సాయిరాం శంకర్, శరత్ కుమార్, రేష్మీ మీనన్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ``నేనోరకం``. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దేపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 17న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో...
మహిత్‌నారాయణ్ మాట్లాడుతూ - ``నేనోరకం సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. సాయిరామ్ శంకర్, శరత్‌కుమార్‌గారు మధ్య డ్రామా చక్కగా పండింది. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అన్నయ్య చక్రికి, పూరి అన్నయ్యకు మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందో నాకు, సాయిరాం శంకర్‌కు మధ్య అంత మంచి రిలేషన్ ఉంది. మా కాంబినేషన్‌లో సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది`` అన్నారు.
దేపా శ్రీకాంత్ మాట్లాడుతూ - ``కథ విన్నప్పుడు సినిమాను ఎలాగైతే చేయాలనుకున్నామో అలాగే తెరకెక్కించాం. శరత్‌కుమార్‌గారు ఎంతో మంచి ఇన్‌పుట్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. సాయిరాం శంకర్ చక్కగా పెర్‌ఫార్మ చేశాడు. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ సుదర్శన్ సలేంద్ర మాట్లాడుతూ - ``ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ సాధించడానికి కారణం నిర్మాతగారే. సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. క్రెడిట్ అంతా నిర్మాతగారికే దక్కుతుంది. మా కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. శరత్‌కుమార్‌గారు ఈ సినిమాలో యాక్ట్ చేయకపోతే సినిమాకు అంత ప్రాముఖ్యత వచ్చేది కాదు. శరత్‌కుమార్‌గారు చక్కగా కో ఆపరేట్ చేశారు. అలాగే సాయిరాం చక్కగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
రామ్ శంకర్ మాట్లాడుతూ - ``నాకు ఆరేడేళ్ళుగా మంచి హిట్ లేదు. బంపర్ ఆఫర్ తర్వాత నాకు వచ్చిన హిట్ ఇది. ఈ సినిమా కథ విని ఒప్పుకోకుంటే మంచి క్యారెక్టర్ మిస్ అయ్యేవాడిని. శరత్‌కుమార్‌గారు దగ్గరుండి చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. మహిత్ చాలా మంచి మ్యూజిక్, ఆర్.ఆర్ ఇచ్చాడు`` అన్నారు.
శరత్‌కుమార్ మాట్లాడుతూ - ``మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేలా సినిమా తీస్తే పెద్ద హిట్ అవుతుందని భావించాను. మేం ఇచ్చిన మెసేజ్ అందరికీ నచ్చింది. చెన్నైలో కూడా ఓ థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దర్శకుడు సుదర్శన్ చక్కగా హ్యండిల్ చేశాడు. నిర్మాత కూడా ఖర్చు వెనుకాడకుండా సినిమాను అనుకున్నట్లుగా పూర్తి చేశాడు. మహిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తమిళంలో ఈ సినిమాను చేయాలనుకుంటే నేనే రీమేక్ రైట్స్ కొని నిర్మిస్తాను`` అన్నారు.