ప్రముఖ నిర్మాతదిల్ రాజు సమర్పణలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘రోజులు మారాయి’. మురళీకష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. జూలై 1న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, మురళీకృష్ణ, జె.బి. పార్వతీశం, చేతన్ మద్దినేని, ఉద్ధవ్, రవినంబూరి, శశాంక్, అప్పారావు, కాసర్లశ్యాం తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో...
మారుతి మాట్లాడుతూ ``నేను బాబు బంగారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ దిల్‌రాజుగారు సినిమాపై కేర్ తీసుకున్నారు. సినిమా అంతా పూర్తయినా అయనే దగ్గరుండి ఎడిటింగ్ చేయించారు. సినిమాను సక్సెస్ చేసిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. సక్సెస్ టూర్‌లో ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రానికి 5కోట్ల84 లక్షల రూపాయల గ్రాస్ రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమా సక్సెస్ చిన్న సినిమాల సక్సెస్ కు ఆక్సిజన్‌లా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ ``నేను దర్శకుడిగా మారడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మధ్యలో మూడు సీరియల్స్ చేసి నంది అవార్డులు కూడా అందుకున్నాను. అయితే నేను సినిమాల్లో దర్శకుడు కావాలనేదే అంతిమలక్ష్యంగా వర్క్ చేసి ఈ సినిమాకు దర్శకత్వం చేశాను. నేను దర్శకుడిగా మారడంలో మారుతిగారు, దిల్‌రాజుగారిదే కీ రోల్. మారుతిగారు ఆయన రాసుకున్న కథను నాకు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. టీంలో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డిగారు ఉన్న లిమిటేషన్స్‌లో ప్రతి సీన్‌ను రిచ్‌గా చూపించారు. జెబిగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ సహాయ సహాకారాలను అందించారు`` అన్నారు.
Manjusha Glam gallery from the event
పార్వతీశం మాట్లాడుతూ ``నేను దర్శకుల హీరోని, వారేం చెబితే అది చేసుకుంటూ పోతాను. కేరింత సినిమాతో నన్ను నూకరాజు అని పిలిచారు.ఈ సినిమాతో నన్ను పీటర్ అని పిలుస్తున్నారు. దిల్‌రాజు, మారుతిగారు సపోర్ట్‌తో సినిమాను చక్కగా చేశాను. అందరికీ థాంక్స్`` అన్నారు.
చేతన్ మద్దినేని మాట్లాడుతూ ``సినిమా సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. హీరోగా నా తొలి చిత్రమిది. ఈ సక్సెస్‌ను నాకు ఇచ్చిన ప్రేక్షకులకు, మారుతిగారికి, దిల్‌రాజుగారికి, నిర్మాత శ్రీనివాస్‌గారు సహా టీంకు థాంక్స్`` అన్నారు.
జెబి మాట్లాడుతూ ``ఈ సినిమాలో నా మ్యూజిక్‌కు మంచి పేరు వచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ఇంకా మంచి పేరు వచ్చింది. మారుతిగారికి, దిల్‌రాజుగారికి అందరికీ థాంక్స్`` అన్నారు.