11 August 2016
Hyderabad
చియాన్ విక్రమ్, నయనతార, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్‌పై సెప్టెంబర్ 8న విడుదలైన చిత్రం ఇంకొక్కడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చియాన్ విక్రమ్, నిర్మాత నీలం కృష్ణారెడ్డి, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, సహా చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో...
చియాన్ విక్రమ్ మాట్లాడుతూ - ``నేను నటుడిగా పాతిక సంవత్సరాలను పూర్తి చేసుకున్నాను. ఈ జర్నీలో ప్రతి క్యారెక్టర్‌లో ఎంజాయ్ చేస్తూ నటించాను. నన్ను నేను అప్ డేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. నా కంటే ముందు ఎందరో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశారు. అలాంటి వారందరూ నాకు ఇన్‌స్పిరేషన్. అలా నేను నటించిన మరో విలక్షణమైన చిత్రం ఇంకొక్కడు. చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డిగారు విడుదల చేశారు. ఇంత మంచి సినిమాను నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నాతో పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్. ఏ నటుడికైనా సంతృప్తినిచ్చే పాత్ర దొరికనప్పుడు ఉండే అనుభూతి వేరుగా ఉంటుంది. అలాంటి అనుభూతి నాకు ఇంకొక్కడు సినిమాతో కలిగింది. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నేను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేశాను. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేశాను. ఇప్పుడు నా తదుపరి చిత్రం సామి సీక్వెల్ సామి 2 చేయబోతున్నాను. ఇంకొక్కడు సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. తెలుగులోనే కాకుండా కేరళ, కర్ణాటకల్లో కూడా సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది`` అన్నారు.
చిత్ర నిర్మాత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``నేను ఈ సినిమా నిర్మాతగా మారడానికి ముందు నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ పది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. మంచి తెలుగు సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూసి కచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుందని భావించి తెలుగులో హక్కులు కొని రిలీజ్ చేశాను. రిలీజ్ సమయంలో అభిషేక్ పిక్చర్స్ అభిషేక్‌గారు నాకెంతో సహకారం చేశారు. అందుకు అభిషేక్ గారికి థాంక్స్. నేను ఏ నమ్మకంతో అయితే సినిమాను కొన్నాను. ఆ నమ్మకం ఈరోజు సినిమా సక్సెస్ రూపంలో నిజమైనందుకు ఆనందంగా ఉంది. సినిమా చేయక ముందు చాలా మంది మంచి బిజినెస్ ఉండగా సినిమా రంగంలోకి ఎందుకు వెళతున్నావని అన్నారు కూడా. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత వాళ్లందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సినిమా విడుదలైన రోజు నుండి నేటి వరకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ సిరాజ్ సహా గుంటూర్, నెల్లూర్, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొని సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుండటం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.