లాప్ టాకే ఉంది. అయితే ఆ తర్వాతే హౌస్ ఫుల్స్ కావడం మొదలైంది. తాజాగా ఈ సినిమాకు కూడా మౌత్‌టాక్ మొదలైంది. సినిమా చూసిన వారందరూ బావుందని మెచ్చుకుని ఫోన్లు చేస్తున్నారు. నిన్నటి నుంచి థియేటర్ కి ఫ్యామిలీలు రావడం మొదలుపెట్టాయి. ఆదికి మాస్ ఇమేజ్ ఈ సినిమాతో వచ్చిందనే అనుకుంటున్నాను. ఆది ఇప్పుడు మాస్ హీరో అయ్యాడు. ఆ నలుగురు సినిమాలో రఘురామ్ పాత్ర గుర్తుండిపోయినట్టే ఈ సినిమాలో వరాల బాబు పాత్ర తప్పకుండా గుర్తుంటుంది. తనికెళ్ళభరణిగారు. నరేష్‌గారు అందరూ బాగా చేశారు. ఈ సినిమాలో రెండో పాట రబ్బ రబ్బ అని వస్తుంది. దాన్ని పులగం చిన్నారాయణ రాశారు. ఆ పాటకు ముందు హీరోను చూసి ఆదాశర్మ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చాలు ఆ అమ్మాయి నటన గురించి చెప్పడానికి `` అని అన్నారు.
ఆదాశర్మ మాట్లాడుతూ ``నేను గరం అని సినిమా చేస్తున్నానని మా నాన్నకు చెప్పగానే అందులో నువ్వు ఎలాంటి డ్రస్సులు వేసుకుంటావని మా నాన్న అడిగారు. బుర్ఖా అని చెప్పాను. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఉంటే బావుండేది. ఈ పోస్టర్ చూసి ఆనందించేవారు`` అని చెప్పారు.
Adah Sharma Glam gallery from the event
అగస్త్య మాట్లాడుతూ ``ఈ సినిమాను ఒప్పకున్నప్పుడు నేను మదన్‌కి ఓ మాట ఇచ్చాను. తప్పకుండా ఈ సినిమాకు ఆది రేంజ్ మ్యూజిక్ చేస్తానని చెప్పాను. ప్రతి పాటకూ చాలా మంచి స్పందన వచ్చింది. భాస్కరభట్ల, చైతన్యప్రసాద్, శ్రీమణి, పులగం చిన్నారాయణ మంచి సాహిత్యాన్నిచ్చారు. నా మ్యూజిషియన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ బాగా రావడానికి కారణం స్క్రీన్ ప్లే. నటీనటులు చాలా బాగా చేశారు. వాళ్ళ మూడ్‌కి అనుగుణంగా స్క్రీన్ ప్లే చేశాను. ప్రతి ఒక్కరూ పాటలు బావున్నాయని, స్క్రీన్ ప్లే బావుందని అంటున్నారు`` అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ ``ఈ కేరక్టర్‌కి చాలా మంచి అప్లాజ్ వస్తోంది. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మాస్‌కు సినిమా బాగా నచ్చుతోంది. మాస్‌లోకి వెళ్లే అదృష్టం ఎంత మందికి దొరుకుతుంది? నాకు ఆ అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది`` అని అన్నారు.
కార్యక్రమంలో కెమెరామేన్ సురేందర్‌రెడ్డి, నటుడు చైతన్యకృష్ణ, గీత రచయిత పులగం చిన్నారాయణ కూడా పాల్గొన్నారు.