మాస్ హీరో విశాల్, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'రాయుడు'. విశాల్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగులో విడుదల చేశారు. సినిమా మే 27న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో ఈ చిత్ర సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ..
హీరో విశాల్ మాట్లాడుతూ ‘’రాయుడు సినిమా నా కెరీర్ లో స్పెషల్ మూవీ. తెలుగు, తమిళం నుండి మంచి అప్లాజ్ వస్తుంది. ఈ చిత్రంలో రాయుడు క్యారెక్టర్ నే అందరూ బాగా గుర్తు చేసుకుంటున్నారు. నేను చేసిన ప్రయత్నంలో నాకు వచ్చిన గెలుపే ఈ చిత్రం. ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా. తను బెస్ట్ సినిమాను రూపొందించారు. తెలుగు, తమిళంలో నా కెరీర్ లో బెస్ట్ మూవీగా రాయుడు నిలిచింది. దీంతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ముత్తయ్య దర్శకత్వంలో మరో సినిమాను వచ్చే ఏడాది చేయడానికి ప్రయత్నిస్తాను. సినిమా థియేటర్ లో ఆడియెన్స్ నుండి వస్తోన్న రెస్పాన్స్ చూసి పొగరు సినిమా గుర్తుకు వస్తుంది. శ్రీదివ్య, సూరి, లీలాగారు అందరూ బాగా యాక్ట్ చేశారు. అలాగే పందెంకోడిలో నేను చేసిన యాక్షన్ సీక్వెన్స్ లనే రెఫరెన్స్ గా ఇప్పటి వరకు తీసుకుంటూ వచ్చాను. రాయుడు సినిమాలో అనల్ అరసుగారు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లను కంపోజ్ చేశారు. దాంతో ఇప్పటి నుండి నా నెక్ట్స్ సినిమాలకు ఈ సినిమా యాక్షన్ పార్ట్ నే రెఫరెన్స్ గా తీసుకుంటాను. సినిమా సక్సెస్ అయిన తర్వాత నన్ను థియేటర్ కు ఎందుకు తీసుకెళ్లడం లేదనడమే, స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావురా అని అమ్మ కోపడ్డారు. ఈ సినిమా సక్సెస్ తో బాధ్యతలు మరింత పెరిగాయి. తెలుగు ప్రేక్షకులు నా మొదటి సినిమా సమయంలో ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తున్నారు. ఈ సి నిమా తెలుగు, తమిళంతో పాటు కేరళ, కర్ణాటక, ఓవర్ సీస్ లో మంచి బిజినెస్ చేసింది. నాన్నగారు పందెంకోడి సినిమాకు చేసిన ప్రయత్నమే నన్ను ఇంత వరకు నడిపించింది. ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
Sri Divya Glam gallery from the event
నిర్మాత హరి మాట్లాడుతూ ‘’సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. శ్రీదివ్య చాలా చక్కగా నటించడమే కాకుండా ప్రమోషన్ విషయంలో బాగా కో ఆపరేట్ చేశారు. విశాల్ గారు నాకు రియల్ లైఫ్ లో కూడా హీరోయే. సినిమా మొదటి వారంలో ఐదు కోట్లను కలెక్ట్ చేసింది. రెండో వారంలో 200 థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది’’ అన్నారు.
శ్రీ దివ్య మాట్లాడుతూ‘’సినిమా పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. ముత్తయ్య, వేల్ రాజ్ సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. సూరిగారు, లీలాగారు నటించిన సన్నివేశాలకు మంచి స్పందన వస్తుంది. భాగ్యలక్ష్మి క్యారెక్టర్ చేయడానికి చాలా కేర్ తీసుకుని నటించాను’’ అన్నారు.