12 May 2019
Hyderabad
సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి`. మే 9న సినిమా విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌మీట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా..
రైటర్ హరి మాట్లాడుతూ - ``సాధార ణంగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు రావడం చాలా కష్టమైన విషయం. దిల్‌రాజుగారి బ్యానర్‌లో కంఫర్ట్‌గా పనిచేసుకుంటూ వెళుతున్నాను. వంశీగారితో పనిచేయడం వల్ల ఆ గుర్తింపు స్థాయి మరింత పెరిగింది. ఇలాంటి సినిమా ద్వారా మంచి రైటర్‌గా గుర్తింపు సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. రిషి క్యారెక్టర్ ప్రజలకు ఈ స్థాయిలో కనెక్ట్ అయ్యిందంటే మహేష్‌గారే కారణం`` అన్నారు.
కమల్ కామరాజు మాట్లాడుతూ - ``మహర్షి` వంటి మైల్‌స్టోన్స్ అరుదుగా వస్తుంటాయి. నా కెరీర్‌లో మహర్షి అలాంటి మైల్‌స్టోన్ మూవీ. ఈ జర్నీని మరచిపోలేను. చాలా మందికి ఈ సినిమా ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది`` అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ - ``థియేటర్‌లో చాలా రోజుల తర్వాత మంచి రెస్పాన్స్ వస్తోంది. రైతు గొప్పదనం గురించి మహేష్‌గారి నోటి నుండి వంశీగారు అద్భుతమైన డైలాగ్స్ చెప్పించారు. మహేష్‌గారితో దూకుడు, భరత్ అనే నేను సినిమాలు చేశాను. ఆ సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఇంకా పెద్ద హిట్ సాధించింది. పెద్ద హీరోలు ఇలాంటి ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే బావుంటుంది. అల్లరి నరేష్, పోసాని సహా అందరి క్యారెక్టర్స్‌ను బాగా డిజైన్ చేశారు`` అన్నారు.
యుగంధర్ మాట్లాడుతూ - సినిమా మొత్తంలో 96 నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిని 500 మంది టెక్నీషియన్స్‌తో 10 స్టూడియోస్ సపోర్ట్‌తో పూర్తి చేశాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ``మహేష్‌బాబుగారి కెరీర్‌లో ఇదే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమా అవ్వొచ్చు అనేంత పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమా. ఈ సినిమా నుండి వంశీ తెలుగు సినిమాలు కాకుండా హాలవుడ్ సినిమాలను డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎలాంటి కథనైనా తన స్టైల్లో, క్లీన్‌గా, జర్క్ లేకుండా అందంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో మహేష్‌బాబు చాలా అందంగా ఉన్నాడు. నేనే కనుక ఆడపిల్లనై ఉండుంటే తను పెళ్లి చేసుకునే వరకు వెంటపడేవాడిని. ఒకవేళ పెళ్లైపోయుంటే.. ఏదో ఒక ప్లేస్ ఇస్తే చూసుకుంటూ ఉండిపోతానని చెప్పేసేవాడిని. ఇక సినిమా గురించి చెప్పాలంటే ఈరోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని సగానికి పైగా దిల్‌రాజు బ్యానరే బ్రతికిస్తుందని గర్వంగా చెప్పగలను. పెద్ద హీరోల సినిమాలు ఓ పది వరకు రావచ్చు. కానీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు. దిల్‌రాజుగారు పెద్ద హీరో సినిమాను ఎంత ప్రేమించి తీస్తాడో.. చిన్న సినిమాను కూడా అంతే ప్రేమించి తీస్తాడు. దీనివల్ల చాలా మంది టెక్నీషియన్స్ బ్రతుకుతున్నారు. అలాగే అశ్వినీదత్‌గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఇప్పుడు రాజుగారు రైట్ హ్యాండ్‌లా ఎలా ఉంటున్నారో.. అలాగే అశ
్వినీదత్‌రు లెఫ్ట్ హ్యాండ్‌లా ఉండి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సి.అశ్వినీదత్ మాట్లాడుతూ - ``ఈ సెన్సేషనల్ హిట్‌కు ముఖ్య కారకుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. అలాగే మా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ముఖ్యకారణం. సూపర్‌స్టార్ కృష్ణగారి సూపర్‌హిట్ సినిమాలన్నీ రైతు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినవే. రైతుకుంటుంబానికి చెందిన కృష్ణగారి అబ్బాయి మహేష్‌గారు తన 25వ సిపిమాగా రైతు గొప్పతనం గురించి చెప్పే చిత్రంలో నటించడం ఆనందంపడే విషయం. ఈవాళ ఈ సినిమా చరిత్రను తిరగరాస్తుంది. నా అదృష్టానికి ఈ సినిమా సహా మే 9న విడుదల చేసిన నా మూడు సినిమాలు తలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చాయి. చిరంజీవిగారికి, సావిత్రిగారికి, ఈరోజు మహేష్‌గారికి గుర్తుండిపోయే సినిమాలుగా మిగిలాయి. అలాంటి సినిమాలు చేయడం గర్వంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన దిల్‌రాజు, పివిపిగారికి థాంక్స్. దిల్‌రాజుగారిని చూస్తే నాకు డి.రామానాయుడు గారే గుర్తుకు వస్తున్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఈ సినిమా కథ విన్న రోజు నుండి బాగా నమ్మాను. ఆ నమ్మకమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా నన్ను బాగా మాట్లాడించింది. నేను ఆరోజు మాట్లాడింది ఈరోజు నిజమైనందుకు గర్వంగా ఉంది. మహేష్‌బాబుగారి 25వ సినిమా ఇలా ఎపిక్ కావడం ఆనందంగా ఉంది. మహేష్‌గారి 25వ సినిమాలో రైతుల గురించి చేయడం ఆనందాన్ని మించిన ఫీలింగ్‌ను ఇస్తుంది. వంశీ కథ చెప్పినప్పటి నుండి నేను, మహేష్‌గారు అందరం నమ్మాం. ఈ రోజు సినిమా ఓక్లాసిక్ సినిమా అయినందుకు .. ఎంటైర్ టీం ఎంత కష్టపడింతో నాకు తెలుసు. ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మా సినిమాను ఎపిక్ బ్లాక్ బస్టర్ చేసిందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంత పెద్ద విజయం అవుతుందో లైన్ వేసి చెప్పలేను. ఓ సినిమా సక్సెస్ అవుతున్నప్పుడు అది గ్రేట్ మూమెంట్స్‌గా నిలుస్తాయి. అశ్వినీదత్‌గారి సినిమాలను మా మహేందర్ రెడ్డిగారు, నరసింహారెడ్డిగారు వెంకటలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై విడుదల చేసేవాళ్లం. జగదేకవీరుడు-అతిలోకసుందరి 100 డేస్ ఫంక్షన్‌కి నేను నార్మల్‌గా వెళ్లాను. తర్వాత ఆయన గురించి వాళ్లు చెబితే నాకు తెలిసింది. రామానాయుడు గారి నుండి దత్తుగారికానీ, అరవింద్‌గారు కానీ, ఎం.ఎస్.రాజుగారు, శ్యాంప్రసాద్ రెడ్డిగారు.. ఇలా ఎంతో మంది లెజెండ్రీ ప్రొడ్యూసర్స్ నాకు ఇన్‌స్పిరేషన్. సినిమా గురించి వాళ్లెంత కష్టపడతారో నాకు తెలుసు. కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. అదే నా గతం. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమా. ఈవాళ మనం తింటున్న తిండిని ఇస్తున్న రైతుల గురించి తీసిన ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. వంశీ పైడిపల్లి గొప్ప సినిమా తీశాడు. ఈ సినిమాను నిలబెట్టుకోవడం ఇకపై వంశీకి పెద్ద టాస్క్ అవుతుంది. దేవిశ్రీ పదరా పదరా .. అనే సాంగ్ సహా అల్టిమేట్ సాంగ్ ఇచ్చారు. సినిమాను చూసిన ప్రేక్షకులు బలమైన ఎమోషన్స్‌తో బయటకు వస్తన్నారు. మహేష్‌గారి కెరీర్‌లో ఫస్ట్ వీక్‌లోనే అన్నీ రికార్డ్స్‌ను క్రాస్ చేయబోతున్నాం. నా డిస్ట్రిబ్యూటర్స్ కూడా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భరత్ అనే నేను ఎంత కలెక్ట్ చేసిందో నాకు అంత మీరు కట్టండి అని నేను అడిగాను. వాళ్లు ఎవరూ ఆలోచించకుండా, అలాగే అని చెప్పారు. ఇప్పుడు ప్రతి షోకు వాళ్లు ఫోన్ చేసి నాకు ఎనర్జీ ఇస్తున్నారు. నమ్మి చేసినందుకు డిస్ట్రిబ్యూటర్స్‌కు థాంక్స్`` అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ``రాజుగారు మా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. ఆయనతో నా ట్రావెల్ అలా ఉంటుంది. న్యూయార్క్‌లో నేను ఈ కథ విన్నాను. ఈ మూవీ స్టార్ట్ కాకముందు భరత్ అనే నేను సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పటికీ వంశీ నాకు కథ ఇంకా చెప్పలేదు. మహేష్‌గారు వంశీ గురించి మాట్లాడుతూ `వంశీ చాలా ప్యాషనేట్ కదా ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడుగా!.` అన్నారు. వంశీ గురించి మహేష్‌గారు అలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వంశీతో నాకు వర్షం నుండి పరిచయం ఉంది. కథ విన్న తర్వాత చాలా టచ్ అయ్యింది. కొన్ని సీన్స్ విని కన్నీళ్లు పెట్టుకున్నాను. వంశీ ఇంకా ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలనుకుంటున్నాను. మహేష్‌గారు, ప్రతి టెక్నీషియన్‌కు గొప్ప గౌరవాన్ని ఇస్తుంటారు. అందుకనే ప్రతి టెక్నీషియన్ ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలనుకుంటారు. నరేష్‌గారిలో గొప్ప నటుడున్నారు. ఆయన పాత్రలో ఉన్నదాని కంటే, మించి నటించారు. ఇక మహేష్‌లాంటి స్టార్ ఏదో ఒక కమర్షియల్ సినిమా చేయవచ్చు. కానీ దాన్ని మించిన సినిమా చేయాలనుకోవడమే పెద్ద స్టార్ డమ్ అని నేను అనుకుంటున్నాను. మహేష్, వంశీగారే ఈ అమేజింగ్ సక్సెస్‌కు క
ారణం`` అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ - ``మా పాప పుట్టిన రెండో వారం నాకు వంశీగారి నుండి ఫోన్ వచ్చింది. ఇలా మహేష్‌గారి సినిమా గురించి మాట్లాడాలని నన్ను పిలిచారు. ముందు మహేష్‌గారి సినిమాలో నేనేంటి? అనిపించింది. సరే! మంచి కామెడీ క్యారెక్టర్ అయ్యుంటుందేమో! అని వెళ్లాను. ఆయన 20 నిమిషాలు నెరేషన్ ఇచ్చారు. అంతా పూర్తయిన తర్వాత ఈ క్యారెక్టర్‌లో నన్ను ఎలా ఊహించుకుంటున్నారు అని వంశీని అడిగాను. ఈ విషయం మహేష్‌గారికి తెలుసా? అని అనగానే, ఆయన ముందు మిమ్మల్ని అడగమన్నారు అనగానే, చాలా హ్యాపీగా అనిపించింది. సాధారణంగా నేను కామెడీ చేస్తాను. అలాంటిది ఓ సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తానని నమ్మి ఇచ్చినందుకు మహేష్‌గారికి, వంశీగారికి థాంక్స్. వైజయంతీ మూవీస్ అంటే చాలా పెద్ద సంస్థ.. ప్రతి ఒక యాక్టర్, టెక్నీషియన్ ఆ సంస్థలో చేయాలనుకుంటారు. మే 9న జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు విడుదలైయ్యాయి. ఇప్పుడు మహర్షి విడుదలైంది. ఇక దత్తుగారు మే 9కి ఓ సినిమా రెడీ చేసుకోవాలేమో. దిల్‌రాజుగారు, వైజయంతీ మూవీస్, పివిపి వంటి మూడు టాప్ బ్యానర్స్ చేస్తున్న సినిమాలో చేశాను. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్‌ను నెక్ట్స్ రేంజ్‌లో చేశారు. మహేష్‌గారితో పనిచేయడం గొప్ప అనుభవం. సీన్‌ను బట్టి మూడ్ క్యారీ చేసేవారు. చిన్న రియాక్షన్‌ను కూడా పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకుంటారు. పర్‌ఫెక్షన్‌కి ఆయనే నిదర్శనం అనిపించింది. మా నాన్నగారు ఉండుంటే చాలా గర్వపడేవారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్‌గా గర్వపడేవారు. డైరెక్టర్ కంటే ముందు ఆయన ఒక రైతు. రైతుగా కూడా గర్వపడేవారు. చాలా సినిమాలు చేస్తాం. పేరొస్తది.. కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాలకే వస్తది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్‌నిచ్చింది`` అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ``మదర్స్‌డే శుభాకాంక్షలు. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ప్రపంచం కూడా నమ్మలేదు. కానీ మా అమ్మగారు నమ్మారు. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే కారణం మా అమ్మే. సినిమా తర్వాత ఇంటికి వెళితే అమ్మ, నాన్న హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాని కన్నా విజయాన్ని నేను ఇక అడగలేను. ఒక కొడుకుగా నన్ను ఇలా పెంచినందుకు అమ్మకు థాంక్స్. హరి, సాల్మన్‌కి థాంక్స్. వారు నన్ను వెన్నంటే ఉండి నడిపించారు. మోహనన్‌గారికి, రామ్‌లక్ష్మణ్‌గారికి, యుగంధర్ ఇలా ప్రతి ఒక్కరికీ థాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌తో 17ఏళ్ల జర్నీ ఇది. మా ఫ్రెండ్‌షిప్‌కు గుర్తుగా తనకు ఈ సినిమాను డేడికేట్ చేస్తున్నాను. తను అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అమేజింగ్‌గా ఇచ్చారు. సినిమాను మ్యూజికల్ నెరేషన్‌గా చెప్పడం దేవికే చెల్లింది. అలాగే శ్రీమణి నేను చెప్పాలనుకున్న భావాన్ని సింగిల్ లైన్‌లో చెప్పేశారు. ఇక ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఇక నిర్మాతలు గురించి చెప్పాలి. అశ్వినీదత్‌గారు చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి పట్టింది. అదే మే 9న నా సినిమా ఆయన నిర్మాణంలో రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా క్యాలెండర్‌పై వైజయంతీ బ్యానర్‌పేరు రాసేయొచ్చు. సినిమా విడుదల సమయంలో ఆయన అందించిన సపోర్ట్‌కి థాంక్స్. పివిపిగారు విడుదలకు ముందు రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆయనకు థాంక్స్. ఇక దిల్‌రాజుగారు నాకు డైరెక్టర్‌గా జన్మినిచ్చారు. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నా ఫ్యామిలీ. రాజీవ్‌కనకాల, గురుస్వామి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, కమల్‌కామరాజు, శ్రీనివాసరెడ్డి, జగపతిబాబు, జయసుధగారు, ప్రకాష్‌రాజ్‌గారు, పూజా హెగ్డే సహా అందరికీ థాంక్స్. నరేష్‌గారు క్యారెక్టర్‌ను తీసుకుని చేసిన విధానం, ఎవరూ మరచిపోలేరు. వంశీగారు నా యంగర్ బ్రదర్ అని ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు. ప్రతి క్షణం ఆయనతో నేను ఆస్వాదించాను. ఈ జర్నీలో ఆయన అందించిన సపోర్ట్ మరచిపోలేను. మొన్న ఆయనతో కలిసి ఆయనింట్లో హోం థియేటర్‌లో సినిమా చూశాను. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు, వంశీ యు మేడ్ ఎ క్లాసిక్, బిలివ్ ఇట్ చెప్పిన మాటలను మరచిపోలేను. ఈరోజు మహర్షి ఇంత మంచి రెస్పాన్స్ రాబట్టుకుందంటే 80 శాతానికి పైగా కారణం మహేష్‌గారే. ఒక మంచి సినిమాను తీస్తే ఎలా ఆదరిస్తారనే దాన్ని నిరూపించిన తెలుగు ప్రేక్షకులకు, సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనసుతో ఈ సినిమాను చూశారు. రైతు గురించి మేం ఏ సిస్టంను ప్రశ్నించలేదు. రైతు గురించి ఓ ఆర్టికల్ వచ్చినప్పుడు సింపతీ చూపిస్తున్నాం కానీ.. ఆ సింపతీ ఈరోజు మన మీద మనమే చూపించుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పే ఆలోచనను క్రియేట్ సినిమా ఇది. మనం సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎవరూ చేయలేని సొల్యూషన్స్ కాదు.. మనం చేయగలిగే పరిష్కారమే. మేం ఒక ఎకరం పొలం కొనుక్కోవాలనే ఆలోచనను క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. ఎపిక్ బ్లాక్‌బస్టర్ అంటున్నారు. దీంతో పాటు వీరు మాకు ఇచ్చిన గౌరవానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను`` అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ - ``నా 25 సినిమాల జర్నీ ఎంతో ప్రత్యేకం. అందులో ఈ సినిమా మరింత ప్రత్యేకం. మదర్స్ డే.. అమ్మంటే దేవుడితో సమానం. ప్రతిసారి అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. అలా తాగితే నాకు దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది నాకు. ఆవిడ ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ సక్సెస్‌ను అమ్మలందరికీ డేడికేట్ చేస్తున్నాను. దేవిశ్రీ ట్రూలీ రాక్‌స్టార్. నాకు దేవి అంటే ప్రాణం.` పదరా పదరా..` `ఇదే కదా ఇదే కదా..` సాంగ్స్ కథలో భాగంగా వెళతుంటాయి. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ తనలా కంపోజ్ చేయలేరేమో. ఇప్పటికీ నాకు గూజ్‌బమ్స్ వస్తున్నాయి. ఈ సినిమా మూడేళ్ల ప్రాసెస్. మరచిపోలేని అనుభవాలున్నాయి. దిల్‌రాజుగారు తొలిసారి కథ విని క్లాసిక్ అన్నారు. నాకు ఫోన్ చేశారు. గత ఏడాది దత్తుగారు కథ విని, ఈ సినిమా ఓ గేమ్ చేంజర్ అవనుంది ప్రిన్స్ అన్నారు. డబుల్ చేంజర్ చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లాను. చివర్లో దోని సిక్స్ కొట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌రాజుగారు సిక్సర్ కొట్టాం అనగానే అంతే ఆనందం వేసింది. మూడు పెద్ద బ్యానర్స్ లో నా సినిమా రావడం గర్వంగా ఉంది. సాధారణంగా దత్తుగారు ప్రిన్స్, బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తుంటారు. అలా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అలా పిలిచారు. మహేష్ ..నువ్వు సమ్‌థింగ్ ఎల్స్.. ఈసినిమా కూడా సమ్‌థింగ్ ఎల్స్ అన్నారు. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వన్ వీక్‌లో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ఆడియన్స్, నా అభిమానులకు హ్యాట్సాఫ్. ముందుగా నరేష్‌గారికి థాంక్స్.. ఎందుకంటే, ఆయన ఈ క్యారెక్టర్‌ను చేస్తాడా? అనుకున్నాను. కానీ.. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. వంశీ గురించి చాలా విషయాలే చెప్పాను. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా కాలర్ ఎత్తుకుంటున్నాను.