pizza
Gam Gam Ganesha Success Meet
"Gam Gam Ganesha" is a Perfect Family Entertainer - Movie Team at Success Meet
"గం..గం..గణేశా" పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 May 2024
Hyderabad

Anand Deverakonda's latest movie is "Gam Gam Ganesha". Pragathi Srivastava and Nayan Sarika appear as heroines opposite Anand. The film is produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty makes his directorial debut with this film. The movie "Gam Gam Ganesha", which hit theaters today, is getting a super hit response from all areas. In this context, the movie team organized a success meet. In this program,

Co-producer Anurag Parvataneni said, "We watched our movie 'Gam Gam Ganesha' sitting in the middle of the audience. We are getting good responses from audiences. People are laughing and enjoying to the comedy scenes. Media friends came with their families and watched the movie. Our director Uday has made a film that entertains the audience. The audiences are connecting to all the major characters. Apart from our movie, two other movies that have been released are also getting positive talk. All our family friends are going to watch 'Gam Gam Ganesha' once again."

Director Uday Shetty said, "Claps and whistles are being heard in the theaters for the 'Gam Gam Ganesha'. I am happy to see the reaction of the audience. It is a perfect family entertainer. The interval twist, check post scene, and twists revealed in the climax of the movie are getting good responses. The character of Organ David, played by Vennela Kishore, is also receiving a hilarious response. Thanks to the audience for making our movie 'Gam Gam Ganesha' so successful."

Producer Vamsi Karumanchi said, "'Gam Gam Ganesha' is getting a good response as a family entertainer. Reviews are also very positive. Vennela Kishore's Organ David, Shankar's character and Emmanuel, have reached the audience well. Reviews are stating that this is a new kind of movie for Anand too. Our music director Chaitan Bhardwaj has given good BGM. We will also do the next movie with him."

Actor Krishna Chaitanya said, "Our Uday gave a hit with his first movie with 'Gam Gam Ganesha'. Happy to share the screen with Anand in this movie. His performance was amazing. Thanks to the audience for making our film a success."

Jabardasth Emmanuel said, "When we started the movie, Anand and I thought that if the comedy worked out and families came to this movie, then we would be successful. Today that statement has come true. Family audiences are coming to our movie 'Gam Gam Ganesha'. It is said that my name changed from Jabardasth Emmanuel to West Indies with this film. The next two days are the weekend, so we expect a large number of audiences to come to our movie theaters."

Jabardasth Emmanuel said, "When we started the movie, Anand and I thought that if the comedy worked out and families came to this movie, then we would be successful. Today that statement has come true. Family audiences are coming to our movie 'Gam Gam Ganesha'. It is said that my name changed from Jabardasth Emmanuel to West Indies with this film. The next two days are the weekend, so we expect a large number of audiences to come to our movie theaters."

"గం..గం..గణేశా" పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన "గం..గం..గణేశా" సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - మా "గం..గం..గణేశా" సినిమాను ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాము. మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ సీన్స్ కు ఊగిపోతూ నవ్వుతున్నారు. ఫ్యామిలీస్ తో మీడియా మిత్రులు వచ్చి సినిమా చూశారు. మా దర్శకుడు ఉదయ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా రూపొందించారు. అన్ని మేజర్ క్యారెక్టర్స్ కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మా మూవీతో పాటు రిలీజైన మరో రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం సంతోషకరం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి మరోసారి "గం..గం..గణేశా" చూసేందుకు వెళ్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమాకు థియేటర్స్ లో క్లాప్స్, విజిల్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, చెక్ పోస్ట్ సీన్, క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్టులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిషోర్ చేసిన ఆర్గాన్ డేవిడ్ క్యారెక్ట్ కు కూడా హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. మా "గం..గం..గణేశా" సినిమాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ ఆర్గాన్ డేవిడ్, ఇమ్మాన్యుయేల్ చేసిన శంకర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ఆనంద్ కు కూడా కొత్త తరహా సినిమా ఇదని రివ్యూస్ వస్తున్నాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మంచి బీజీఎం ఇచ్చారు. నెక్ట్ మూవీ కూడా ఆయనతోనే చేస్తాం. అన్నారు.

యాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ - "గం..గం..గణేశా"తో మా ఉదయ్ గారు ఫస్ట్ మూవీనే హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆనంద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆయన పర్ ఫార్మెన్స్ అదిరిపోయింది. మా చిత్రానికి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్నారు.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ - మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆనంద్ అన్న నేను అనుకున్నాం ఈ సినిమాకు కామెడీ వర్కవుట్ అయి ఫ్యామిలీస్ వస్తే మనం సక్సెస్ కొట్టినట్లే అని. ఈ రోజు ఆ మాట నిజమైంది. మా "గం..గం..గణేశా" సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. ఈ చిత్రంతో నా పేరు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నుంచి వెస్టిండీస్ గా మారిందని అంటున్నారు. నెక్ట్ టు డేస్ వీకెండ్ కాబట్టి మా మూవీ థియేటర్స్ కు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ వస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్, సపోర్ట్ కు థ్యాంక్స్. ఇటీవల కాలంలో మనకు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రాలేదు. "గం..గం..గణేశా" పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మా మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. ఫస్ట్ మూవీతోనే మా డైరెక్టర్ హిట్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్ ప్రాజెక్ట్ బాగా వచ్చేందుకు పూర్తి సపోర్ట్ అందించారు. ఈ రోజు రిలీజ్ కాబట్టి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసు. ముందు ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా. "గం..గం..గణేశా"లో వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్, యావర్..ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ బాగా వచ్చాయి. ఒక మిస్టికల్ ఎలిమెంట్ కూడా గణేశుడి గురించి ఉంది. అన్నయ్య విజయ్ ఈ సినిమాను రిలీజ్ కు ముందే చూసి బాగుందని చెప్పారు. ఈ వీకెండ్ మా సినిమాకు ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లండి. ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved