pizza
O Sthri Repu Raa success meet
‘ఓ స్త్రీ రేపు రా’ సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 March 2016
Hyderabad

రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆశిష్‌ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌, శృతి మోల్‌, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. అశోక్‌ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమాను మార్చి 11న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ ‘’ ఈ నెల 11న విడుదలైన మా ఓ స్త్రీ రేపు రా అనే చిత్రానికి అపూర్వ స్పందన రావడం చాలా హ్యపీగా ఉంది. అన్నీ ఏరియాస్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్స్ సంఖ్యను కూడా పెంచాం. దెయ్యముందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన ఈ చిత్రాన్ని చూసి మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మనాలి రాథోడ్ మాట్లాడుతూ ‘’సినిమాలో కళ్యాణి అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది ఫోన్ చేసి అప్రిసియేట్ చేస్తున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

శృతిమోల్ మాట్లాడుతూ ‘’కొత్త టీం చేసిన ప్రయత్నం. మా ప్రయత్నాన్ని ఆదిరించిన ప్రేక్షకులకు థాంక్స్. సినిమాను మరింత విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొని చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved