pizza
Pelli Choopulu success meet
`పెళ్ళిచూపులు` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 August 2016
Hyderaba
d

స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్‌ కందుకూరి(ధర్మ పథ క్రియేషన్స్‌), యష్‌ రంగినేని(బిగ్‌ బెన్‌ సినిమాస్‌) నిర్మాతలుగా కొత్త దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవర కొండ, రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం 'పెళ్ళిచూపులు'. ఈ చిత్రం జూలై 29న విడుదలైంది. సినిమా మంచి స‌క్సెస్‌ను సాధించిన సందర్భాన్ని పుర‌స్క‌రించుక‌ని చిత్ర‌యూనిట్ ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడులో పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా....

అఖిల్ మాట్లాడుతూ ``త‌రుణ్‌భాస్క‌ర్‌తో నాకు ఎప్ప‌టి నుండో ప‌రిచయం ఉంది. త‌ను డైరెక్ట్ చేసిన అనుకోకుండా షార్ట్ ఫిలిం చూశాను. చాలా బాగా న‌చ్చింది. నాకు కూడా మంచి లవ్ స్టోరీ ఉంటే చెప్ప‌మ‌న్నాను. కానీ త‌నేం చెప్ప‌లేదు. ఇప్పుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి చిత్రంతోనే మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. యూనిట్ కు అభినంద‌న‌లు`` అన్నారు.

Glam gallery from the event

నందినీ రెడ్డి మాట్లాడుతూ ``సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ నిజాయితీతో వ‌ర్క్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ను తాము ఈ చిత్రంలో వెతుక్కుంటారు. త‌రుణ్‌భాస్క‌ర్ ఈ సినిమాను అంత అందంగా తెర‌కెక్కించారు. మంచి సినిమాగా మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు పాటు ఈ సినిమా గురించి అంద‌రూ మాట్లాడుకుంటారు`` అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌రకొండ మాట్లాడుతూ ``ఈ సినిమా స‌క్సెస్ నాకు మంచి గుర్తింపునిచ్చింది. నేనే కాదు యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రూ చాలా హ్యాపీగా ఉన్నారు. నిజానికి నేను ద‌ర్శ‌కుడు కావాల‌నేది మా నాన్న క‌ల‌. అయితే నేను న‌టుడిగా మారాను. ఈ సినిమా స‌క్సెస్‌తో నాకు చాలా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి`` అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``. త‌రుణ్ భాస్క‌ర్ చ‌ప్పిన క‌థ నాకు నచ్చడంతో నేను సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఈ ప్రయాణంలో యష్‌ రంగినేనిగారు లైన్‌ విని ఆయన కూడా సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నేను నమ్మి చేసిన కథ. పది సంవత్సరాల్లో నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు.అంద‌రికీ మంచి గుర్తింపునిచ్చింది`` అన్నారు.

నాగ అశ్విన్ మాట్లాడుతూ ``ఈ స‌క్సెస్ ఈ యూనిట్‌కే కాదు, అంద‌రి కొత్త ఆలోచ‌న‌ల‌కు ఊపిరి పోసింది. సినిమా స‌క్సెస్ లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ నా అభినంద‌న‌లు`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిత్ర‌యూనిట్‌కు జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved